twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6:అతనితో రిలేషన్ ఏంటీ?.. ఫ్రెండ్ షిప్ డేంజర్.. యాంకర్ కే పంచ్ ఇచ్చిన గీతూ రాయల్!

    |

    బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగినవారు అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. ఇదివరకే టాప్ 5లో ఉంటాడనుకున్న ఆర్జే సూర్య ఎనిమిదో వారం ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లాడు. తాజాగా సింగర్ రేవంత్ తో పాటు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న చిత్తూరు చిరుత గీతూ రాయల్ అనుకోని విధంగా ఎలిమినేట్ అయింది. దీంతో బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కసారిగా అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేఫ్ కు గీతూ రాయల్ హాజరైంది.

    హౌజ్ ను వీడిన చిత్తూరు చిరుత..

    హౌజ్ ను వీడిన చిత్తూరు చిరుత..

    బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో టాప్ కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా టైటిల్ ఫేవరేట్ కంటెస్టెంట్, బిగ్ బాస్ ముద్దుబిడ్డ, చిత్తూరు చిరుత గీతూ రాయల్ ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ఇక ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూకు హాజరైంది గీతూ రాయల్.

    గీతూ అంటే గేమ్..

    గీతూ అంటే గేమ్..

    ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వరుసపెట్టి ప్రశ్నలను గీతూ రాయల్ పై సంధించాడు శివ. వాటికి దీటుగా, తిరిగి యాంకర్ శివను క్వశ్చన్ చేస్తూ సమాధానాలిచ్చింది గీతూ రాయల్. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో ముందుగా గీతూ రాయల్ ను ఆహ్వానించాడు శివ. గీతూ అంటే గేమ్.. గేమ్ అంటే గీతూ కానీ ఈవారం ఎలిమినేట్ అయి మన ముందుకు వచ్చిందని స్వాగతం పలికాడు యాంకర్.

    నటన అని చెప్పేసరికి..

    నటన అని చెప్పేసరికి..

    అసలు గేమ్ స్టార్ట్ చేసిందే గీతూ.. ఇలా ఎందుకు అయింది అని యాంకర్ శివ అడిగిన ప్రశ్నకు.. అస్సలు ఐడియా లేదు ఇలా ఎందుకయిందో అని ఏడుస్తూ సమాధానం ఇచ్చింది గీతూ రాయల్. నీ తప్పులు ఏంటో నీకు తెలుసా ఇప్పటికైనా అని యాంకర్ శివ ప్రశ్నించగా.. నాది నటన అని చెప్పేసరికి హర్ట్ అయిపోయిన లోపల విపరీతంగా అని గీతూ రాయల్ అంది. బయటకు రావడానికి అదే కారణమంటే ఒప్పుకుంటావా అని తిరిగి ప్రశ్నించాడు శివ.

    నువ్ ఎప్పుడు అలా మాట్లాడలేదా..

    నువ్ ఎప్పుడు అలా మాట్లాడలేదా..

    ప్రతి క్షణం బిగ్ బాస్ గెలవాలని ఆడిన నేను.. ఒక చిన్న కారణంతో బయటకు వచ్చానంటే నా వల్ల కావట్లేదు అని చెప్పుకొచ్చింది గీతూ రాయల్. గీతూ వచ్చేటప్పుడు రేవంత్ ను ఏదో అన్నావ్ ఏంటది అన్న ప్రశ్నకు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడతావ్ అని గీతూ చెబుతుంటే.. యాంకర్ శివ.. నోరొక్కటే బాగోలేదన్నావ్.. మరి నీది బాగుందా.. నువ్ ఎప్పుడు అలా మాట్లాడలేదా అని అడిగాడు శివ.

    ఏంటీ మీ ఇద్దరి రిలేషన్..

    ఏంటీ మీ ఇద్దరి రిలేషన్..

    తర్వాత ఎవరితో ఇక్కడితోనే ముగించేద్దామనుకుంటున్నావో వాళ్ల ఫొటోను బ్రేక్ చేయమంటే.. ఇనయా ఫొటోను బ్రేక్ చేసింది. ఎందుకన్న ప్రశ్నకు పిల్లేమో మంచి పిల్లే.. కానీ ఫ్రెండ్ షిప్ చేయాలంటే భయమేస్తుందని ఆన్సర్ ఇచ్చంది. తర్వాత మెరీనా ఫొటో బ్రేక్ చేసింది. ఆదిరెడ్డి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటాడని గీతూ చెప్పడంతో.. ఏంటీ మీ ఇద్దరి రిలేషన్ అని అడిగి షాక్ ఇచ్చాడు శివ. దానికి నవ్వి ఊరుకుంది గీతూ.

    ఆడిన ప్రతి ఒక్కరూ గెలవరు..

    ఫిజికల్ టాస్క్ ఇస్తే గుద్ది పడేస్తా అన్నావ్ ఎవరినీ గుద్దావ్, ఏం గుద్దావ్ అన్నదానికి.. ఫిజికల్ టాస్క్ కూడా నేను బాగానే ఆడినా అని గీతూ అంది. దీనికి అదే గీతూ ఫిజికల్ టాస్క్ లు నా వల్ల కావట్లేదని ఎందుకుందన్న ప్రశ్నకు.. ఆడేది వేరే.. గెలిచేది వేరే.. ఆడిన ప్రతి ఒక్కరూ గెలవరు.. నువ్ కూడా ఆడావ్.. ఏమైనా గెలిచావా అని చివరిగా యాంకర్ శివకే గట్టి కౌంటర్ ఇచ్చింది. తర్వాత సమాధానం ఏది అన్నట్లుగా నవ్వింది గీతూ రాయల్.

    English summary
    Bigg Boss Telugu 6th Season 9th Week Eliminated Contestant Geetu Royal Interview With Anchor Shiva In BB Cafe And Geetu Counter To Shiva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X