నా నడుము చుట్టు చేయి వేసి.. ఆ దర్శకుడు అలా వేధించాడు.. బండారం బయటపెట్టిన టీవీ నటి

ప్రపంచాన్ని కుదిపేసిన మీటూ ఉద్యమం తాజాగా బెంగాలీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నది. బెంగాలీలో పాపులర్ టెలివిజన్ యాక్టర్ రూపాంజన మిత్రా ప్రముఖ దర్శకుడు ఆరిందమ్ సిల్‌పై లైంగిక వేధింపులు చేయడం సంచలనం రేపుతున్నది. ఆనంద్ బజార్ డిజిటల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనతో దర్శకుడు ఏ విధంగా ప్రవర్తించారనే విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం రూపాంజనా చేసిన ఆరోపణలు బెంగాలీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. రూపాంజన చేసిన వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

నాలో ఒకరకమైన భయం

నాలో ఒకరకమైన భయం

గతేడాది దుర్గాపూజ జరిగిన కొద్ది రోజుల తర్వాత భూమికన్య అనే సీరియల్‌కు సంబంధించిన స్క్రిప్టును చదవాలని నన్ను పిలిచాడు. ఆ రోజు నేను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆఫీస్‌లోకి ప్రవేశించగానే ఎవరూ లేరు. దాంతో నాలో ఓ రకమైన భయం మొదలైంది. నన్ను చూడగానే నవ్వుతూ తన సీట్లో నుంచి లేచి వచ్చి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పటికే నాలో కంగారు మొదలైంది. ఏదో జరగకూడనిది జరుగుతుందనే భయం మరింత పెరిగింది అని ఇంటర్వ్యూలో రుపాంజన వెల్లడించారు.

రేప్ చేస్తారేమోననే

రేప్ చేస్తారేమోననే

గదిలో మేమిద్దరం ఉండటంతో ఆయన ఇంటెన్షన్ అర్ధమైంది. ఆ లోపే ఆరిందమ్ నా వద్దకు వచ్చి నా తలపై చేయివేసి.. నా నడుము చుట్టు పట్టుకొన్నాడు. దాంతో నాపై రేప్ జరగబోతుందనే భయం నాకు మరింత కంగారు పుట్టించింది. ఎవరైనా గదిలోకి వస్తే బాగుండు అనిపించింది. అంతలోనే తేరుకొని వదిలించుకొన్నాను. స్క్రిప్టు గురించి మాట్లాడాలనుకొంటే మాట్లాడు. లేకపోతే వెళ్లిపోతాను అని చెప్పాను. ఓ దశలో నా స్వరాన్ని కూడా పెంచాను అని రూపాంజన తెలిపింది.

ఏం చేయలేక గుక్కపట్టి

ఏం చేయలేక గుక్కపట్టి

ఇక ఆరిందమ్ సిల్ కాస్త తేరుకొని.. తాను అలాంటి అమ్మాయి కాదనే విషయాన్ని గ్రహించారు. నాపై అలాంటి ట్రిక్కులు పారవు అనే విషయాన్ని తెలుసుకొన్నాడు. వెంటనే డైరెక్టర్‌గా స్క్రిప్టు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలకే ఆయన భార్య గదిలోకి వచ్చింది. వెంటనే నేను బయటకు వచ్చి గుక్కపట్టి ఏడ్చాను. నాకు వారితో కాంట్రాక్టు ఒప్పందం ఉండటం వల్ల నేను ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయాను. నా ప్రతిష్టకు భంగం కలుగుతుందని నేను బయటకు చెప్పలేదు అని రూపాంజన అన్నారు.

Recommended Video

టీవీ నటి ఆత్మహత్య : సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు !
ఖండించిన ప్రముఖ దర్శకుడు

ఖండించిన ప్రముఖ దర్శకుడు

అయితే టెలివిజన్ నటి రూపాంజన మిత్రా చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను దర్శకుడు ఆరిందమ్ సిల్ ఖండించారు. బహుశా రూపాంజన ఆరోపణలు పొలిటికల్ స్టంట్ కావచ్చు. ఆమె నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో తెలియదు. మా మధ్య మంచి స్నేహం ఉంది. ఆ రోజు నా ఆఫీస్‌ నుంచి వెళ్లేటప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఉందని చెప్పింది. ఆమె చేసిన మెసేజ్ ఇప్పటికీ నా వద్ద ఉంది. కావాలంటే చూపిస్తాను. ఒకవేళ నేను తప్పుగా బిహేవ్ చేస్తే నాకు అలా మెసేజ్ ఎందుకు చేస్తుంది అని ఆరిందమ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X