Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
హాట్ స్టార్‌గా అరియానా.. ఐటెం రాణి హారిక.. బెస్ట్ విలన్ మెహబూబ్.. బిగ్‌బాస్‌లో అవార్డుల పంట
బిగ్ బాస్ ఇంటిలో ఏడో వారాంతం సందడిగా సాగిపోయింది. నాగార్జున లేకపోయినప్పటికీ.. ఆయన తన గురించి చెబుతూ వీడియోను బిగ్‌బాస్ టీమ్ ప్రసారం చేసింది. వైల్డ్ డాగ్ షూటింగు కోసం హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాను అంటూ నాగ్ చెప్పిన తర్వాత షో మొదలైంది. ఈ వారంలో షూట్ చేసిన ప్రేమ మొదలైంది షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇంట్లో జరిగిన విషయాలు ఏమిటంటే..
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రీమియర్ షో
ఇంటిలో ప్రేమ మొదలైంది ప్రీమియర్ షో ప్రారంభమైంది. ఈ స్పెషల్ షో కోసం చిత్రంలో నటించిన నటీనటులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యాంకర్ లాస్య, సోహైల్ సయ్యద్ హోస్టులగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులకు, ప్రేక్షకులు, నటీనటులకు స్వాగతం పలికారు. బిగ్‌బాస్ తెరపై ప్రేమ మొదలైంది షోను ప్రారంభించారు.
ఎమోషనల్ ప్రేమ కథ
నటీనటులు చప్పట్లు, ఈలల మధ్య ప్రేమ మొదలైంది సినిమా ఆరంభమైంది. టైటిల్స్ పాత్రలను పరిచయం చేశారు. అరియానా, అవినాష్ ప్రేమకథ, అఖిల్‌పై మనసుపడ్డ మోనాల్ కథను దర్శకుడు అభిజిత్ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అరియానాను వేధిస్తున్న మెహబూబ్‌కు అఖిల్, మెనాల్ బుద్ది చెప్పి జైలుకు పంపించడంతో ఇంటర్వెల్ టైటిల్‌తో తొలిభాగం ముగిసింది.
ప్రేమ మొదలైంది క్లైమాక్స్
ఇక జైలు నుంచి రిలీజైన తర్వాత మెహబూబ్.. అఖిల్‌పై కక్ష పెంచుకోవడంతో కథలో ట్విస్టు మొదలవుతుంది. మెహబూబ్‌కు బుద్ధి చెప్పడం, ఆ తర్వాత అఖిల్, అవినాష్ ప్రేమ కథలు సుఖాంతం అవుతాయి. ఆ తర్వాత అవార్డుల కార్యక్రమం మొదలైంది.
Recommended Video
బీబీ అవార్డులు అందుకొన్ని సెలబ్రిటీలు
బీబీ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్ యాక్టర్‌గా అవినాష్, అఖిల్ సార్థక్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా నోయల్ సీన్, ఉత్తమ విలన్‌గా మెహబూబ్గా ఎంపికయ్యారు. బెస్ట్ స్టైలిష్ట్ అవార్డు లాస్యకు, డ్రీమ్ గర్ల్ అవార్డు మోనాల్‌కు, మిర్చి అవార్డును అరియానా, అవుట్‌స్టాండింగ్ కొరియోగ్రాఫర్ రాజశేఖర్ అమ్మాకు లభించాయి.