Bigg Boss Telugu 7: BB1 టు BB6 విన్నర్స్ వీళ్లే... మరి ఈసారి విజేత ఎవరంటే?

తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన షోల్లో బిగ్ బాస్ ఒకటి. అయితే ఈ బిగ్ బాస్ మొదట హాలీవుడ్ లో మొదలు అయింది. అలా ఇండియాకు చేరి.. హిందీలో ప్రారంభం అయింది. ఆ తర్వాత రీజినల్ లాంగ్వేజ్ లకు చేరి.. మన తెలుగులోకి వచ్చేసింది. అలా బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలై.. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నడుస్తుంది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి బిగ్ బాస్ 6వ సీజన్ విన్నర్స్ ఎవరు.. ఇప్పుడు 7వ సీజన్ లో ఎవరు విజేత కానున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 మొదట ఎన్టీఆర్ హౌస్టుగా సాగింది. అప్పటి వరకు మన వాళ్లకు బిగ్ బాస్ అంటే ఎలా ఉంటుందో తెలియదు.. హిందీలో చూడటమే తప్ప తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా తెలియదు. మొదటి సారిగా ఓ స్టార్ హీరో బుల్లితెరపై హోస్టుగా చేస్తుండటం.. అందులో స్టార్స్ అంతా కలిసి ఒక ఇంట్లో ఉండటం అనేది ఆసక్తిగా మారింది. మొదటి సీజన్ కు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఇక మొదటి సీజన్ లో చాలా వరకు హీరోలు, హీరోయిన్స్ హౌస్ మేట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

BB Telugu 1 to BB Telugu 6 Winners List and Bigg Boss Telugu 7 Winner Fix Full Details Here

ఇక అందులో మొదటిసీజన్ విన్నర్ గా శివ బాలజీ నిలిచారు. ఆయన అప్పట్లో హీరోనే.. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి.. తనదైన ఆటతో అందరి మనసు గెలుచుకుని మొదటి బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా నిలిచారు. ఇక సీజన్ 2పై కూడా హైప్స్ పెరిగిపోయాయి. ఇక సీజన్ 2కి హౌస్టుగా నేచురల్ స్టార్ నాని చేశారు. ఇక ఆ షోలో కూడా చాలా పేరున్న హీరోలు, హీరోయిన్సు ను పట్టుకువచ్చారు. ఇక సీజన్ 2 విన్నర్ గా కౌషల్ గెలిచాడు. ఆయనకు అప్పట్లో సపరేట్ ఆర్మీనే క్రియేట్ అయింది.

BB Telugu 1 to BB Telugu 6 Winners List and Bigg Boss Telugu 7 Winner Fix Full Details Here

ఇక బిగ్ బాస్ సీజన్ 3 నుంచి బిగ్ బాస్ సీజన్ 7 వరకు హోస్టుగా నాగార్జునే చేస్తున్నాడు. ఇక సీజన్ 3కి విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి కూడా... విన్నర్ కావడం విశేషం. ఇక ఆయన పాటలతో ఇంట్లో వాళ్లను ఎంతగా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక పునర్నివితో లవ్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక సీజన్ 4 విన్నర్ గా అభిజిత్ నిలిచాడు. అమాయకంగా కనిపిస్తూనే.. అందరి మనసును దోచుకున్నాడు ఈ హీరో.

BB Telugu 1 to BB Telugu 6 Winners List and Bigg Boss Telugu 7 Winner Fix Full Details Here

ఇక బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ నిలిచాడు. ఓ కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి... వీజే సన్నీ విన్నర్ గా నిలిచాడు. ఆ తర్వాత సీజన్ 6లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు. తన ఆటతో సీజన్ 6లో అందరిని మెప్పించాడు. అలా సీజన్ 6 విన్నర్ గా నిలిచాడు. ఇక ఓటీటీ బిగ్ బాస్ వర్షన్ లో హీరోయిన్ బింధు మాధవి విజేతగా నిలిచింది. ఒక్క ఓటీటీ వర్షన్ లో తప్ప.. ఏ ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ కాలేదు.

BB Telugu 1 to BB Telugu 6 Winners List and Bigg Boss Telugu 7 Winner Fix Full Details Here

ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక ఈసారి విన్నర్ అయ్యేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. అందులో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్ దీప్ ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా శివాజీకి క్రేజ్ ఉంది. ఎందుకంటే... ఆయన సినిమా స్టార్.. అలా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సారి సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను చేయాలని బిగ్ బాస్ టీమ్ అనుకుంటుందట. దానికి కారణం ఒక సామాన్యవ్యక్తిగా వచ్చి.. ప్రేక్షకుల్లో ఆదరణ పొందుతున్నారని.. ఓ కామన్ మ్యాన్ కు ఇస్తే.. షోకి కూడా ఆదరణ పెరుగుతుందని భావిస్తుందట. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X