BB Telugu Grand Finale.. విన్నర్ అంటూ ముందే లీక్.. నోయల్ సెన్సేషనల్ పోస్ట్
బిగ్ బాస్ షోకి నేడు చివరి రోజు. ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. సెప్టెంబర్ 6న అంగరంగ వైభవంగా మొదలైన నాల్గో సీజన్ డిసెంబర్ 20న ముగుస్తోంది. మొత్తానికి ఇంట్లో వంద రోజులకు పైగా ప్రయాణాన్ని కొనసాగించి అభిజిత్, అఖిల్, సోహెల్, అరియానా, హారికలు టాప్ 5లోకి చేరుకున్నారు. అయితే ఈ సీజన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నాల్గో సీజన్ టైటిల్ విన్నర్ ఎవరన్నది ఎప్పుడో ఫిక్స్ అయింది. కానీ దాన్ని లాంఛనంగా ప్రకటించడం కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు.

ఓట్ల రచ్చ..
వారం రోజులు తమ కంటెస్టెంట్లు ఓట్లు వేయమంటూ.. సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ రచ్చ చేశారు. ఈక్రమంలో ఒకరిపై ఒకరు వాదనలకు దిగారు.. నెగెటివ్ ప్రచారాలు చేశారు.. ఎన్నో రకాల ట్రోలింగ్‌లు జరిగాయి. చివరకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. నేడు ఫినాలే ఎపిసోడ్ కూడా రెడీ అయింది. విన్నర్ ఎవర్నది ఎప్పుడో తేలిపోయింది.

స్పెషల్ ప్రమోషన్స్..
స్టార్ మా కూడా బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌ను ప్రమోట్ చేసేందుకు రంగంలోకి దిగింది. బిగ్ బాస్ ఫినాలే సెలెబ్రేషన్స్‌లో పాలు పంచుకునేందుకు ఓ స్పెషల్ హ్యాష్ ట్యాగ్‌ను రిలీజ్ చేసింది. నాగార్జున కూడా దాన్ని బాగానే ప్రమోట్ చేశాడు. BB Telugu Grand Finale అంటూ ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాలు పంచుకోండని చెప్పుకొచ్చాడు.

రన్నర్ ఎవరంటూ రచ్చ..
ఓ వైపు గ్రాండ్ ఫినాలే ఏర్పాట్లలో బిగ్ బాస్ టీం బిజీగా ఉంటే.. సోషల్ మీడియాలో మాత్రం రన్నరప్‌గా ఎవరు నిలుస్తారనే చర్చ జరుగుతూ వచ్చింది. మొన్నటి వరకు అరియానా సోహెల్‌లో ఎవరో ఒకరు రన్నర్ అవుతారని చెప్పుకొచ్చార. కానీ అరియానా నాల్గో స్థానంలోనే వెనక్కి తిరిగి వచ్చిందనే ప్రచారం బయటకు వచ్చింది.

నోయల్ రచ్చ..
నిన్నటి ఎపిసోడ్‌లో నోయల్ తన ర్యాప్‌తో రచ్చ చేశాడు. అభిజిత్ ప్రేమతో ఇచ్చిన బాటిల్‌ను చూసి నోయల్ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఆ బాటిల్‌ను షేర్ చేస్తూ నోయల్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. అందులో అభిజిత్ విన్నర్ అంటూ క్లియర్‌గా చెప్పేశాడు. ఇలా లీక్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

దా పార్టీ చేసుకుందాం..
అభిజిత్ ఐ లవ్యూ.. టైటిల్‌తో నిన్ను చూస్తాను.. నీకు ఆ అర్హత ఉంది.. అంతకంటే ఎక్కువ ఉంది.. నీతో గడిపిన ప్రతీ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. నిన్ను హగ్ చేసుకునేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను మై ఫ్రెండ్.. దా పార్టీ చేసుకుందాం.. హారిక రెడీయా.. డ్యాన్స్ చేయాలి.. సెలెబ్రేట్ చేసుకోవాలి.. మనమంతా మళ్లీ కలుసుకోవాలి..... లాస్య మనకు ఈ రోజు ఫుల్ గాసిప్.. అన్నీ గుర్తుకు తెచ్చుకుందాం.. సీయూ నోభికస్య.. అంటూ అసలు అభిజిత్ విన్నరని అధికారికంగా చెప్పేశాడు నోయల్.


Click it and Unblock the Notifications











