For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: శ్రీసత్య నిక్ నేమ్ ఇదే.. అర్జున్ కల్యాణ్ గురించి షాకింగ్ గా నటి కామెంట్స్

    |

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ బిగ్ బాస్ హౌజ్ లో 10 వారాలు గడవగా 11 మంది ఇంటి సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెళ్లారు. ఇక ఈ వారం నామినేషన్లలో 10 మంది ఇంటి సభ్యులకు 9 మంది నామినేట్ అయ్యారు. తాజాగా ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ఎవిక్షన్ పాస్ కోసం పోటీ పెట్టారు. ఇందులో ఫైమా గెలిచింది.

    శ్రీహాన్, రేవంత్ గట్టి పోటి ఇచ్చారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీబీ కేఫ్ కు నటి, శ్రీసత్య ఫ్రెండ్ స్నిగ్ధ హాజరయ్యారు.

    శ్రీసత్య ఫ్రెండ్ హాజరు..

    శ్రీసత్య ఫ్రెండ్ హాజరు..

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు ప్రస్తుతం సీజన్ కంటెస్టెంట్ శ్రీసత్య ఫ్రెండ్, నటి స్నిగ్ధ హాజరైంది. ఆమెకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వేసి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ రాబట్టింది అరియానా గ్లోరి.

    శ్రీసత్యవి ట్రూ ఫీలింగ్సేనా..

    శ్రీసత్యవి ట్రూ ఫీలింగ్సేనా..

    శ్రీసత్య మీకు పర్సనల్ గా బాగా తెలుసు.. బయట బిహేవియర్.. లోపల బిహేవియర్ ఒకేలా ఉందా అని అరియానా గ్లోరి అడగ్గా.. రియాలిటీ షో అంటే రియల్ గా ఉండటం. తను బయట ఎలా ఉంటుందో రియల్ గా లోపల కూడా అలాగే ఉందని స్నిగ్ధ తెలిపింది. అన్ని ట్రూ ఫీలింగ్సేనా అని అరియా అడిగితే.. మావోడికి (శ్రీసత్య) అంతా అని ఆపేసి నవ్వేసింది.. దీంతో మీవోడు ఏంటండి అని క్యూరియాసిటీగా అడిగింది అరియానా. సత్తిగాడు.. సత్తిగాడు అంటుంటాం అని స్నిగ్ధ తెలిపింది.

    శ్రీసత్య కన్నింగ్ అంటున్నారు..

    శ్రీసత్య కన్నింగ్ అంటున్నారు..

    స్నిగ్ధ సత్తిగాడు అనేసరికి.. శ్రీసత్య.. సత్తిగాడా.. అని సరదాగా అంది అరియానా గ్లోరి. తన ఫ్రెండ్ షిప్ ఎలా అనిపిస్తుందన్న ప్రశ్నకు.. ఎవర్నైనా కలవగానే వెంటనే అల్లుకుపోయి.. ఎప్పటినుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడే రకం కాదు అని స్నిగ్ధ ఆన్సరిచ్చింది. మీ సత్తిగాడు కన్నింగ్ అని హౌజ్ మేట్స్ అంటున్నారని అరియానా అడిగిన ప్రశ్నకు.. స్నిగ్ధ నవ్వేసింది. దీంతో ఏంటీ అలా నవ్వేసారు అని మళ్లీ అరియానా ప్రశ్నించింది. కాదు తను కన్నింగ్ అంటే నిజంగా నాకు నవ్వొస్తుందని స్నిగ్ధ తెలిపింది.

    నెగెటివ్ యాంగిల్ ఎందుకు..

    నెగెటివ్ యాంగిల్ ఎందుకు..

