సినిమాల్లో నటించకపోవడానికి కారణమిదే.. ఆయన వల్లే అంటూ క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ

యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి గౌరవమే. అగ్ర హీరోల నుంచి స్టార్ దర్శకుల వరకు అందరూ కూడా సుమను చాలా బాగా లైక్ చేస్తారు. సినిమా ఈవెంట్స్ లలో సుమ యాంకరింగ్ చేస్తే అదొక ధైర్యం అంటుంటారు. అయితే సుమ ఎక్కువగా సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పింది.

గత 20 ఏళ్ల నుంచి

గత 20 ఏళ్ల నుంచి

గత 20 ఏళ్ళ నుంచి యాంకర్ గా సుమకు తిరుగులేదు. మొదట దూరదర్శన్ లో యాంకర్ గా మొదలైన ఆమె ప్రయాణం నటిగా కూడా కొన్ని అడుగులు వేశారు. మొదట్లో కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. సుమ నటిగా ఎంత బిజీ అయినా కూడా ఆమెకు యాంకర్ గా అవకశాలు వస్తూనే ఉండేవి. అసలు ఈ స్థాయిలో ఇన్నేళ్ల వరకు ఉంటానని కలలో కూడా అనుకోలేదని సుమ చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.

దూరదర్శన్ తో మొదలైన ప్రయాణం

దూరదర్శన్ తో మొదలైన ప్రయాణం

ఇటీవల అరసవెల్లి ఆదిత్యుడి ఆలయానికి వెళ్లిన సుమ అక్కడ దర్శనం తరువాత మీడియాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 1991లో దూరదర్శన్ తో మొదలైన ప్రయాణం ఆ తరువాత అనేక మలుపులు తిరిగింది. మొదట్లో జెమినీ ఛానెల్ లో కూడా అనేక రకాల ప్రోగ్రామ్స్ చేసి సీరియల్స్ లో కూడా నటించడం జరిగిందని అన్నారు.

రాజీవ్ తొలిసారిగా చూసింది అప్పుడే..

రాజీవ్ తొలిసారిగా చూసింది అప్పుడే..

తాను మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు భాషను ఈజీగా నేర్చుకున్నాను అంటూ అందువల్లే యాంకర్ అనేక రకాల ఈవెంట్స్ లలో ఛాన్సులు వస్తున్నాయని చెప్పారు. ఇక రాజీవ్ కనకాల మొదటిసారి 1994 సంవత్సరంలో ఒక సీరియల్ షూటింగ్ లో తనని చూశారని సుమ వెల్లడించారు.

సినిమాలు చేయకపోవడానికి కారణం

సినిమాలు చేయకపోవడానికి కారణం

సుమ 1996లో కళ్యాణ ప్రాప్తిరస్తూ అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. అనంతరం కొన్ని సినిమాలో సైడ్ యాక్టర్ గా నటించింది. వర్షం సినిమాలో ప్రభాస్ అక్కగా కూడా కనిపించిన సుమ పెళ్లి అనంతరం సినిమాలకు చాలా వరకు దూరమయ్యింది. సినిమాల్లో ఎక్కువగా నటించడం రాజీవ్ కనకాలకు ఏ మాత్రం ఇష్టం లేదని నవ్వుకుంటూ చెప్పిన సుమ అందువల్లే హ్యాపీగా యాంకర్ గా స్థిరపడినట్లు వివరణ ఇచ్చారు.

యాంకర్ గా గురువు ఎవరంటే?

యాంకర్ గా గురువు ఎవరంటే?

సుమ ఎలాంటి ఈవెంట్స్ లలో మాట్లాడినా కూడా జనాలను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా నవ్వించడంలో సుమ తరువాతే ఎవరైనా. ఆ స్థాయిలో సెన్సాఫ్ హ్యూమర్ పెరగడానికి ముఖ్య కారణం మా అమ్మ. సరదాగా మాట్లాడే విధానం వల్లే ఒక రకంగా నేను కూడా ఇలా ఉన్నాను అంటూ.. అమ్మనే నా గురువు అని సుమ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X