గతం మరిచిపోయి.. రోడ్డుపై చిత్తు కాగితాలు ఏరుకుంటూ.. దయనీయంగా హీరోయిన్ జీవితం
జీవితంలో ఎంతో గొప్పగా బతికిన నటీనటులు చివరి రోజుల్లో అత్యంత దయనీయ స్థితిలో జీవిస్తూ ప్రాణాలను వదిలేస్తున్నారు. తెరపై నుంచి అర్ధాంతరంగా మాయమై రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటూ, ఇళ్లలో పనిమనిషిగా, చివరికి బిచ్చమెత్తుకుంటూ బతుకుతున్నారు. ఎందరో నటీనటుల దుర్భర జీవితాన్ని మీడియా పలుమార్లు బయటకు తీసుకొస్తూనే ఉంది. మనసున్న దాతలు కొందరు స్పందించి వారిని ఆదుకుంటున్న ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ బుల్లితెర నటి దయనీయ స్థితిలో మీడియా కంటపడింది.
వాచ్‌మెన్‌గా బతుకుతున్న స్టార్
సినిమాలలో స్టార్స్‌తో సమానంగా నటించిన సావి సంధు అనే నటుడు పొట్టకూటి కోసం ముంబై మహానగరంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఘటన కొద్దిరోజుల క్రితం బయటికొచ్చి వైరల్ అయ్యింది. లా చదివిన అతను, సినిమాలపై ప్యాషన్‌తో నటనపైపు వచ్చారు. చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ ఆ తర్వాత విలన్‌గానూ మెప్పించారు. హీరోలను మించి స్టైలీష్‌గా కనిపిస్తూ ఓ వెలుగు వెలిగిన సంధు.. వాచ్‌మెన్ డ్రెస్‌లో బక్కచిక్కిపోయి కనిపించడం ఆయన అభిమానులను, సినీ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసింది.

భిక్షాటన చేస్తోన్న పాకీజా
ఇక రీసెంట్‌గా కమెడియన్ పాకీజా దుస్థితి గురించి మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 90వ దశకంలో తెలుగు, తమిళ తదితర భాషల్లో స్టార్ కమెడియన్లతో పోటీపడి నటించి నవ్వించిన పాకీజాను వృద్ధాప్యంలో పట్టించుకునేవారు కరువయ్యారు. చిన్నా చితకా పాత్రలు పోషిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తూ.. చికిత్స డబ్బులు లేక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. పాచి పనిచేస్తానన్నా ఇచ్చేవాళ్లు లేరని పాకీజా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ బతికిన ఆమె గురించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసుకుని పాకీజాకు ఆర్ధిక సాయం చేశారు.
మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై పిచ్చిదానిలా
తాజాగా వెండితెర, బుల్లితెరపై ఓ వెలిగిన సుమి హర్ చౌదరి అనే బెంగాలీ నటిపై ఒంటరిగా నడుచుకుంటూ కాగితాలు ఏరుకుంటూ దయనీయ స్థితిలో కనిపించారు. ద్వితియో పురుష్, కాశీ కథ: ఎ గోట్ సాగా వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ సుమి గత కొన్నేళ్లుగా నటనకు దూరమయ్యారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని పర్ప బార్దమాన్ జిల్లా అమిలా బజార్ ఒంటరిగా కనిపించిన వీడియోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ చోట ఆగి రోడ్డు పక్కన చిత్తు కాగితంపై కూర్చోని ఏదో రాసుకుంటుండటంతో తొలుత స్థానికులు ఆమెకు మతిస్థిమితం లేని మహిళ అని భావించారు.
ఆ నటి గురించి తెలిసి షాక్‌లో చిత్ర సీమ
ఎవరా అని ఆరా తీయగా తనలో తానే బెంగాలీ, ఇంగ్లీష్‌లలో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. తన పేరు సుమి హర్ చౌదరి అని నటిని అని చెప్పడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. తొలుత ఆమె మాటలు పట్టించుకోని స్థానికులు, ఇంటర్నెట్‌లో ఆ పేరుతో వెతకగా సుమి హర్ చౌదరి అని నటి అని తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సుమి హర్ చౌదరిని ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వ్యవహారం బెంగాలీ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











