BB Telugu Grand Finale షాకింగ్ అప్‌డేట్.. హిస్టరీలోనే ఫస్ట్ టైం.. తారుమారైన ఫలితం
బిగ్ బాస్ షో అంటే ఎలా రంజుగా ఉంటుందో నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. ఎమోషన్స్, త్యాగాలు, సీటు అంచున కూర్చుండబెట్టే ఉత్కంఠ ఉండబోతోన్నట్టుంది. ఇది వరకు బిగ్ బాస్ హిస్టరీలో జరగనిది నేటి ఎపిసోడ్‌లో జరగబోతోంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం మేరకు ఫలితాలన్నీ తారుమారైనట్టు కనిపిస్తోంది. ఇంత వరకు విన్నర్ అభిజిత్ రన్నర్ సోహెల్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ జరిగిందని తెలుస్తోంది.

ఆ ఇద్దరూ అవుట్..
బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్లుగా అభిజిత్ సోహెల్ అఖిల్ అరియానా హారికలు రచ్చ చేశారు. అయితే వీరిలో మాత్రం హారిక ముందుగా బయటకు వచ్చేసింది. హారిక ఐదో స్థానంలో ఉండగా.. అరియానా నాల్గో స్థానంలో ఉండి రేసు నుంచి తప్పించుకుంది. అందరూ టాప్ 2 అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బయటకు వచ్చేసింది.

టాప్ 3కోసం బేరాలు..
అయితే హారిక అరియానాలు వెళ్లాక టాప్ 3 డబ్బుల వల వేసినట్టుంది. ప్రతీ సీజన్‌లో జరిగేట్టుగానే పది లక్షలు, పదిహేను, ఇరవై, ఇరవైదు లక్షలు అంటూ బేరాలు పెడుతుంటారు. ఎవరైనా కంటెస్టెంట్లు టెంప్ట్ అయి వాటిని తీసుకుని స్వతాహాగా బయటకు రావచ్చు. కానీ ఇంత వరకు నాలుగు సీజన్లలో ఏ ఒక్కరూ బయటకు రాలేదు.

25 లక్షలకు బేరం కుదిరింది..
అయితే సోహెల్ మాత్రం 25 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. కానీ ఇది కూడా అఖిల్ కోసం త్యాగం చేసేందుకు ఇలా చేసినట్టు తెలుస్తోంది. టాప్ 2లో ఉండాలన్నది అఖిల్ కల. దాన్ని నిజం చేసేందుకు సోహెల్ త్యాగం చేసినట్టు కనిపిస్తోంది. అలా చేసినా కూడా సోహెల్‌కు త్యాగం చేశాడన్న పేరు వచ్చేలా ఉంది.. దాంతో పాటు.. 25 లక్షల డబ్బు కూడా వచ్చినట్టుంది.

తారుమారైన ఫలితం..
అయితే సోహెల్ డబ్బు తీసుకోవడంతో చివర్లో ఫలితం తేడా కొట్టేసింది. అఖిల్ రన్నర్ అయ్యాడు. అసలు ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు. అలా అఖిల్ రన్నర్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక అభిజిత్ విన్నర్ అని ఎప్పుడో అందరికీ తెలిసిందే. ఇక ఎపిసోడ్‌లో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయన్నది చూడాలి. విన్నర్, రన్నర్ గురించి నాగార్జున, చిరంజీవి ఏం మాట్లాడుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