    కీర్తితో గొడవైనప్పుడు మాత్రం తన బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేసింది కాసేపు అని అరియాన అంటే.. కామేడీ అండి.. కంటెంట్ అండి అని స్నిగ్ధ తెలిపింది. దీనికి అమ్మ బాబోయ్ కంటెంట్ కోసం ఇలా కూడా చేస్తారండీ.. అని అరియానా అంటే.. ఏ అన్ని నెగెటివ్ యాంగిల్ లో ఎందుకు చూడటం అని తిరిగి క్వశ్చన్ చేసింది స్నిగ్ధ. స్టార్టింగ్ లో శ్రీసత్య టచ్ చేస్తే నచ్చదు.. క్లోజ్ గా ఉంటే నచ్చదని చెప్పిందన్న అరియానా ప్రశ్నకు.. అందరూ డే 1 నుంచి హై దా దా.. అని రాసుకుపూసుకు తిరుగుతారా అని స్నిగ్ధ అంది.

    అర్జున్ కల్యాణ్ ఇంటెన్షన్ ఎంటో తెలుసు..

    అర్జున్ కల్యాణ్ ఇంటెన్షన్ ఎంటో తెలుసు..

    స్నిగ్ధ ఆన్సర్ కి.. అర్జున్ కల్యాణ్ తను బయట నుంచే ఫ్రెండ్స్ కదా అని అరియానా అడగ్గా.. అర్జున్ కల్యాణ్ ఇంటెన్షన్ ఎంటో అందరికీ తెలుసు అని స్నిగ్ధ అంది. స్నేక్స్ అండ్ లాడర్ టాస్క్ లో శ్రీహాన్ వేరే టీమ్ అయినా సరే శ్రీసత్య వెళ్లి సపోర్ట్ చేసిందన్న అరియాన క్వశ్చన్ కి.. ఫ్రెండ్ షిప్ అండి అని స్నిగ్ధ తెలిపింది. దీంతో ఎలా అండి.. వాళ్లు ఆడట్లేదండి.. మీరు ఇక్కడ ఆడుతున్నారండీ గేమ్ అని అరియానా గ్లోరి అంది. దీనికి లేదండి అని సమాధానం ఇచ్చింది స్నిగ్ధ.

    రేవంత్ చిన్న పిల్లోడు..

    రేవంత్ చిన్న పిల్లోడు..

    మరి రేవంత్ గేమ్ ఎలా అనిపిస్తుందని అరియానా అడగ్గా.. రేవంత్ నాకు చిన్న పిల్లోడిలా కనిపిస్తాడని స్నిగ్ధ ఆన్సర్ ఇచ్చింది. దీంతో.. రేవంత్ చిన్న పిల్లోడా.. అమ్మో.. ఆయన అగ్రెసివ్ నెస్ చూస్తుంటే అసలు చిన్న పిల్లోడిలా అనిపిస్తున్నాడా అండి అని అరియానా షాక్ అవుతూ అంది. చిన్నపిల్లలకు అగ్రెసివ్ నెస్ ఉండదని ఎవరన్నారండి అని స్నిగ్ధ పేర్కొంది.

    ఏకే 47 పెట్టుకుని ఉంటుంది..

    ఆవేశం ఆటకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అన్న ప్రశ్నకు.. అంతా ఎఫెక్ట్ అవుతుందని అనిపించట్లేదండి. ఎందుకంటే.. ఆడియెన్స్ కూడా మనిషే కాబట్టి.. అలాగే చూస్తారు అని స్నిగ్ధ తెలిపింది. ఇనయా గేమ్ ఎలా అనిపిస్తుందన్న అరియానా గ్లోరి ప్రశ్నకు.. ఏకే 47 అలా పెట్టుకుని తిరుగుతుంటుంది. ఎవరైనా ఏమైనా అంటే దడ దడ మని ఏసేయడమే ఆమె పని నవ్వించింది నటి, శ్రీసత్య ఫ్రెండ్ స్నిగ్ధ.

    English summary
    Actress Snigdha Shocking Comments On Bigg Boss Telugu 6 Contestants Sri Satya Arjun Kalyan In BB Cafe With Ariyana Glory.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X