Bigg Boss Telugu 6:ఎలిమినేట్ తర్వాత సూర్య ఫస్ట్ ఇంటర్వ్యూ.. అతడు ఫేక్.. ఇనయా వీడియోతో షాక్

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ జోరుగా, రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికీ ఏడు వారాలకు గాను ఏడుగురు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వెళ్లగా తాజాగా అనూహ్యంగా, ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ కు గురయ్యాడు ఆర్జే సూర్య. టాప్ 5లో ఉంటాడనుకున్న మిమిక్రీ ఆర్టిస్ట్ సూర్య ఎలిమినేట్ కావడంతో మిగతా ఇంటి సభ్యలందరూ అవాక్కయ్యారు. అయితే సూర్య గేమ్ ఆడినప్పటికీ అతను ఫెమినిస్ట్ అని చెప్పుకుంటూ చేసిన లవ్ ట్రాక్ లతో బొక్క బోర్ల పడ్డాడు. అయితే ఎలిమినేట్ అయినవారిని బిగ్ బాస్ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సూర్యను ప్రశ్నలతో ఏకిపారేశాడు యాంకర్ శివ. ఎలిమినేషన్ తర్వాత సూర్య హాజరైన ఫస్ట్ ఇంటర్వ్యూ వివరాళ్లోకి వెళితే..

ఆరోహి రావుతో చాలా క్లోజ్ రిలేషన్ షిప్..

ఆరోహి రావుతో చాలా క్లోజ్ రిలేషన్ షిప్..

బిగ్ బాల్ తెలుగు 6 రియాలిటీ షోలో ఎనిమిదో వారం ఎలిమినేషన్ కింద అనూహ్యంగా మిమిక్రీ ఆర్టిస్ట్, ఫెమినిస్ట్, ఆర్జే సూర్య బయటకు వచ్చాడు. అందుకు కారణం గేమ్ కన్నా ఎక్కువగా అమ్మాయిలతో ఎక్కువగా సన్నిహితంగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. ఇంతకుముందు నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన ఆరోహి రావుతో చాలా క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేశాడు సూర్య. అప్పుడు వాళ్లిద్దరి మధ్య ప్రేక్షకులు మెచ్చని సన్నివేశాలు దర్శనమిచ్చాయి.

సూర్య ఎంకరేజ్ చేస్తూనే..

సూర్య ఎంకరేజ్ చేస్తూనే..

ఆరోహి రావు ఎలిమినేట్ అయి వెళ్లిన తర్వాత సూర్య దృష్టి అంతా ఇనయా సుల్తానావైపు మళ్లింది. అయితే సూర్యకు బుజ్జమ్మతో బియాండ్ ఫ్రెండ్ షిప్ ఉందని ఎన్నోసార్లు చెప్పాడు. బుజ్జమ్మ కూడా అలాగే చెప్పింది. కానీ, సూర్యపై ఇనయాకు క్రష్ ఉందని, అతనంటే చాలా ఇష్టమని బాహటంగానే చెప్పింది. బుజ్జమ్మ గురించి తెలిసి తప్పు చేస్తున్నానా అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సూర్యతో సన్నిహితంగా ఉంది. దాన్ని సూర్య ఎంకరేజ్ చేస్తూనే వచ్చాడు. ఫలితింగా ఎలిమినేట్ అయ్యాడని బయట వినిపిస్తున్న సమాచారం.

ఫెమినిజానికి.. గేమ్ కు ఏమైనా సంబంధం ఉందా..

ఫెమినిజానికి.. గేమ్ కు ఏమైనా సంబంధం ఉందా..

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు ఆర్జే సూర్య. ఈ సందర్భంగా వరుసపెట్టిన ప్రశ్నలను సూర్యపై సంధించాడు శివ. ఫెమినిస్ట్ పాయింట్ ఎత్తడానికి.. నువ్ ఆడిన విధానానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని సూర్యను శివ అడిగాడు.

ఆలోచన విధానానికి విలువ ఇవ్వడం..

ఆలోచన విధానానికి విలువ ఇవ్వడం..

యాంకర్ శివ అడిగిన ప్రశ్నకు.. నా దృష్టిలో ఫెమినిస్ట్ అంటే ఆడవాళ్ల ఆలోచన విధానానికి కొంచెం ఎక్కువ విలువ ఇవ్వడం అని చెప్పాడు సూర్య. దీంతో నువ్ ఇచ్చావా అని శివ అడిగితే.. నేను ఇచ్చాననే అనుకుంటున్నా అని సూర్య తెలిపాడు. దానికి.. మొన్న వాసంతికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ విషయంలో.. ఆల్రేడీ కెప్టెన్ అయిన నువ్వు.. వాసంతికి ఒకసారి కెప్టెన్ అయ్యే అవకాశం ఇవ్వొచ్చు కదా.. అని అన్నాడు శివ.

మేం చూసింది తప్పు అంటావా..

మేం చూసింది తప్పు అంటావా..

కెప్టెన్ గురించి అడిగాక.. ఒకప్పుడు ఆరోహితో క్లోజ్ గా ఉండి సురోహిగా.. తర్వాత ఇనయాతో క్లోజ్ గా ఉండి సునయగా ఆడావ్.. నెక్ట్స్ సుకీర్తినా అని ప్రశ్నించడంతో షాక్ అయ్యాడు సూర్య. మీకు అలా కనిపిస్తే నేనేం చేయలేనని సూర్య అంటే.. మీరు చేసింది తప్పు కాదు కానీ మేం చూసింది తప్పు అంటావా... అసలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి అంటూ మీమ్స్ చూపించాడు శివ.

సూర్యది అంతా ఫేక్..

సూర్యది అంతా ఫేక్..

మీమ్స్ తర్వాత ఇనయాపై నీకున్న ఒపినియన్ ఏంటి అని అడగ్గా.. షీ ఈజ్ ఓవర్ ఎక్స్ ప్రెసివ్ అని సమాధానం ఇచ్చాడు. అసలు ఇనయా నీ గురించి ఏమనుకుంటుందో చూస్తావా అని సూర్య గురించి ఇనయా మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపించాడు శివ. అందులో సూర్యది అంతా ఫేక్.. అతను ఫేక్ అంటూ రేవంత్ తో ఇనయా మాట్లాడం ఉంటుంది. ఇది చూసి చాలా షాక్ అయ్యాడు సూర్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X