డ్రెస్ జారిపోయినా పెర్ఫార్మ్ చేయాల్సిందే.. బీబీ జోడిలో జడ్జీల షాకింగ్ కామెంట్స్
Photo Courtesy: Star Maa
దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై సీనియర్ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు యాంకర్ అనసూయ కౌంటర్లు, ఇద్దరి మధ్యా మాటల యుద్ధం తారాస్థాయిలో నడిచింది. శివాజీ క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం చల్లారలేదు. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా, సినీ పరిశ్రమ రెండుగా విడిపోయి.. శివాజీకి, అనసూయకు మద్ధతుగా నిలిచాయి. ఇప్పుడిప్పుడే వివాదం సద్దుమణుగుతున్న దశలో బుల్లితెరపై జరిగిన ఓ షో వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో పలు రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. వీటిలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈ కోవలోనే స్టార్ మాలో బీబీ జోడీ తాజాగా ప్రసారమవుతోంది. నిన్న మొన్నటి వరకు బిగ్‌బాస్ తెలుగు 9 కార్యక్రమం ప్రేక్షకులకు వినోదాన్ని పంచగా.. దాని స్థానంలోకి బీబీ జోడీ వచ్చింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్‌తో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈ డ్యాన్స్ షోలో పాల్గొంటున్నారు. ఇక తాజా బీబీ జోడీ 2 సీజన్‌లో రీతూ చౌదరి- డిమోన్ పవన్‌లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. వీరిద్దరూ రొమాంటిక్‌గా చేసిన డ్యాన్స్ షో వైరల్ అవుతోంది.
Photo Courtesy: Star Maa

ఎప్పటిలాగే ఈ వారం కూడా బీబీ జోడీ 2 ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వారం బ్లాక్‌బస్టర్ థీమ్‌లో భాగంగా కంటెస్టెంట్స్ రకరకాల సాంగ్స్‌ను ఎంచుకుని డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. దాంతో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్.. బుల్లితెర నటి కీర్తీ భట్ - ఆర్జే చైతూలు జంటగా డ్యాన్స్ చేశారు. మంచి జోరు మీద డ్యాన్స్ చేస్తుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉన్నట్లుండి కీర్తిభట్ ఏదో ఇబ్బంది పడింది. వెనుక డ్రెస్ జారీ పోతున్నట్లు గమనించి వెంటనే డ్యాన్స్‌ని మధ్యలో ఆపేసింది. దాంతో యాంకర్ ప్రదీప్, జడ్జిలు, తోటి కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు.
ఈ పరిస్ధితులును చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన యాంకర్ ప్రదీప్.. వీళ్లకి ఒక ఛాన్స్ వస్తుందా అని న్యాయనిర్ణేతలను అడిగాడు. దాంతో జడ్జిలుగా ఉన్న శేఖర్ మాస్టర్, శ్రీదేవి, సదాలు మంతనాలు జరుపుకుని తమ నిర్ణయం చెప్పారు. ఇంతలో లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి వారికైనా ఒక్కసారే అవకాశం ఇస్తామని సదా తేల్చేసింది. ఈ నిర్ణయంపై కీర్తిభట్ షాక్ అయ్యింది. అంటే నా డ్రెస్ జారిపోయిన డ్యాన్స్ చేయాలా? అని సీరియస్‌గా నిలదీసింది. దాంతో శ్రీదేవి విజయ్ కుమార్ జ్యోక్యం చేసుకుని సదాగారు అలా చెప్పలేదు.. మీరు అన్నది రాంగ్ అని వ్యాఖ్యానించింది.
కానీ మీ ఇంటెన్స్ అలాగే ఉంది.. నేను స్టెప్ మూవ్‌మెంట్ మరిచిపోయినా, మధ్యలో డ్యాన్స్ చేయకుండా ఆగిపోయినా నేను ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఎంత రియాలిటీ షో అయినా ఓ అమ్మాయి డ్రెస్ డ్రెస్సే అని కీర్తి భట్ ఎక్కడా తగ్గకుండా మాట్లాడింది. పరిస్ధితి చేజారిపోయేలా కనిపించడంతో పాటు వివాదానికి దారితీసేలా ఉండటంతో శేఖర్ మాస్టర్ రంగంలోకి దిగారు. మాక్కూడా ఆడపిల్లలు ఉన్నారు.. ఏం జరిగినా డ్యాన్స్ చేయండి అని చెప్పే రకం మేం కాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బీబీ జోడీ 2 ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి దీనిపై జడ్జిలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? కీర్తిభట్ తన డ్యాన్స్ కొనసాగించిందా? లేదా తెలియాలంటే ఈ వారం బీబీ జోడీ చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications











