స్టేజ్ పై బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మధ్య బిగ్ ఫైట్.. మీ పరువు మీరే తీసుకుంటున్నారంటూ!

BB Jodi: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాపులర్టీని బేస్ చేసుకుని డిజైన్ చేసిన ప్రోగ్రామ్ బీబీ జోడి. బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన తర్వాత అదే టైమ్‌స్లాట్‌లో బీబీ జోడీ 2 ప్రారంభమైంది. ఈ డ్యాన్స్ షోకు శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్‌కుమార్, సదా జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా పాల్గొంటున్నారు. ఈ డ్యాన్స్ కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతుంది. అయితే.. తాజా ఎపిసోడ్‌లో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం నెట్టింట పెద్ద చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ జోడీ సీజన్ 2 (BB Jodi Season 2)వేదికగా మరోసారి హై వోల్టేజ్ డ్రామా చోటుచేసుకుంది. డ్యాన్స్ కంటే ఎక్కువగా గొడవలే హైలైట్‌గా మారుతున్నాయి. ఈ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రోమోతో మానస్-ధన్‌రాజ్ మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే బిగ్‌బాస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లు కావడంతో, స్టేజ్‌పై అభిప్రాయాలు కాస్త గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. జడ్జీలు 'సూపర్ బంపర్ పెర్ఫామెన్స్' అంటూ మెచ్చుకుంటుంటే... తోటి జోడీలు మాత్రం జడ్జీలకంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయంలో వంకలుపెడుతూ.. తక్కువ మార్కులు వేస్తూ కామెంట్లు చేయడం ఈసారి వివాదానికి కారణమైంది.

BB Jodi Season 2 Maanas Shrasti Verma Angry on Dhanraj Heated Stage Clash

Photo courtesy: Star Maa

లేటెస్ట్ ప్రోమోలో 'సూపర్ స్టార్స్ స్పెషల్'లో భాగంగా విశ్వ-నేహా జోడీ అల్లు అర్జున్ పాటలకు ఇచ్చిన పెర్ఫామెన్స్‌కు జడ్జీలంతా ఫిదా అయ్యారు. 'ఈరోజు ఎక్స్‌ట్రార్డినరీగా చేశావు'అంటూ జడ్జీ శ్రీదేవీ గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చి స్టేజ్‌పై స్టెప్పులు వేసారు. అలాగే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా స్టేజ్‌పైకి వచ్చి విశ్వతో కలిసి డ్యాన్ చేశారు. 'బన్నీ సార్ స్టైల్‌లో చేసిన మీ డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు' అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. విశ్వ-నేహా జోడీకి మానస్ నాగులపల్లి కేవలం 7 మార్కులే ఇచ్చాడు. 'కొరియోగ్రఫీ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అయింది'అంటూ తన అభిప్రాయం చెప్పాడు. దీంతో నేహా అసహనం వ్యక్తం చేస్తూ, 'మీరు చెప్పేది మీరు చెప్పండి.. మధ్యలో ఎందుకు కామెంట్రీ?' అంటూ ఫైర్ అయింది.

తర్వాత మానస్-శ్రష్టి జోడీ పవన్ కళ్యాణ్ పాటలకు అదిరిపోయే స్టెప్పులేశారు. వారి పెర్ఫామెన్స్‌కు శేఖర్ మాస్టర్ ప్రశంసలు కురిపించారు. కానీ, ఈ జోడీకి ధనరాజ్ కూడా 7 మార్కులే ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మార్కులు చూసిన శ్రష్టి షాక్ అయ్యింది. పైగా 'మీరు డ్యాన్స్ చూస్తున్నప్పుడు ఎప్పుడూ కిందకే చూస్తున్నారు' అంటూ ధన్‌రాజ్‌ కామెంట్ చేశారు.దీంతో శ్రష్టి 'ఏం మాట్లాడాలి' అంటుంది. దీంతో ధనరాజ్ 'అయితే నేను ఇంకేం మాట్లాడను' అని కౌంటర్ ఇచ్చాడు. దీంతో శ్రష్టి 'అదే బెటర్' అంటూ ఘాటుగా స్పందించింది.

'మీ పరువు మీరే తీసుకుంటున్నారు!'
ఇక్కడే మానస్ రంగంలోకి దిగాడు. 'మైండ్‌లో ఏదో పెట్టుకుని ఏదో మార్కులు వేసి, దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి మీ పరువు ఎందుకు మీరే తీసుకుంటారు?'అంటూ ధన్‌రాజ్‌ను నిలదీశాడు. ఈ మాటతో ధన్‌రాజ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 'పరువు ఏంటి? ఒకసారి చెప్పు!'అంటూ లేచాడు. దీనికి మానస్ 'నీ పాయింట్ వాలిడ్‌గా లేదు'అని చెప్పగా.. 'టెలికాస్ట్ అయిన తర్వాత నేను చెప్పింది తప్పు అనిపిస్తే మీకు సారీ చెబుతా' అంటూ ధన్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఎపిసోడ్ చూస్తే అసలు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. BB జోడీ సీజన్ 2లో డ్యాన్స్ కంటే డ్రామానే ఎక్కువ. జడ్జీల ప్రశంసలు ఒకవైపు..కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మరోవైపు షోకు అదనపు మసాలా అందిస్తోంది. ముఖ్యంగా మానస్-ధన్‌రాజ్ మధ్య జరిగిన ఈ 'పరువు' డిబేట్ ప్రేక్షకుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇలా స్టేజ్‌పై మొదలైన ఈ బిగ్ ఫైట్ రాబోయే ఎపిసోడ్స్‌లో ఇంకెన్ని ట్విస్ట్‌లు తీసుకొస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X