Bigg Boss Telugu 6: పుల్లలు పెట్టేది ఆమెనే.. తను మానిప్యులేటర్, ఈ ట్విస్ట్ మాములుగా ఉండదు

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక అక్టోబర్ 1 శనివారం ప్రసారమైన 27వ రోజు 28వ ఎపిసోడ్ లో ఎప్పటిలానే నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఇంటి సభ్యులపై రివ్యూ చేసి టిప్ ద్వారా వారి పర్ఫామెన్స్ కు రేటింగ్ ఇచ్చాడు. ఆయన నుంచి ప్రశంసలు దక్కలేదని కీర్తి భట్, వాసంతి బాధపడ్డారు. ఇక ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్న విషయం తెలిసిందే. ఈసారి మరో మాజీ కంటెస్టెంట్ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చాడు.

 కంటెస్టెంట్ల ఆట తీరుపై..

కంటెస్టెంట్ల ఆట తీరుపై..

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందు కోసం ప్రస్తుతం ఆరో సీజన్ లో ఆడుతున్న కంటెస్టెంట్ల ఆట తీరుపై గత సీజన్ లోని కంటెస్టెంట్ల అభిప్రాయాలను బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయటపెడతున్నారు. ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, యాంకర్ శివ, ఆర్జే కాజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆసక్తికర వ్యాఖ్యలు..

ఈ కేఫ్ కు వచ్చే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత ఇంటి సభ్యులపై అభిప్రాయాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేఫ్ కు తాజాగా బిగ్ బాస్ ఐదో (ఓటీటీ) సీజన్ కంటెస్టెంట్ మానస్ హాజరయ్యాడు. మానస్ ను ఆర్జే కాజల్ ఇంటర్వ్యూ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఇప్పటికైనా ఫ్రెండ్ అనవా

ఇప్పటికైనా ఫ్రెండ్ అనవా

హాయ్ ఫ్రెండ్స్ అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మానస్ ను ఆర్జే కాజల్ ఇన్వైట్ చేస్తే హాయ్ అని చెబుతాడు మానస్. ఇప్పటికైనా ఫ్రెండ్ అనవా అని ఆర్జే కాజల్ అంటే మానస్ నవ్వుతాడు. తర్వాత ఈ బిగ్ బాస్ సీజన్ 6లో నీకు ఎవరైనా మానస్ లాంటి క్యారెక్టర్ కనిపించిందా అని కాజల్ అడిగిన ప్రశ్నకు అర్జున్ కల్యాణ్ అని సమాధానమిస్తాడు మానస్. దీంతో కానీ నువ్ ఇలా ఎవరి వెంట పడలేదు కదా అని ఆర్జే కాజల్ అంటుంది.

వెళ్లిపోయిన వాళ్ల గురించి చెప్పొచ్చా..

వెళ్లిపోయిన వాళ్ల గురించి చెప్పొచ్చా..


వన్ సేఫ్ ప్లేయర్ అని అడిగిన ప్రశ్నకు వెళ్లిపోయిన వాళ్ల గురించి చెప్పొచ్చా అని నవ్వించాడు మానస్. ఆ తర్వాత పుల్లలు పెట్టేది ఎవరు అని ఆర్జే కాజల్ అడగడంతో గీతూ రాయల్ అని సమాధానం ఇస్తాడు. దీంతో మరి బలి పశువు ఎవరు అన్నదానికి ఓ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

బ్రేకింగ్ న్యూస్ తరహాలో..

బ్రేకింగ్ న్యూస్ తరహాలో..

అనంతరం మ్యానిప్యులేటర్ ఎవరు అన్న ప్రశ్నకు ఇనయా సుల్తానా సమాధానమిచ్చాడు మానస్. దీంతో ఇనయా సుల్తానాను మ్యానిప్యులేటర్ అన్న మానస్ అని ఆర్జే కాజల్ అని బ్రేకింగ్ న్యూస్ తరహాలో చెబుతుంది. ఇనయాకు, శ్రీహాన్ కు జరుగుతున్నదాంట్లో ఎవరిది తప్పు ఉందంటావ్ అని అడగ్గా.. నవ్వేస్తాడు మానస్.

ఇనయా, శ్రీహాన్ బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ అయితే..

అనంతరం జస్ట్ ఇమాజిన్ ఇనయా, శ్రీహాన్ బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటుంది అని ఆర్జే కాజల్ అంటే.. ఈ ట్విస్ట్ మాములుగా ఉండదు అని ఆన్సర్ ఇస్తాడు మానస్. ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో నాలుగో వారం ఎలిమినేషన్‌కు సిద్దమైంది. ఈవారం అనూహ్యంగా ఆరోహి రావు ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X