Bigg Boss Telugu 6 ఆ కంటెస్టెంట్ కరివేపాకు లాంటింది.. ఎలిమినేషన్ తర్వాత మెరీనా
ఊహించని పరిణామాలు, అనుకోని సంఘనటలతో బిగ్ బాస్ ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచినావాళ్లు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఇలా క్వాలిటీ ఉన్న వ్యక్తులే ఎలిమినేట్ అయి బయటకు వెళ్తున్నారు. తాజాగా హౌజ్ లో మంచి పేరు ఉన్నటువంటి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది. ఆమె ఎవరో కాదు హౌజ్ లో మదర్ ఇండియాగా పిలుచుకునే మెరీనా అబ్రహం.
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 11వ వారం మెరీనా అబ్రహం ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌజ్ ను వీడింది. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ కేఫ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ శివ ఎప్పటిలానే తనదైన శైలీలో ప్రశ్నలను సంధించాడు.

మదర్ ఇండియా ఎలిమినేట్..
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ మొదటి నుంచి విచిత్రమైన సంఘటనలతో సాగుతోంది. కంటెస్టెంట్ల నుంచి బిగ్ బాస్ టీమ్ ప్లాన్స్ వరకు అన్ని షాకింగ్ గా ఉన్నాయి. ఇప్పటికే ప్రైజ్ మనీ కంటెస్టెంట్ల టాస్క్స్ ద్వారా తగ్గిస్తూ బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడు తీసుకోని నిర్ణయంతో సాగుతోంది ఈ షో. ఇక 11వ వారం గుడ్ బిహేవియర్ కలిగిన మదర్ ఇండియా అలియాస్ మెరీనా అబ్రహం తాజాగా ఎలిమినేట్ అయింది.

మీలా మీరు ఉండటం..
ఎలిమినేట్ అయిన మెరీనా అబ్రహం బిగ్ బాస్ కేఫ్ (బీబీ కేఫ్)కు హాజరైంది. ఆమెను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ శివ పలు ప్రశ్నలతో ఆసక్తికర సమాధానాలు రాబట్టాడు. మెరీనాను ఆహ్వానించిన యాంకర్ శివ.. 11 వారాల ప్రయాణం.. మీ దృష్టిలో బిగ్ బాస్ అంటే ఏంటీ అని అడిగాడు. మీలా మీరు ఉండటం. మీరు ఏంటి అనేది తెలుస్తుంది అని మెరీనా సమాధానం ఇచ్చింది.

బ్యాక్ బిట్చింగ్ చేయలేదు..
మెరీనా ఫేస్ టు ఫేస్ డిఫెండింగ్ కన్నా.. బ్యాక్ బిట్చింగ్ డిఫెండింగ్ ఎక్కువ ఉండేది అని యాంకర్ అడగ్గా.. ఎవరి గురించి బ్యాక్ బిట్చింగ్ చేయలేదు అని మెరీనా చెప్పింది. దీంతో రేవంత్ గురించి, గీతూ గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదా అని శివ అడగ్గా.. వాళ్లు చెప్పిన మాటలను వాళ్లే క్రాస్ చేసినప్పుడు మాట్లాడి ఉండవచ్చు అని మెరీనా ఆన్సర్ ఇచ్చింది.

బిగ్ బాస్ అంటే ఒక యుద్ధం..
జనాలు చూస్తున్నారు అనే వర్డ్ ఎక్కువగా వాడింది మీరే.. జనాలు చూడాలంటే మీరు ఏం చేశారు అన్న ప్రశ్నకు.. నేను నాలా ఉన్నాను అని మెరీనా అంది. దీనికి మిమ్మల్ని ఎందుకు చూడాలి అని మళ్లీ ప్రశ్నించాడు శివ. తర్వాత మీరు గేమ్స్ ఆడారా అని అడిగాడు శివ. దీనికి నా వరకు ఎంత అయిందో అంతా ఆడాను అని మెరీనా అంటే బిగ్ బాస్ అనేది ఒక యుద్ధం అని శివ అన్నాడు. దీనికి వాళ్లు నా శత్రువులు కాదని మెరీనా నోరు మూయించింది.

ఇనయా మిర్చీ, కరివేపాకు కీర్తి..
అరే ఇప్పుడు నేను కోప్పడితే జనాలు ఏమనుకుంటారో అని కూడా ఉండిపోవచ్చు కదా అని శివ అడిగాడు. దీంతో అంటే నేను మంచిది కాదా (మంచిదాన్ని కాదా) అని క్యూట్ గా అడిగింది మెరీనా. లేదు మీరు మంచిదే అని శివ నవ్వుకుంటూ అన్నాడు. తర్వాత మిరపకాయల ఫొటో చూపిస్తే ఇనయా అని చెప్పింది మెరీనా. కీర్తిని కరివేపాకుతో పోల్చింది మెరీనా.

టెన్షన్ ఉంటుందో తెలుసా..
తర్వాత నువ్ రోహిత్ ఏదో ట్రిప్ కు వచ్చినట్లు ఉంది. ఏదో మంచి లాంజ్ లో కూర్చొని, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అని శివ అంటే.. ట్రిప్ కా.. ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా అలాగా.. నేను ఆడగలుగుతానా లేదా దేవుడా అని మెరీనా ఆన్సర్ ఇవ్వబోతుంటే.. నేను ఆడగలనా అన్నంతా ఆలోచించారా అని శివ అన్నాడు. అంటే గేమ్ చెప్పిందాంట్లో సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. అక్కడికి వెళ్లాక పూర్తిగా క్లారిటీ వస్తుందని మెరీనా చెప్పింది.
మీ నుంచి కంటెంట్ రాదు..
మెరీనా అర్థం కాదని సమాధానం చెప్పగా.. మీకు అర్థం అయ్యేలోపు గేమ్ అయిపోతుందని శివ అన్నాడు. దీనికి మీరు నాకు ఇప్పుడు ఎంత కోపం తెప్పించినా నాకు కోపం రాదని మెరీనా అంటే.. మీ నుంచి కంటెంటే రాదు.. కోపం ఎలా వస్తుంది అని వెటకారంగా, రూడ్ గా అన్నాడు యాంకర్ శివ.


Click it and Unblock the Notifications











