ముందే ప్లాన్ వేశాం.. అందుకే 25 లక్షలు తీసుకున్నా.. సోహెల్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షో ఫినాలే సందడి రచ్చ రచ్చగా ఉంది. టాప్ కంటెస్టెంట్లు కాకుండా, నాల్గో సీజన్ సభ్యులందరూ స్టేజ్ మీదకు వచ్చారు. డ్యాన్సులతో అదరగొట్టేశారు. టాప్ 5 కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. కంటెస్టెంట్ల తమ ఇంటి సభ్యులతో మాట్లాడారు. అంతా సందడిగా సరదాగా జరుగుతున్న క్రమంలో టాప్ 5 నుంచి మొదటి ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. ఇప్పటికే హారిక,అరియానాలు ఎలిమినేట్ అయ్యారు.

హారిక అనంతరం..
హారికను ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చేందుకు అనిల్ రావిపూడి మెహ్రీన్ లోపలికి వెళ్లారు. అలా హారిక బయటకు వచ్చాక మిగిలిన టాప్ 4 కంటెస్టెంట్లను టెంప్ట్ చేసేందుకు పది లక్షలు సూట్ కేస్‌తో ప్రణీతను లోపలికి పంపించాడు. కానీ ఎవ్వరూ కూడా ఆ డీల్‌ను ఒప్పుకోలేదు. చివరకు లక్ష్మీ రాయ్ వచ్చి అరియానాను తీసుకెళ్లింది.

టాప్ 3 కోసం డీల్..
టాప్ 3 కోసం నాగార్జున డీల్ విలువను పెంచాడు. ఈ సారి 20 లక్షలతో మభ్య పెట్టేందుకురెడీ అయ్యాడు. గోల్డెన్ కలర్ బ్రీఫ్ కేస్‌లో 20 లక్షలున్నాయని ఈ సారి డీల్‌ను ఎవరు తీసుకుంటారని నాగార్జున ఆశ పెట్టాడు. ఆ బ్రీఫ్ కేస్‌కు మూడు హ్యాండిల్స్ ఉన్నాయి. ముగ్గురు దాన్ని పట్టుకోవాలి.. చివరకు డీల్ వద్దని అనుకున్న వారు హ్యాండిల్‌ను వదిలేయండని నాగ్ తెలిపాడు.

మభ్యపెట్టేందుకు ప్రయత్నం..
అయితే 20 లక్షలతో కలలను నెరవేర్చుకోవచ్చు.. ఆలోచించండి అని నాగార్జున మభ్య పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇక్కడికి వచ్చింది ట్రోఫీ కోసం.. నాకు మనీ వద్దు అంటూ అఖిల్ డీల్‌కు అంగీకరించలేదు. ఇక చిన్న బడ్జెట్‌లో ఓ సినిమా తీసి తనది తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను అని సోహెల్ చెప్పాడు. ఈ 20 లక్షలు దానికి సరిపోతుంది కదా అంటూ సోహెల్‌కు ఆశలు కలిగించాడు.

తల్లులు ఒకే మాట..
అభిజిత్ కూడా ఆ డీల్‌ను వద్దన్నాడు. అయితే అభిజిత్ మదర్ లక్ష్మీ, అఖిల్ తల్లి దుర్గ ఇద్దరూ కూడా డీల్‌ను వద్దని తమ కొడుకులకు చెప్పారు. బిగ్ బాస్ విజేత అవ్వడమే తమ కల అని తల్లులు ధైర్యమిచ్చారు. సోహెల్ తండ్రి మాత్రం డీల్‌ను తీసుకో అని చెప్పాడు.

విలువ పెంచేశాడు...
డీల్‌ను 25 లక్షలకు పెంచేశాడు. అయితే ట్రోఫీ గెలిచిన సభ్యుడికి కూడా 25 లక్షలే వస్తాయని నాగార్జున అనడం, ఇంటి సభ్యులు కూడా తీసుకో అనిచెప్పడంతో సోహెల్ 25 లక్షల డీల్‌కు ఒప్పుకున్నాడు. అయితే అందులో పది లక్షలు అనాథలకు ఇస్తానని అంటేనే తీసుకో అని సోహెల్ తమ్ముడు కండీషన్ పెట్టాడు. 25 లక్షల్లో పది లక్షలు అనాథల కోసం ఇస్తానని మాటిచ్చాడు.
Recommended Video

ముందే అనుకున్నాం..
టాప్ 2లో ఉంటే 25 లక్షలు, 25 లక్షలు పంచుకుందామని ముందే మాట్లాడుకున్నాం.. అందుకే 20 లక్షలు అన్నప్పుడు ఒప్పుకోలేదు.. కానీ 25 లక్షలు అనేసరికి ఒప్పుకున్నాను.. ప్రేక్షకుల ఓట్లు ఏమీ వేస్ట్ కాలేదు.. వారి వల్లే ఇక్కడికి వచ్చాను.. పైగా బోనస్‌గా 25 లక్షలు వచ్చాయని సోహెల్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సోహెల్‌కు బాగానే గిట్టు బాటు అయింది.


Click it and Unblock the Notifications











