నాగార్జునకు షాక్ ఇచ్చిన యాంకర్.. బిగ్‌బాస్ 10 తొలి కంటెస్టెంట్స్ ఫిక్స్!
BB Utsavam Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షోల్లో ముందువరుసలో ఉండేది బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu). ప్రతి సీజన్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలిసి జరుపుకునే ప్రత్యేక వేడుకే 'BB ఉత్సవం'. తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అందరూ మరోసారి ఒకే వేదికపై కలిసిన సందడి చేశారు. తాజాగా బీబీ ఉత్సవం సంబంధించిన ప్రోమో విడుదలవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌కు ప్రధాన యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరించగా, కో యాంకర్స్ గా ముక్కు అవినాష్, హరి లు ఉన్నారు. శ్రీముఖిస్టేజ్‌పైకి రాగానే తనదైన స్టైల్‌లో షోను ఓపెన్ చేసింది. 'ఈసారి ఆట చదరంగం కాదు... రణరంగంలా సాగింది. సత్తా ఉన్న సామాన్యులను గుర్తించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది' అంటూ బిగ్ బాస్ 9ను ఎలివేట్ చేస్తూ మాట్లాడింది. అంతేకాదు... 'ఈసారి జరిగేది ఉత్సవం మాత్రమే కాదు... బీబీ బ్లాక్‌బస్టర్ పండుగ' అంటూ హైలెట్ డైలాగ్ వేసింది.అనంతరం స్టేజ్‌పైకి సీజన్ 9 కంటెస్టెంట్స్ అందరూ వచ్చి తమ ఆటపాటలతో ప్రేక్షకులను మరోసారి ఎంటర్‌టైన్ చేశారు.

photo courtesy: Star Maa
రన్నర్‌అప్ పంచులు... రీతు ఎంట్రీతో స్టేజ్ హీటెక్కింది
శ్రీముఖి తనుజను స్టేజ్‌పైకి పిలిచి, 'నేను రన్నర్‌అప్... ఆమె కూడా రన్నర్‌అప్... ఇద్దరం కలిస్తే విన్నర్' అంటూ సెటైరికల్ పంచ్ వేసింది. ఇదే సమయంలో ఫైర్‌బ్రాండ్ కంటెస్టెంట్ రీతూ చౌదరి.. ఎంట్రీ ఇచ్చి..'రన్నర్ అంటే... బిగ్‌బాస్ ఆడియన్స్ మనసు గెలిచిన విన్నర్'అంటూ కొత్త అర్థం చెప్పింది. దీనికి శ్రీముఖి వెంటనే రియాక్ట్ అయి.. 'ఈ మాటలు ఎవరు చెప్తున్నారు వింటున్నారా... టాప్ ఫైవ్‌లోకి రీతూ చెబుతుంది!' అంటూ రీతుకు గాలి తీసేసింది. ఈ మాటలతో స్టేజ్‌పై నవ్వుల జల్లు కురిసింది.
కాంట్రవర్సీ సీన్స్ రీక్రియేషన్ - మాధురి స్కిట్ హైలైట్
బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని వివాదాస్పద ఘట్టాలను ఈ ఉత్సవంలో మళ్లీ రీక్రియేట్ చేశారు. ఇందులో దువ్వాడ మాధురి చేసిన స్కిట్ ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది. మాధురి డైలాగులకు భయపడిన ఇమ్మాన్యువల్ 'అక్క మళ్లీ వచ్చావా?' అంటూ వేసిన కామెడీ టైమింగ్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. ఇక కామనర్ ప్రియా... 'నీ అందం చూసే నాలుగో వారం నీ చుట్టూ తిరిగాను. అందుకే నాలుగో వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాను' అంటూ ఇమ్మాన్యువల్‌ను టార్గెట్ చేసింది. దీనికి అతడు కూడా తగ్గేదేలే అన్నట్లు... 'నా చుట్టూ తిరిగితే నా లేడీ ఫ్యాన్స్ వరకూ ఉంటారా?' అంటూ రివర్స్ పంచ్ వేశాడు.
రీతు లవ్ రివీల్- పవన్ స్టేజ్ ఎంట్రీ
శ్రీముఖి, రీతుతో కలిసి 'ట్రూత్ అండ్ డేర్'గేమ్ ఆడింది. రీతుకు ట్రూత్ రావడంతో...'ఎవరిని పెళ్లి చేసుకుంటావు'అని శ్రీముఖి ప్రశ్నించగా.. దానికి రీతు ఓపెన్‌గా... తన బాయ్‌ఫ్రెండ్ పేరు పవన్ ఉప్పల ( Demon Pawan)అని చెప్పింది. దీంతో అందరూ పవన్ వైపు చూసి ఈలలు వేశారు. వెంటనే పవన్ స్టేజ్‌పైకి వచ్చి రీతును ఎత్తుకుని తిప్పడం ప్రోమోలో ఎమోషనల్ హైలైట్‌గా మారింది. మరోవైపు కళ్యాణ్-తనుజ డాన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కింగ్ నాగార్జున మాస్ ఎంట్రీ
ఈ షోకు అసలైన హైలైట్... కింగ్ నాగర్జున గ్రాండ్ ఎంట్రీ. శ్రీముఖి 'ఆయన అడుగు పడకుండా... ఆయన మాట వినపడకుండా... కిక్కేముంటుంది' అంటూ నాగార్జునకు భారీ ఎలివేషన్ ఇచ్చింది. నాగార్జున మాస్ ఎంట్రీతో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ సమయంలో శ్రీముఖి నాగార్జునతో మాట్లాడుతూ ఓ గేమ్ ఆడించాలని కోరగా... ఆయన కూడా ఓకే చెప్పారు. వెంటనే ఆమె 'వీకెండ్ ఎపిసోడ్స్‌లో కంటెస్టెంట్స్ అందరికీ మీరు ఆటలాడిస్తారు కదా?'అని అడిగితే..నాగార్జున నవ్వుతూ 'ఎక్కడ... కంటెస్టెంట్లే నాతో ఆడుకున్నారు!" అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు.
'నేను సీజన్ 10 కంటెస్టెంట్'- నాగార్జునకు షాక్!
ఇక్కడే అసలు ట్విస్ట్. షో కో-యాంకర్ హరి స్టేజ్‌పైకి వచ్చి నాగార్జునను పరిచయం చేసుకుంటూ... 'నా పేరు హరి. నేను సీజన్ 10 కంటెస్టెంట్‌ని'అని చెప్పాడు. ఈ మాటతో నాగార్జున ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే 'ముందే రాసేసుకున్నావు కదా!' అంటూ సెటైర్ వేయగా... హరి సైలెంట్ అయిపోయాడు. ఇదే క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ... 'బిగ్ బాస్ 10 తొలి కంటెస్టెంట్ ఫిక్స్' అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచే బిగ్ బాస్ లవర్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. హరి చేసిన కామెంట్‌ని ఆధారంగా చేసుకుని... 'ఇదే సీజన్ 10కి తొలి క్లూ' అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











