For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: అభిజిత్, సోహెల్, అరియానాను మిక్స్ చేస్తే ఆమె.. ప్రియాంక సింగ్ షాకింగ్ కామెంట్స్

  |

  తెలుగులో బిగ్ బాస్ ‌షో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. దీంతో ఇది మరింత కొత్తగా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వాటికి మాదిరిగా రేటింగ్ మాత్రం స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో రేటింగ్ క్రమంగా పడిపోతోంది. ఏది ఎలా ఉన్నా బిగ్ బాస్ హౌజ్ లోని ఇంటి సభ్యులు మంచి కంటెంట్ ఇస్తూ నెట్టుకొస్తున్నారు. ఇక తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో వినూత్న పద్ధతిలో నామినేషన్స్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్న విషయం తెలిసిందే. ఈసారి మరో మాజీ కంటెస్టెంట్ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.

  29వ రోజు 30వ ఎపిసోడ్ లో

  29వ రోజు 30వ ఎపిసోడ్ లో

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక అక్టోబర్ 3 సోమవారం ప్రసారమైన 29వ రోజు 30వ ఎపిసోడ్ లో ఎప్పటిలా కాకుండా వినూత్నంగా నామినేషన్స్ జరిగాయి. కొంతమంది ఎమోషనల్ అయితే, మరికొంతమంది వాలిడ్ పాయింట్స్ మాట్లాడి ఆసక్తికరంగా ఎపిసోడ్ కొనసాగించారు.

  కంటెస్టెంట్ల ఆట తీరుపై..

  కంటెస్టెంట్ల ఆట తీరుపై..

  ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందు కోసం ప్రస్తుతం ఆరో సీజన్ లో ఆడుతున్న కంటెస్టెంట్ల ఆట తీరుపై గత సీజన్ లోని కంటెస్టెంట్ల అభిప్రాయాలను బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయటపెడతున్నారు. ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, యాంకర్ శివ, ఆర్జే కాజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.

  ఆసక్తికర వ్యాఖ్యలు..

  ఆసక్తికర వ్యాఖ్యలు..

  ఈ కేఫ్ కు వచ్చే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత ఇంటి సభ్యులపై అభిప్రాయాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేఫ్ కు తాజాగా బిగ్ బాస్ ఐదో (ఓటీటీ) సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక్ సింగ్ (పింకీ) హాజరయింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియాంక సింగ్.

  బీబీ 6 బాగుంది. కానీ..

  బీబీ 6 బాగుంది. కానీ..

  బిగ్ బాస్ 6 గురించి మాట్లాడుకుందాం అని అరియానా అంటే బీబీ 6 బాగుంది. కానీ నేను ఎక్స పెక్ట్ చేసినంతగా లేదు అని షాకిచ్చింది ప్రియాంక సింగ్. సరే మరి నువ్ ఏం ఎక్స్ పెక్ట్ చేశావో చెప్పు అని అరియానా అడగ్గా.. ఫైమా ఉంది. ఇంకా బాగా ఆడొచ్చు. ఆమె మంచిగా కామెడీ చేయొచ్చు. నేను ఆమె నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేశాను చాలా కామెడీ ఉంటుంది అని. కానీ అలా చేయట్లేదని చెప్పింది.

  పిట్ట అని అన్నప్పటి నుంచి..

  పిట్ట అని అన్నప్పటి నుంచి..

  ఇనయా గేమ్ ఎలా ఆడుతుంది అన్న ప్రశ్నకు పిట్ట అని అన్నప్పటి నుంచి పిట్టలా ఎగురుతుంది. లాస్ట్ వీక్ నుంచి కొంచెం ఊపందుకుంది. ఆర్జే సూర్య గురించి అడగ్గా.. మొన్నటివరకు కొంచెం అటు ఇటుగా.. ఒకరకమైన ఎమోషనల్ గా ఒకలాంటి ట్రామాలో ఉన్నాడు. ఇకనుంచి ఫోకస్ అంతా గేమ్ పై పెడతాడు కావొచ్చు అని ప్రియాంక అంటే.. ఎందుకు ఆరోహి వెళ్లిపోయినందుకా అని అరియానా అంటుంది.

  నీవల్ల మానస్ డౌన్ అయ్యాడా..

  ఎక్కడైనా సరే ఒక మనిషి ఇంకో మనిషి కనెక్ట్ అవుతున్నాడంటే వెళ్లిపోయేటప్పుడు కొంచెం డౌన్ అవుతారు అని ప్రియాంక అంటే నీవల్ల మానస్ డౌన్ అయ్యాడా అని అరియానా అంటుంది. తర్వాత గీతూ రాయల్ గురించి అడగ్గా.. ఒకరిద్దరు సోహెల్, ఒకరిద్దరు అభిజిత్, ఇద్దరు ముగ్గురు అరియానాలు మిక్స్ చేస్తే గీతూ రాయల్ అని ఆన్సర్ ఇచ్చింది ప్రియాంక సింగ్. ఇక ఈ ఐదో వారం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు.

  English summary
  Bigg Boss Telugu 5th Season Contestant Priyanka Singh Shocking Comments On Bigg Boss Telugu 6 Contestants Geetu Royal Inaya Sultana In BB Cafe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X