BB Jodi Grand Finaleలో తలపడనున్న 5 జంటలు.. టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే?
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటిలానే మరో కొత్త సీజన్ తీసుకువచ్చేందుకు సమయం ఉండటంతో బుల్లితెర ప్రేక్షకులను, బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన చేసేందుకు రియాలిటీ డ్యాన్స్ షోతో ముందుకు వచ్చారు మేకర్స్. బీబీ జోడీ పేరుతో తీసుకొచ్చిన ఈ డ్యాన్స్ షోలో గత సీజన్లలోని కంటెస్టెంట్లు తమ హాట్ పర్ఫామెన్స్ లతో అదరగొట్టారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ రియాలిటీ షో కూడా చివరి అంకానికి చేరుకుంది. ఈ క్రమంలో బీబీ జోడీగా టైటిల్ గా గెలిచే జంటకు వచ్చే ప్రైజ్ మనీ హాట్ టాపిక్ గా మారింది.

సెలబ్రెటీలకు అడ్డగా..
సెలబ్రిటీలకు అడ్డాగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో తొలుత పాపులర్ నటీనటులే ఎంట్రీ ఇచ్చారు. తర్వాతి కాలంలో సీజన్ లు పెరుగుతున్న కొద్దీ సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా రకరకాల రంగంలో రాణించిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. ఇక వాళ్లందరు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరించేవారు. ఈ కంటెస్టెంట్ల లోపల మంచి డ్యాన్సర్స్ దాగి ఉండటంతో వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయించారు మేకర్స్.

మొత్తంగా 9 జోడీలు..
బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మగా పేరొందిన బొద్దుగుమ్మ శ్రీముఖి హోస్ట్ గా ఆకట్టుకుంది. ఇక జోడీలుగా కమెడియన్ అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి, అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ, రోల్ రైడా-ఇనయా సుల్తానా మొత్తంగా 9 జోడీలు పార్టిస్ పేట్ చేశాయి.

హాట్ నెస్ పర్ఫామెన్సులు..
ఈ 8 జోడీలు ప్రతివారం అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాయి. అంతేకాకుండా ఘాటు రొమాంటిక్ సాంగ్స్ తో అంతకుమించిన రొమాన్స్ పండించి ఇటు ప్రేక్షకులు, అటు న్యాయ నిర్ణేతలను సైతం ఔరా అనిపించారు బీబీ జోడీ కంటెస్టెంట్స్. వీరిలో ఎక్కువగా తేజస్వి-అఖిల్, అర్జున్-వాసంతి, శ్రీసత్య-మెహబూబ్, అవినాష్-అరియానా జోడీలు హాట్ నెస్ తో మిగతావారికంటే రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేశాయి. ప్రతిసారీ కొత్త కాన్సెప్టుతో ఆకర్షించాయి.

గ్రాండ్ ఫినాలేలో 5 జంటలు..
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ఎపిసోడ్స్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఈవారం జరగబోయే బీబీ జోడీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ బీబీ జోడీ గ్రాండ్ ఫినాలేలోకి మొత్తంగా 5 జంటలు అడుగుపెట్టాయి.

ఒకరికి మించి మరొకరు..
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముఖ్య అతిథిగా హాజరైన బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేలో మెహబూబ్-శ్రీసత్య, అవినాష్-అరియానా గ్లోరీ, ఆర్జే సూర్య-ఫైమా, ఆర్జే కాజల్-ఆర్జే చైతూ, అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్ జంటలు పోటీ పడనున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ జోడీలంతా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకున్నాయి. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఉంది వారి డ్యాన్స్ పర్ఫామెన్స్.

యుద్ధానికి సమాధానమే ఈ టైటిల్..
అయితే ఇప్పుడు ఈ బీబీ జోడీ గ్రాండ్ ఫినాలేలో గెలిచిన జంటకు వచ్చే ప్రైజ్ మనీపై ఆసక్తి నెలకొంది. ప్రైజ్ మనీతో పాటు బీబీ జోడీ టైటిల్ ట్రోఫీని కూడా అందజేయనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆ ప్రైజ్ మనీ ఎంతో చెప్పేశారు. ప్రోమో మొదట్లో "గెలిచినోడికి గుర్తింపు పట్టుకున్న టైటిల్ లోనే ఉంటుంది. ఇది ఒక పెద్ద యుద్ధం. దానికి సమాధానమే ఈ టైటిల్" అని శ్రీముఖి చెప్పగా.. ప్రైజ్ మనీ రూ. 25 లక్షలు అని చూపించారు. ఇక ఈ ఎపిసోడ్ మార్చి 25, 26న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











