For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: ఫెమినిస్ట్ కే కొత్త అర్థం చెప్పాడు.. వాళ్లు ఎందుకున్నారో! బిగ్ బాస్ పై జెన్యూన్ రివ్యూ?

  |

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ రేటింగ్ సంగతి ఎలా ఉన్నా అరుపులు, కేకలు, ప్రేమాయణాలు, గొడవలు, అలకలు, బూతులతో బాగానే కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. ఇక తాజా ఎపిసోడ్ లో ఆరో వారం నామినేషన్లు చాలా రసవత్తరంగా సాగాయి. అన్నిటికి మించి ఆదిరెడ్డి, రోహిత్-మెరీనా గొడవ హైలెట్ గా నిలిచింది. ఆదిరెడ్డి దాదాపు పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు.

  ఇక రోహిత్ కొట్టేంతలా ఆదిరెడ్డిపైకి సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం 9 మంది నామినేషన్లలో ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, ఎలిమినేట్ అయినవాళ్లు, సెలబ్రిటీలతోపాటు రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతోంది. ఇందులో భాగంగా ఈ కేఫ్ కు బిగ్ బాస్ రివ్యూవర్ స్పై అక్క హాజరయ్యారు.

  సరిహద్దులను చెరిపేస్తూ..

  సరిహద్దులను చెరిపేస్తూ..

  కొత్త కాన్సెప్టుతో వచ్చినా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని మరీ ప్రసారం అవుతోన్న ఏకైక షో బిగ్ బాస్. బుల్లితెరపై అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ రకరకాల ఎమోషన్స్‌ను చూపిస్తూ సాగిపోతోందీ షో. అందుకే తెలుగులో ఇది ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి అన్నట్లు రెస్పాన్స్‌ను అందుకుంటూ సూపర్ హిట్ చేసుకుంది.

  5 వారాల్లో ఐదుగురు..

  5 వారాల్లో ఐదుగురు..

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ లు బాలాదిత్య, సుదీప (పింకీ), కీర్తి భట్, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో 5 వారాల్లో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చలాకీ చంటి వెళ్లిపోయారు.

  బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలు..

  బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలు..

  బిగ్ బాస్ తెలుగు 6 ఆరో వారం నామినేషన్లలో కీర్తి భట్, ఆదిరెడ్డి, గీతూ రాయల్, బాలాదిత్య, రాజశేఖర్, శ్రీహాన్, సుదీప, మెరీనా, శ్రీసత్య మొత్తం 9 మంది ఉన్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 6 ఐదోవారం చలాకి చంటి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్లు, విన్నర్లు, ఎలిమినేట్ అయినవాళ్లు, సెలబ్రిటీలతోపాటు రివ్యూవర్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతున్నారు.

   బిగ్ బాస్ పై రివ్యూ..

  బిగ్ బాస్ పై రివ్యూ..

  ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ, యాంకర్ శివ, ఆర్జే కాజల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. వీరు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లతోపాటు పాపులర్ సెలబ్రిటీలను సైతం ఇంటర్వ్యూ చేసి ఆసక్తికర సమాధానాలు రాబడుతున్నారు. అలా ఇప్పటివరకు జబర్దస్త్ కమెడియన్, సినిమా రివ్యూవర్ మహిధర్, రాకింగ్ రాకేష్ హాజరుగా కాగా తాజాగా బిగ్ బాస్ తెలుగు స్పై పేరుతో యూట్యూబ్ అండ్ ఇన్ స్టా గ్రామ్ లో బిగ్ బాస్ పై రివ్యూ చేసే స్పై అక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

  హౌజ్ లో ఏం చేస్తున్నారో..

  హౌజ్ లో ఏం చేస్తున్నారో..

  హాయ్ స్పై అక్క అంటూ అరియానా గ్లోరి ఇంటర్వ్యూకి వెల్ కమ్ చెప్పింది. కాలిఫోర్నియాలో మన బిగ్ బాస్ హవా ఎలా ఉంది అని అరియానా అడిగిన ప్రశ్నకు.. ఎంటర్టైన్ మెంట్ అంటే చిన్న కామెడీ చేయడం కాదు. మీరు హౌజ్ లో ఏం చేస్తున్నారో.. మీరు ఏం యాక్షన్స్ చేస్తున్నారో దాని వల్ల బయట జనాలు ఎంటర్టైన్ అవ్వాలి. ఫెమినిస్ట్ కి ఒక కొత్త అర్థం తెచ్చిన ఒక గొప్ప మహానుభావుడు ఆర్జే సూర్య. అంతా సేఫ్ గేమ్.. అంతా సేఫ్ గేమ్.. అని స్పై అక్క సమాధానం ఇస్తుంది. దీనికి అరియానా అయ్యయ్యో అక్క రాగానే చిరాకు పడుతుందేంటి అని అంటుంది.

  వాళ్లు గేమర్సే కాదు అనడం పెద్ద మాట..

  వాళ్లు గేమర్సే కాదు అనడం పెద్ద మాట..

  తర్వాత రోహిత్ అండ్ మెరీనా వాళ్లు అస్సలు గేమే ఆడట్లేదు. వాళ్లు హౌజ్ లో ఎందుకు ఉన్నారో అర్థంకాదు అని స్పై అక్క అంటే వాళ్లు గేమర్సే కాదు అనడం పెద్ద మాట అండి అంటూ గట్టిగా అంటుంది అరియానా. కెమెరా కోసం కంటెంట్ కోసం గేమ్ ఆడుతున్నవాళ్లు ఎవరైనా ఉన్నారా అని అరియానా అడగ్గా.. గీతూ ఏం చేస్తుంది అంటే 24 గంటలు కంటెంట్ కంటెంట్.. కెమెరాలు ఎక్కడ ఫోకస్ చేస్తున్నాయో.. అక్కడ గీతూ ఉంటుంది అని స్పై అక్క చెబుతుంది.

  కంటెంట్ వెనకాల జనాలు..

  తర్వాత మీ ఎక్స్ పెక్టేషన్స్ ని డిసాప్పాయింట్ చేసిన కంటెస్టెంట్ ఎవరైన ఉన్నారా అని అరియానా అడిగిన ప్రశ్నకు ఆదిత్య అండి అని తెలిపింది స్పై అక్క. తర్వాత కంటెంట్ వెనకాల జనాలు పరుగెడుతున్నారు. రేవంత్ వెనకాల కంటెంట్ పరిగెడుతోంది అని స్పై అక్క అంటుంది. దీనికి స్పై గారు మీరు రేవంత్ ను ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుందే నాకు ఈ కన్వర్జేషన్లో నాకు అని అరియానా అంటే కాదన్నట్లుగా స్పై అక్క చేతులు ఊపుతుంది.

  English summary
  Bigg Boss Telugu Spy Youtuber Spy Akka Review On Bigg Boss Telugu 6 Season Contestants In BB Cafe.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X