పెళ్లి పీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్? కాబోయే భార్య బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటి వరకు బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోలు, హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు సుదీర్ఘకాలంగా సాగుతున్న ప్రేమాయణానికి చెక్ పెట్టి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మార్చి 6వ తేదీన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్- నయనిక రెడ్డిల వివాహం జరగనుంది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరో పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడట. ఈ వివరాల్లోకి వెళితే..

గ్రాండ్‌గా సాయి శ్రీనివాస్ ఎంట్రీ
ఆ యువ హీరో ఎవరో కాదు.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఈజీగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సాయి. స్టార్ హీరో రేంజ్‌లో భారీగా ఇతని లాంచ్ జరిగింది. ఏకంగా వీవీ వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్‌ ఇతనిని చిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేశాడు. అదే అల్లుడు శీను. తొలి సినిమాకే సమంత వంటి స్టార్ హీరోయిన్‌ ఇతని పక్కన జోడీగా నటించడం విశేషం. అలాగే మిల్కీబ్యూటీ తమన్నా భాటియా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అల్లుడు శీనుకు మంచి ఓపెనింగ్స్‌తో పాటు కలెక్షన్స్ వచ్చాయి.

Bellamkonda Sai Sreenivas to Tie the Knot Soon Reports Suggest Wedding with Kavya Reddy

ఛత్రపతితో హిందీలో ఎంట్రీ
ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, భైరవం సినిమాలలో నటించాడు సాయి శ్రీనివాస్. ఎస్ఎస్ రాజమౌళి - ప్రభాస్‌ల బ్లాక్‌బస్టర్ మూవీ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత హార్రర్ మూవీ కిష్కింధపురి సినిమా చేసినా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమాలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నారు. హీరోకి తగ్గ పర్ఫెక్ట్ మెటీరియల్ అనిపించుకున్నప్పటికీ ఈ కుర్రాడికి ఇప్పటి వరకు సరైన హిట్ దొరకలేదు. అయినప్పటికీ పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

త్వరలో పెళ్లికొడుకు కానున్న శ్రీనివాస్
అందరు హీరోల మాదిరిగానే బెల్లంకొండపైనా పలు రూమర్స్ వచ్చాయి. పలువురు హీరోయిన్లతో శ్రీనివాస్ డేటింగ్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బెల్లంకొండది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? ఇంతకీ కాబోయే భార్య ఎవరు? అనేది మాత్రం తెలియరాలేదు.

బెల్లంకొండ కాబోయే భార్య ఎవరంటే?
ఇక ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కాబోయే భార్య పేరు కావ్య రెడ్డిగా తెలుస్తోంది. ఆమెకు సినీరంగంతో ఎలాంటి సంబంధం లేదని .. ఆమె కుటుంబం న్యాయవాద రంగానికి చెందినదిగా వార్తలు వస్తున్నాయి. కావ్య కుటుంబానిది హైదరాబాదేనని, ఆమె తండ్రి లాయర్ కాగా.. తాతగారు జడ్జిగా సేవలు అందిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. శ్రీనివాస్‌- కావ్యలకు ముందు నుంచి పరిచయం ఉందట. ఈ పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారట. మార్చి 8న హైదరాబాద్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్- కావ్య రెడ్డిలకు ఎంగేజ్‌మెంట్ జరగనుందట. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలు, అత్యంత సన్నహితులు మాత్రమే హాజరుకానున్నరట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X