twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గంగవ్వ నిర్ణయంపై సోహైల్ ధిక్కారం.. కెప్టెన్సీగా ఎంపికైంది ఎవరంటే.. అఖిల్ కంటతడి

    |

    బిగ్‌బాస్ ఇంటిలో 31 రోజు కూడా బీబీ హోటల్ టాస్క్ కొనసాగింది. బిబీ హోటల్ టాస్క్ తర్వాత కెప్టెన్సీ ఎంపిక టాస్క్ జరిగింది. కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్ సార్థక్, అవినాష్, సయ్యద్ సోహైల్ ర్యాన్ పాల్గొన్నారు. ఇంకా 31వ రోజు ఇంకా ఏం జరిగిందంటే..

    ముగిసిన బిబీ హోటల్ టాస్క్

    ముగిసిన బిబీ హోటల్ టాస్క్

    బీబీ హోటల్ టాస్క్ ముగిసిందని ప్రకటించిన తర్వాత లివింగ్ రూమ్‌లోకి రావాలని ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఆదేశించడంతో అందరూ అక్కడికి చేరుకొన్నారు. ఆ తర్వాత 5 స్టార్స్ గెస్ట్ టీమ్ నుంచి అతిథుల టీమ్ పొందిందా అని బిగ్‌బాస్ అడిగారు.

    గెస్ట్ టీమ్ విజేతగా నిలవడంతో

    గెస్ట్ టీమ్ విజేతగా నిలవడంతో

    దాంతో హారిక స్పందించి నేను ఒకటే స్టార్ ఇచ్చాను. నేను ఎవరికీ 5 స్టార్స్ ఇవ్వలేదని చెప్పింది. అయితే నాకు హారిక 5 స్టార్స్ ఇచ్చిందని అభిజిత్ అన్నాడు. చివరకు బిగ్‌బాస్ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత గెస్ట్ టీమ్‌ విజయం సాధించిందని ప్రకటించారు. ఈ టాస్క్‌లో బెస్ట్ ఫెర్ఫార్మర్ ఎవరని బిగ్ బాస్ అడిగితే మెహబూబ్ అంటూ గంగవ్వ చెబితే.. అందుకు సోహైల్ నిరాకరించారు. గంగవ్వ చెప్పే మాటలను ఏకపక్షంగా పరిగణనలోకి తీసుకోకూడదని సోహైల్ అన్నారు.

    కెప్టెన్సీ పోటీదారులుగా ముగ్గురు

    కెప్టెన్సీ పోటీదారులుగా ముగ్గురు

    దాంతో బీబీ టాస్క్‌లో బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా ఉన్న వ్యక్తి నిర్ణయించి పేరు చెప్పమనగా.. హారిక, మెహబూబ్, సోహైల్, అరియానా నేనంటే నేను అంటూ వాదించుకొన్నారు. చివరకు అందరూ కలిసి సోహైల్‌ను బెస్ట్ పెర్ఫార్మర్‌గా ప్రకటించారు. దాంతో సోహైల్‌ను కెప్టెన్సీ టాస్క్‌కు పోటీదారుడిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ఎక్కువ టిప్స్ సాధించిన అఖిల్ సార్థక్‌ను రెండో పోటీదారుడిగా, సీక్రెట్ టాస్క్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసిన అవినాష్‌ను మూడో పోటీదారుడిగా ఎంపిక చేశారు.

    చెత్త పెర్ఫార్మర్‌ అమ్మా రాజశేఖర్‌కు శిక్ష

    చెత్త పెర్ఫార్మర్‌ అమ్మా రాజశేఖర్‌కు శిక్ష

    బిబీ హోటల్ టాస్క్‌లో చెత్తగా ఆడిన సెలబ్రిటీ ఎవరంటే.. నేనే అని అమ్మా రాజశేఖర్ చెప్పారు. మిగితా ఎవరూ కూడా తాము అంటూ చెప్పకపోవడంతో రాజశేఖర్‌నే చెత్త ఫెర్ఫార్మర్‌గా ఎంపిక చేశాడు. చెత్తగా ఆడినందుకు బుట్టలో ఉల్లిగడ్డలను తెప్పించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని తిరిగి బిగ్‌బాస్ ఇంటికి పంపించాలని సూచించాడు.

    మంచు, నిప్పు.. మధ్యలో ఓర్పు

    మంచు, నిప్పు.. మధ్యలో ఓర్పు

    కెప్టెన్సీ ఎంపిక టాస్క్ కోసం మంచు నిప్పు.. మధ్యలో ఓర్పు అనే పేరుతో గేమ్‌ను నిర్వహించారు. కింద నిప్పు.. చేతిలో బౌల్‌లో మంచు చేతిలో పెట్టి నిలుచోబెట్టారు. తొలుత కెప్టెన్సీ టాస్క్ నుంచి అఖిల్ విరమించుకొన్నారు. ఆ తర్వాత కాసేపటికే అవినాష్ కూడా విరమించుకోవడంతో సోహైల్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కెప్టెన్సీ ఎంపిక తర్వాత మోనాల్ వచ్చి మాట్లాడితే అఖిల్ స్పందించలేదు. ఆ తర్వాత స్మోకింగ్ జోన్‌లోకి వెళ్లి ఏడుస్తూ కనిపించారు.

    Recommended Video

    Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Net Worth Details
    కెప్టెన్‌గా సయ్యద్ సోహైల్ ర్యాన్

    కెప్టెన్‌గా సయ్యద్ సోహైల్ ర్యాన్

    కెప్టెన్‌గా ఎంపికైన సోహైల్‌ను ఇంటి సభ్యులు అభినందించారు. గత కెప్టెన్ కుమార్ సాయి నుంచి కెప్టెన్సీ బ్యాండ్‌ను తీసుకొని చేతికి ధరించాడు. ఆ తర్వాత మెహబూబ్, సోహైల్ మాట్లాడుకొంటూ కాయిన్స్ టాస్క్ తర్వాత మనం బలంగా మారిపోయాం. మనం వ్యక్తిగతం ఆడితే మన ముందు ఎవరు నిలువరూ అనే విధంగా కామెంట్ చేశారు.

    English summary
    Bigg Boss Telugu Season 4: In the 31th day, BB Hotel Task goes. after finishing of this task, Captaincy task took place. In this task Sohail Syed Ryan elected as Captain. He takes charge from the Kumar Sai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X