టాప్ 5 నుంచి అవుట్.. ఎలిమినేట్ అవుతూ షాకిచ్చిన హారిక.. అలా పిలవడంతో హర్టైన అఖిల్

బిగ్ బాస్ షో ఫినాలే సందడి రచ్చ రచ్చగా ఉంది. టాప్ కంటెస్టెంట్లు కాకుండా, నాల్గో సీజన్ సభ్యులందరూ స్టేజ్ మీదకు వచ్చారు. డ్యాన్సులతో అదరగొట్టేశారు. టాప్ 5 కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. కంటెస్టెంట్ల తమ ఇంటి సభ్యులతో మాట్లాడారు. అంతా సందడిగా సరదాగా జరుగుతున్న క్రమంలో టాప్ 5 నుంచి మొదటి ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. మొదటి కంటెస్టెంట్‌ను బయటకు పట్టుకొచ్చేందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెహ్రీన్‌లను లోపలకి పంపించారు.

 మొదటిసారిగా అలా..

మొదటిసారిగా అలా..

కరోనా ఉండటం మూలానా ఇంతవరకు బిగ్ బాస్ ఇంట్లోకి ఎవ్వరూ వెళ్లలేదు. అందులోంచి బయటకు రావడమే గానీ ఇంత వరకు లోపలకు ఎవ్వరూ వెళ్లలేదు. అలా మొదటి సారిగా టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చేందుకు అనిల్ రావిపూడి, మెహ్రీన్‌లు లోపలకి వెళ్లారు.

ఎంటర్టైన్మెంట్ ఇస్తూ..

ఎంటర్టైన్మెంట్ ఇస్తూ..

లోపలకి వెళ్లిన అనిల్ రావిపూడి ఇంటి సభ్యులక పలు రకాల ప్రశ్నలు సంధించాడు. ఇంట్లో వేరే వారి కప్పుల్లో టీ తాగారా? టవల్స్ వాడారా? కొట్టాలని అనిపించిందా? ఎవరి గురించైనా చెడుగా మాట్లాడారా? అంటూ పలు రకాల ప్రశ్నలు అడిగారు. చివరకు అందరిని ఒక్కో ప్రశ్నను అడుగుతూ ఎంటర్టైన్ చేశాడు.

క్రేన్‌లో పైకి ఎత్తారు..

క్రేన్‌లో పైకి ఎత్తారు..

ఇక ఎలిమినేషన్‌ను కొత్తగా చేశారు. అందరికీ కళ్లగంతలు కట్టేసి.. మెహ్రీన్ చేత హారికను క్రేన్‌లో కూర్చోపెట్టారు. అలా హారిక గాల్లో తేలిపోయింది. అయితే వెళ్లేటప్పుడు అందరికీ షాక్ ఇచ్చింది. గాల్లో తేలిపోతూ చివరగా అందరి మీద ఓ బాంబు వేసేసింది.

 బ్రదర్స్ అంటూ పిలిచేసింది..

బ్రదర్స్ అంటూ పిలిచేసింది..

ఇక హారిక పైన గాల్లో తేలిపోతూ.. మిస్ యూ బిగ్ బాస్ లవ్యూ యూ బిగ్ బాస్ అని అరిచేసింది. ఎవరో ఒకరు వెళ్లాల్సిందే కదా అంటూ అందరినీ ఊరడించే ప్రయత్నం చేసింది హారిక. అలా పైకి వెళ్లిపోతూ అందరినీ బ్రదర్స్ అనేసింది. ఇన్నాళ్లూ ఫ్రెండ్స్ అని ఇప్పుడు వెళ్లే ముందు బ్రదర్స్ అంటావా? అని అఖిల్ సోహెల్ కౌంటర్లు వేశారు. అలా బ్రదర్ అని పిలవడంతో అఖిల్ నిజంగానే హర్ట్ అయినట్టున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X