Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Bigg Boss Telugu 6: ఆమెకు లైన్ వేయడానికి వచ్చిండేమో. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై.రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. అంతేకాకుండా ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు ఏకంగా బిగ్ బాసే రంగంలోకి దిగాడు. అక్టోబర్ 5 బుధవారం ప్రసారమైన 31వ రోజు 32వ ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు కొనసాగాయి. అంతకుముందు ఎపిసోడ్ లానే ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నించారు ఇంటిసభ్యులు. ఇందులో భాగంగానే హౌజ్ లోకి ఒక జోకర్ ను పంపించి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కంటెస్టెంట్లపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
కొత్త కంటెంట్‌తో ప్రసారం..
తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌తో ప్రసారం చేస్తున్నారు. దీంతో ఇది మరింత కొత్తగా, ఎంటర్టైన్మెంట్తో సాగుతోంది. కానీ, ఈ సీజన్‌కు గతంలో వాటికి మాదిరిగా రేటింగ్ మాత్రం స్పందన మాత్రం దక్కట్లేదు. దీంతో రేటింగ్ క్రమంగా పడిపోతోంది.
రాత్రిపూట దెయ్యాల్లాగా
ఏది ఎలా ఉన్నా బిగ్ బాస్ హౌజ్ లోని ఇంటి సభ్యులు మంచి కంటెంట్ ఇస్తూ నెట్టుకొస్తున్నారు. ఇక తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో కూడా బిగ్ బాస్ హౌజ్ మేట్స్ తో ఆడుకుని ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. మెరీనా, వాసంతి రాత్రిపూట దెయ్యాల్లాగా ఇంటి సభ్యులను భయపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరూ అంతగా భయపడలేదు. ఒక కీర్తి భట్ మాత్రం కొద్దిగా కేక పెట్టింది.
యాంకర్ గా అరియానా గ్లోరి..
ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, యాంకర్ శివ, ఆర్జే కాజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ గోల్డెన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ..
అయితే ఈ ఆరో సీజన్ హౌజ్ మేట్స్ పై బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ విన్నర్, పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యాడు. అతన్ని అరియానా గ్లోరి ఇంటర్వ్యూ చేయగా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. బిగ్ బాస్ గోల్డెన్ ఆపర్చునిటీ అని అరియానా అంటే బిగ్ బాస్ గోల్డెన్ ఆపర్చునిటీ కాదు, లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అని చెప్పాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్.
రేవంత్ ముందుకెళ్లే ఛాన్స్ ఉందా..
తర్వాత రేవంత్ ఆటను బట్టి ముందుకు వెళ్లే ఛాన్స్ ఉందా అని అరియానా అడిగిన ప్రశ్నకు బిగ్ బాస్ హౌజ్ సీజన్ లో ఏ కంటెస్టెంట్ ను జడ్జ్ చేయలేం. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పలేం అని చెప్పుకొచ్చాడు రాహుల్. ఇనయా గురించి మాట్లాడాదామా అంటే గొడవను చాలా సాగతీస్తుందని అంటే లాగిస్టా అని అరియానా అంది.
లైన్ వేయడానికి వచ్చిండేమో..
అర్జున్
కల్యాణ్-శ్రీసత్య
గురించి
అడగ్గా..
అంటే
మనోడు
లైన్
వేయడానికి
వచ్చిండేమో
బిగ్
బాస్
ఇంటికి
నాకు
తెల్వదు
అని
రాహుల్
అంటే
పును
(పునర్నవి
భూపాలం)తో
టచ్
లో
ఉన్నావా
అని
అరియానా
అడిగింది.
దీనికి
ఏ
లేదు
అని
నవ్వుకుంటూ
ఆన్సర్
ఇచ్చాడు
రాహుల్
సిప్లిగంజ్.
తర్వాత
గీతూ
రాయల్
గురించి
అడగ్గా..
ఉండాలి
కానీ
అతి
ఉండకూడదు
అని
తెలిపాడు
రాహుల్
సిప్లిగంజ్.
ఇది పంచా.. కౌంటరా.. లేకపోతే..
ఆర్జే సూర్య గురించి చెప్పమని అరియానా అడగ్గా.. బిగ్ బాస్ హౌజ్ ఇంట్లో కూడా మిమిక్రీ బాగా చేస్తున్నాడు అని రాహుల్ చెబితే ఇది పంచా.. కౌంటరా.. లేకపోతే.. అని అరియానా అంటుంది. దీనికి ఏ లేదు మనోడు మిమిక్రీ బాగా చేస్తాడు పాపం అని రాహుల్ అంటాడు. దీనికి మిమిక్రీ తప్పా ఇంకే చేయట్లేదు అంటావ్ అని అరియానా అనడంతో.. స్టోర్ రూమ్ లోకి వెళ్లి బాగా కూర్చుంటాడు అని చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్.
పెద్ద పెద్ద కాంటవర్సీలు..
దీంతో చాలా పెద్ద పెద్ద కాంటవర్సీలు చేస్తున్నాడు రాహుల్ ఈరోజు అని అరియానా అనడంతో బీబీ కేఫ్ తాజా ఎపిసోడ్ ప్రొమో ముగిసింది. కాగా ఈ ఐదో వారం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, చలాకీ చంటి, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్‌లు ఉన్నారు.