Bigg Boss Telugu 6:ఆమె భాష మార్చుకోకుంటే కష్టం.. అతను ఇప్పుడైనా మారతాడనుకున్నా.. జాఫర్ రివ్యూ
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ జోరుగా, రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ ఏడు వారాలకు గాను ఏడుగురు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లగా ఇటీవల ఎనిమిదో వారం అనూహ్యంగా, ఎవరు ఊహించని విధంగా ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో తొమ్మిదో వారం 10 మంది నామినేషన్లలో ఉండగా.. ఇంటి సభ్యుందరి మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్లపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్, విన్నర్స్, సినీ సెలబ్రిటీస్, రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ ద్వారా బయటపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్, జర్నలిస్ట్ జాఫర్ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.

21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో బాలాదిత్య, సుదీప (పింకీ), కీర్తి భట్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్ ఉన్నారు.

21 మందిలో 8 మంది బయటకు..
ఈ 21 మంది ఇంటి సభ్యుల్లో 8 వారాలకు షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ, అర్జున్ కల్యాణ్, ఆర్జే సూర్య మొత్తం ఎనిమిది మంది ఎలిమినేట్ అయి హౌజ్ బయటకు వచ్చేశారు. ప్రస్తుతం 13 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఈ తొమ్మిదో వారం నామినేషన్లలో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా శ్రీహాన్ ను నామినేషన్ నుంచి తప్పించుకోగా రాజ శేఖర్, వాసంతిలను ఎవరు నామినేట్ చేయలేదు.

మూడో సీజన్ కంటెస్టెంట్..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లు ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు. ఈ కేఫ్ కు హోస్ట్ గా అరియానా గ్లోరి వ్యవహరిస్తోంది. తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ కంటెస్టెంట్, జర్నలిస్ట్ జాఫర్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ షోకి హాజరైన జాఫర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందరూ సేఫ్ గేమ్ ఆడారు..
బిగ్ బాస్ లో బీబీ కేఫ్ లో మాట్లాడటం ఎలా ఉంది.. మీ పాత రోజులు గుర్తు వస్తున్నాయా అని అరియానా అడిగితే.. అరియానాతో మాట్లాడుతుంటే నేను ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంటే అని, బిగ్ బాస్ లో ఉన్నట్లే అనిపిస్తోందని జాఫర్ అన్నారు. మీ అబ్సర్వేషన్ ప్రకారం తొమ్మిదో వారం నామినేషన్స్ ఎలా జరిగాయన్న ప్రశ్నకు.. అందరూ సేఫ్.. సేఫ్.. గేమ్ ఆడారు. గొర్రెల మందలాగా ఒక్కరు చెప్పిన కారణాన్నే చెప్పి నామినేట్ చేస్తున్నారు అంతా సేఫ్ గేమ్ అని ఆయన అన్నారు.

సానుభూతి వచ్చే అవకాశాలు..
హౌజ్ లో అందరూ ఇనయాను టార్గెట్ చేశారంటున్నారు. ఎవరెవరూ టార్గెట్ చేశారన్న క్వశ్చన్ కి.. అందరూ టార్గెట్ చేయడంతో ఎక్కడో కొంత ఆమెపై జనాల్లో సానుభూతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయిని సమాధానమిచ్చారు. ఎమోషన్స్ విషయంలో బిగ్ బాస్ హౌజ్ లో ఫేక్ ఉంటే కష్టం కదా అన్నదానికి.. ఇక్కడ ప్రతి ఎమోషన్ ని గేమ్ లో భాగంగానే చూడాలే తప్పా ఇంకేం లేదని ఆ అమ్మాయి చెప్పింది. అది అర్థం చేసుకోవాలన్నారు.
ఫైమా కామెడీ లైన్ తప్పింది..
ఫైమా కామెడీ లైన్ తప్పిందని పెద్ద డిస్కషన్ జరిగిందన్న ప్రశ్నకు నూరు శాతం నిజమన్నారు. ఆ అమ్మాయి మాట్లాడే భాషలో పద్ధతి మార్చుకోకుంటే ఆమెకు నెగెటివిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గీతూ రాయల్ గురించి మాట్లాడుతూ ఆమెను ఈసారి ఎక్కువమంది నామినేట్ చేస్తారనుకున్నాను. ఆమె విషయంలో ఆదిరెడ్డి మారుతాడనుకున్నాను అని జాఫర్ సమాధానమిచ్చారు.


Click it and Unblock the Notifications











