Bigg Boss Telugu 6: ఆరోహి తప్పులేదు, ఇప్పుడు ఇనయాను తగులుకున్నాడు.. కప్పు కొట్టారా అంటే..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. అంతేకాకుండా ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు ఏకంగా బిగ్ బాసే రంగంలోకి దిగాడు. అక్టోబర్ 4 మంగళవారం ప్రసారమైన 30వ రోజు 31వ ఎపిసోడ్ లో తన బర్త్ డే సందర్భంగా ఎంటర్ టైన్ చేయమని చెప్పి.. ఇంటి సభ్యులతో ఆడుకున్నాడు బిగ్ బాస్. కామెడీగా సెటైర్లు, పంచ్ లు వేస్తూ నవ్వించాడు. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి జబర్దస్త్ కమెడియిన్, సినిమా రివ్యూస్ చేసే మహిధర్ షాకింగ్ రివ్యూ ఇచ్చాడు.

గతంలో ఎన్నడూ చూడని విధంగా..
తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. దీంతో ఇది మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వాటికి మాదిరిగా రేటింగ్ మాత్రం స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో రేటింగ్ క్రమంగా పడిపోతోంది.

కంటెస్టెంట్ల ఆట తీరుపై..
ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, యాంకర్ శివ, ఆర్జే కాజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆరో సీజన్ హౌజ్ మేట్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కు బదులు జబర్దస్త్ కమెడియిన్, సినిమా రివ్యూస్ చేసే మహిధర్ హాజరయ్యాడు. ఆయన్ను అరియానా గ్లోరి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు మహిధర్.

మోస్ట్ డిసాప్పాయింటెడ్ పర్సన్..
మోస్ట్ డిసాప్పాయింటెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది అర్జున్ కల్యాణే. కప్పును గెలవరా అంటే శ్రీసత్యను గెలుస్తానంటాడేంది మనిషి నాకు అర్థం కాదు అని మహిధర్ అంటే.. ప్రేమేమో అండి అని అరియానా అంటుంది. దానికి శ్రీసత్య సైడ్ నుంచి మాత్రం సెంట్ పర్సంట్ కూడా లేదు. ఒక వారం తను సేవ్ అవడం కోసం వాడుకుంటోంది అంతే అని చెప్పుకొచ్చాడు మహిధర్.

తర్వాతి ఎపిసోడ్స్ లో మీకే తెలుస్తుంది..
తర్వాత ఆర్జే సూర్య గురించి అరియానా అడగ్గా.. తప్పు ఆరోహి కాదు. మన ఫెమినిస్టుదే. ఇప్పుడు మనోడు నిన్న ఇనయాను తగులుకున్నాడు అని మహిధర్ ఆన్సర్ ఇచ్చాడు. దీనికి మీరు ఎంత పెద్ద నింద వేస్తున్నారో తెలుసా అని అరియానా అంటే.. ఆ చూడండి, తర్వాతి ఎపిసోడ్స్ లలో మీకే తెలుస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మహిధర్.

పిచ్చోడిలా ఆర్జే సూర్య..
ఇక అక్టోబర్ 4 మంగళవారం ప్రసారమైన 30వ రోజు 31వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు జరిగాయి. పుట్టిన రోజు సందర్బంగా బిగ్ బాస్ ను ఏదోలా ఎంటర్టైన్ చేయాలని కోరాడు. ఈ క్రమంలో ఇనయా చిన్న పిల్లలా చేయగా, శ్రీహాన్ అమ్మాయి, రేవంత్ అమ్మాయి వేషాలు, సూర్య పిచ్చోడిలా చేశారు. కాగా ఈ ఐదో వారం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు.


Click it and Unblock the Notifications











