హానీమూన్‌కు మానస్, ప్రియాంక.. యాంకర్ రవికి అలాంటి వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో పదో వారానికి కెప్టెన్సీ కోసం ఆట మొదలైంది. కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ కోసం బీబీ హోటల్ టాస్క్‌ను ఎప్పటి మాదిరిగానే తెరపైకి తెచ్చారు. ఈ గేమ్‌లో వీజే సన్నీ, యాంకర్ రవి, సిరి హన్మంతు, కాజల్ క్యారెక్టర్లు ఫన్నీగా మారాయి. నవంబర్ 10వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్

యాంకర్ రవికి సీక్రెట్ టాస్క్

బీబీ హోటల్ టాస్క్ భాగంగా బిగ్‌బాస్ మీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాం. ఈ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా మీరు నోటీసు పీరియడ్‌లో ఉన్న హోటల్ ఉద్యోగి మాదిరిగా నటించాలి. అతిథులకు హోటల్ స్టాఫ్ ఇచ్చే సర్వీసులను అడ్డుకోవాలి. హోటల్ స్టాఫ్ కంటే మీ పనులు, మీ సేవలు నచ్చేలా అతిథులకు ఫీలింగ్ కల్పించాలి. మీరు ఒకవేళ మీ సీక్రెట్ టాస్క్ గురించి చెప్పినా, ఎవరికైనా దొరికినా కెప్టెన్సీ పోటీదారులు టాస్క్‌లో పాల్గోనే అవకాశం కోల్పోతారని యాంకర్ రవిని బిగ్‌బాస్ హెచ్చరించారు.

బీబీ హోటల్ టాస్క్‌‌లో కంటెస్టెంట్లు ఇలా

బీబీ హోటల్ టాస్క్‌‌లో కంటెస్టెంట్లు ఇలా

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం బీబీ హోటల్ గేమ్ ఆడాల్సి ఉంటుందని యాంకర్ రవి చెప్పారు. హోటల్‌కు వచ్చి అతిథులను సంతృప్తి పరిచేలా హోటల్ స్టాఫ్ సేవలు అందించాలి. అతిథులను మెప్పించి వారి నుంచి టిప్స్ పొందేలా వ్యవహరించాలి. ఈ గేమ్‌లో శ్రీరామ్, షణ్ముఖ్ హోటల్ స్టాఫ్‌గా, చెఫ్స్, వెయిటర్, మేనేజర్, రిసెప్షనిస్ట్‌గా అనీ మాస్టర్, ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంటి జాబ్‌ను నిలబెట్టుకోవాలనే ఉద్యోగిగా యాంకర్ రవి, హానీమూన్‌కు వచ్చిన జంటగా మానస్, ప్రియాంక, కాజల్ హోటల్‌ ఓనర్‌కు స్నేహితురాలిగా కాజల్, మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్‌కు వచ్చిన కస్టమర్‌గా వీజే సన్నీ, డాన్ కూతురుగా సిరి హన్మంతు నటించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ టిప్స్ సొంతం చేసుకొంటారో వారు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అవుతారు అని బిగ్‌బాస్ రూల్స్‌ను రవి వినిపించారు.

వీజే సన్నీ కామెడీగా, ఫన్నీగా

వీజే సన్నీ కామెడీగా, ఫన్నీగా

బీబీ హోటల్ టాస్క్‌లో మొదటి రోజు ఆటలో వీజే సన్నీ కామెడీ సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకొన్నాయి. పల్లెటూరి వ్యక్తిగా తనదైన కామెడీతో ఆకట్టుకొన్నారు. అనీ మాస్టర్‌తో సన్నీ చేసిన ఫన్ మూమెంట్స్ నవ్వించేలా ఉన్నాయి. గేమ్‌లో భాగంగా టిప్స్ అడిగితే.. పొద్దున్నే వాము వాటర్ తాగండి.. ఉదయం మంచిగా మోషన్ అవుతుంది.. ఇదే నా టిప్ అంటూ వీజే సన్నీ తన మార్క్ డైలాగ్స్ వదిలారు. నీకు ఎవరైనా చెప్పారా? నీ ముఖం పిల్లిలా ఉంటుంది అంటూ అనీ మాస్టర్‌ను సన్నీ ఆటపట్టించారు.

ఇంటి సభ్యులను ఆటాడించిన కాజల్

ఇంటి సభ్యులను ఆటాడించిన కాజల్

ఇక హోటల్ ఓనర్ ఫ్రెండ్‌గా నటించిన కాజల్ ఇంటి సభ్యులను తన ఇగో బిహేవియర్‌తో టార్చర్ పెట్టేందుకు ప్రయత్నించారు. ఇంటిలోని మూడు కోతులు మాదిరిగా ఫోజు పెట్టాలని రవి, షణ్ముఖ్, శ్రీరామ్‌ను ఆదేశిస్తే.. వాళ్లు ఆ మూడు కోతులుగా మారి ఫ్రీజ్ అయిపోయారు. అయితే ఎక్కువ సేపు అదే భంగిమలో లేకపోవడంతో టిప్ క్యాన్సిల్ అంటూ బెదిరించింది.

హనీమూన్ జంటగా ప్రియాంక, మానస్

హనీమూన్ జంటగా ప్రియాంక, మానస్

ఇక హానీమూన్‌కు వచ్చిన జంటగా ప్రియాంక, మానస్ ఎంట్రీతో మరింత కామెడీ పండింది. ప్రియాంకతో వీజే సన్నీ చిలిపిగా ప్రవర్తించడం ఆకట్టుకొన్నది. భర్త మానస్ పక్కనే ఉండగా ప్రియాంకను తాకడం లాంటీ సీన్లు కామెడీ పండించాయి. ఓ దశలో తనను తాకడంతో ప్రియాంక అలిగి వెళ్లడంతో .. ఆమెతో జాగ్రత్తగా ఉండు. చాలా డేంజర్ అంటూ మానస్‌కు వీజే సన్నీ హెచ్చరించడం కనిపించింది.

Recommended Video

Devarakonda Brothers About Pushpaka Vimanam Movie | Part 2
కాజల్ క్యాష్ దొంగిలించిన రవి

కాజల్ క్యాష్ దొంగిలించిన రవి

బీబీ హోటల్ టాస్క్‌లో సీక్రెట్ టాస్క్‌లో భాగంగా ఇంటిలో కొన్ని సర్వీసులను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కాజల్ బ్యాగ్ నుంచి 1700 క్యాష్‌ను దొంగిలించి దాచుకొన్నారు. కాజల్ తన డబ్బు పోయిందని గొడవ చేసింది. ఎవరు తీశారో చెప్పాలని చెప్పగా.. తాము తీసుకోలేదని చెప్పారు. ఇలా సందడి సందడిగా వినోదాన్ని పంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X