Bigg Boss Telugu 6: ఈవారం డబుల్ ఎలిమినేషన్!.. బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్?.. అతను ఫైర్ కాదు ఫ్లవర్

గత కొద్దిరోజులుగా ఇంటి సభ్యులు చేసిన పనికి విసుగుచెందిన బిగ్ బాస్ వాళ్లని సరిదిద్దే పనిలో పడి సక్సెస్ అయినట్లే తెలుస్తోంది. అక్టోబర్ 20న ప్రసారమైన ఎపిసోడ్ లో హౌజ్ మేట్స్ తో ప్రతిజ్ఞ చేయిచుకున్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత హౌజ్ లో ఉండేందుకు ఎలిజిబిలిటీ టాస్క్ బిగ్ బాస్ ఇవ్వగా.. అందరూ బాగా ఆడేందుకు ప్రయత్నించినట్లే కనిపించింది. ఈ టాస్క్ లో అందరూ అరుచుకోవడంతోపాటు పోటాపోటీగా పాల్గొన్నారు. అయితే ఈ బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై తమ అభిప్రాయాలను చెప్పేందుకు బిగ్ బాస్ కేఫ్ కు మాజీ కంటెస్టెంట్లు, విన్నర్స్, నటీనటులు, రివ్యూవర్స్ హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే మరో సెలబ్రిటీ, ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ హాజరై తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నాడు.

అనేక అంచనాల నడుమ..

అనేక అంచనాల నడుమ..

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో బాలాదిత్య, సుదీప (పింకీ), కీర్తి భట్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌ ఉన్నారు.

 21 మందిలో ఆరుగురు బయటకు..

21 మందిలో ఆరుగురు బయటకు..

ఈ 21 మంది ఇంటి సభ్యుల్లో ఆరు వారాలకు షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి రావు, చలాకీ చంటి, సుదీప పింకీ మొత్తం ఆరుగురు ఎలిమినేట్ అయి హౌజ్ బయటకు వచ్చేశారు. ప్రస్తుతం 15 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. వారిలో ఈ ఏడో వారం నామినేషన్లలో 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. కెప్టెన్ అయిన కారణంగా ఆర్జే సూర్య నామినేషన్ నుంచి తప్పించుకోగా గీతూ రాయల్ ను ఎవరు నామినేట్ చేయలేదు.

ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ హాజరు..

ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ హాజరు..

ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్లు ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను తెలియజేస్తున్నారు మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు. ఈ కేఫ్ కు హోస్ట్ గా అరియానా గ్లోరి వ్యవహరిస్తోంది. తాజాగా బిగ్ బాస్ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్, నటుడు సమీర్ హాజరయ్యాడు. ఈ షోకి హాజరైన సమీర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

గాసిప్స్ ఎక్కువయ్యాయి..

గాసిప్స్ ఎక్కువయ్యాయి..

సీజన్ 6 ఎలా ఉందో చెప్పండి అని అరియానా అడగ్గా.. గాసిప్స్ ఎక్కువయ్యాయి అని సమీర్ ఆన్సరిచ్చాడు. వాసంతి.. నన్ను కార్నర్ చేస్తున్నారు. నన్ను డౌన్ చేస్తున్నారు. నన్ను కలుపుకోవట్లేదు అంటుంది. ఎవ్వరూ కలుపుకోరు. మనమే కలవాలి అని చెప్పుకొచ్చాడు సమీర్. తర్వాత శ్రీహాన్-ఇనయా సుల్తానా గురించి అరియానా అడుగుతూ నామినేషన్లలో ఎలా అనిపించింది అంది.

టీవీ మ్యూట్ చేసేస్తాను..

టీవీ మ్యూట్ చేసేస్తాను..

ఇనయా నామినేషన్స్ రాగానే టీవీ మ్యూట్ చేసేస్తాను నేను అని సమీర్ ఆన్సర్ ఇవ్వగా.. వై అని అరియానా అడుగుతుంది. అప్పుడు లొడలొడలొడ వాగుతుంది అన్నట్లుగా ఒక సౌండ్ చేశాడు. తర్వాత ఇంటి సభ్యులు చేసిన పనులపై వచ్చిన మీమ్స్ పై స్పందిస్తూ నవ్వుకుంటారు.

డబుల్ ఎవిక్షన్..

సత్య చాలా తెలివైంది.. అతను ఫ్లవరు.. అని సమీర్ అంటే.. అర్జున్ ఇది విన్నావా.. నువ్ ఫైర్ కాదు.. ఫ్లవర్ అట అని అరియానా అంది. తర్వాత షీ ఈజ్ కంప్లీట్ లీ వాడింగ్ రే.. అని సమీర్ అంటే.. దిస్ ఈజ్ న్యూ థింగ్ రే అని అరియానా అంది. తర్వాత ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవతారని అనుకుంటారు అన్న ప్రశ్నకు.. ''ఈ వీక్ డబుల్ ఎవిక్షన్ అని విన్నాను.. బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు'' అని సమాధానం ఇచ్చాడు సమీర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X