Bigg Boss Telugu 6: హౌజ్ లో అతను రాత్రి ఉదయించే సూర్యుడు.. ఆమెనే కలుపు మొక్క.. భాను శ్రీ ఘాటు కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ కు ప్రస్తుతం రేటింగ్ తెచ్చే పనిలో ఉన్నాడు బిగ్ బాస్. గత కొద్దిరోజులుగా ఇంటి సభ్యులు చేసిన పనికి విసుగుచెందిన బిగ్ బాస్ వాళ్లని సరిదిద్దే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆహారం కోసం కబడ్డీ, థగ్ ఆఫ్ వార్ పోటీలు పెట్టిన బిగ్ బాస్.. తాజాగా ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఇంట్లో ఉండేందుకు అర్హతను నిరూపించుకోవాలని పూల టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు, అరుపులు గట్టిగానే ఉండేలా ఉన్నాయి. ఇక ఇదిలా ఉటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, సెలబ్రిటీలతోపాటు బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు 2 కంటెస్టెంట్ భాను శ్రీ హాజరైంది.

6 వారాల్లో ఆరుగురు..

6 వారాల్లో ఆరుగురు..

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో బాలాదిత్య, సుదీప (పింకీ), కీర్తి భట్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌ మొత్తం 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 6 వారాల్లో షానీ, అభినయ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ ఆరుగురు వెళ్లిపోయారు.

చివరి స్థానంలో ఆ ముగ్గురు..

చివరి స్థానంలో ఆ ముగ్గురు..

ప్రస్తుతం ఏడో వారంలో ఆర్జే సూర్య, గీతూ రాయల్ ఇద్దరు తప్ప మిగిలిన 13 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. ప్రస్తుతానికి వీరిలో చివరి మూడు స్థానాలైన 11వ ప్లేస్ లో ఇనయా సుల్తానా, 12వ స్థానంలో శ్రీ సత్య, పదమూడో స్థానంలో రాజశేఖర్ ఉన్నట్లు సమాచారం. కానీ ఈ ఏడోవారం మెరీనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, ఎలిమినేట్ అయినవాళ్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్ల అభిప్రాయాలను బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్నారు.

భాను శ్రీ ఆసక్తికర కామెంట్లు..

భాను శ్రీ ఆసక్తికర కామెంట్లు..

ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ 4 అండ్ 5వ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీతోపాటు యాంకర్ శివ, ఆర్జే కాజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ కంటెస్టెంట్ భాను శ్రీ హాజరైంది. ఆమెను అరియానా గ్లోరి హోస్ట్ చేయగా.. ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్లతో భాను శ్రీ అలరించింది.

ఎక్కువగా రాత్రే కనిపిస్తాడు..

ఎక్కువగా రాత్రే కనిపిస్తాడు..

వచ్చి రాగానే సూర్య గురించి ఒకటి చెప్పాలి. ఆయన పొద్దున కంటే ఎక్కువగా రాత్రే కనిపిస్తాడు అదేంటో కానీ అని భాను శ్రీ అంటే.. ఏంటీ సూర్య నువ్ ఓన్లీ రాత్రులేనా అని అరియానా గ్లోరి అంటుది. దీంతో ఆయన నైట్ టైమ్ ఉదయించే సూర్యుడన్నమాట అని భాను శ్రీ కళ్లు మూసుకుని నవ్వుతుంది. తర్వాత కొన్ని మీమ్స్ చూపిస్తూ ఫన్ జనరేట్ చేశారు.

ఓడించాల్సిన అవసరం లేదు..

ఓడించాల్సిన అవసరం లేదు..

బిగ్ బాస్ హౌజ్ లో కలుపు మొక్క ఎవరని అనుకుంటున్నావ్ అని అరియానా అడగ్గా.. డౌటే లేదు గీతూ.. ఒక అమ్మాయి అంతా ఆరగెంట్ గా ఉండకూడదు. ఒక విన్నర్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అని అడగ్గా.. రాజు అవ్వాలంటే ఒక రాజ్యాన్ని గెలవాలే గానీ, ఓడించాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చిది భాను శ్రీ.

గేట్లు ఓపెన్ చేసేవాడు కాదు..

బిగ్ బాస్ అనేది లైఫ్ టైమ్ అవకాశం అని కంటెస్టెంట్లు అందరూ చెబుతున్నారు.. సీజన్ 6 వాళ్లు కరెక్టుగా ఉపయోగించుకుంటున్నారా అనే ప్రశ్నకు.. నిజంగా వాళ్లు యూజ్ చేసుకుంటే.. బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేసేవాడు కాదు. గేట్లు ఓపెన్ చేసినప్పుడు వీళ్లు వెళ్లిపోతే బాగుండు అని అనిపించిందా అనే ప్రశ్నకు.. మెరీనా, అర్జున్, వాసంతి అని చెప్పింది భాను శ్రీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X