హాట్‌ సీన్లలో జీవించిన హీరో, హీరోయిన్లు.. కంగుతిన్న భార్య.. తొలగించాలని ఫిర్యాదు..

ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్తె, ఏఎల్‌టీ బాలాజీ ఫిలింస్ చీఫ్ ఏక్తా కపూర్ టెలివిజన్‌ సీరియల్ తీసినా గానీ, సినిమా తీసినా గానీ సంచలనం రేపడం సహజం. తాజాగా నేటి యువత అభిరుచికి తగినట్టు బేవఫా సీ వఫా అనే వెబ్

By Rajababu

ప్రముఖ నటుడు జితేంద్ర కుమార్తె, ఏఎల్‌టీ బాలాజీ ఫిలింస్ చీఫ్ ఏక్తా కపూర్ టెలివిజన్‌ సీరియల్ తీసినా గానీ, సినిమా తీసినా గానీ సంచలనం రేపడం సహజం. గతంలో ఆమె తీసిన సీరియల్ 'క్యోంకీ సాస్ బీ బహూ థీ' దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇక వెండితెరపై ఆమె తీసిన రాగిణి ఎంఎంఎస్, డర్టీ పిక్చర్ చిత్రానికి అనూహ్య స్పందన లభించడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిసింది. తాజాగా నేటి యువత అభిరుచికి తగినట్టు బేవఫా సీ వఫా అనే వెబ్ సీరియల్‌ను ప్రారంభించింది. ఈ సీరియల్‌లో సన్నివేశాలు హాట్‌హాట్‌గా నెటిజన్లను ఆకట్టుకొంటున్నాయి.

 ఆ తర్వాత జీవిత భాగస్వామి లభిస్తే..

ఆ తర్వాత జీవిత భాగస్వామి లభిస్తే..

ఇటీవల బేవఫా సీ వఫా వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను ముంబైలో ప్రదర్శించారు. ఆ తర్వాత తమ అధికారిక వెబ్‌సైట్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోతోపాటు ‘వారిద్దరూ లవర్స్, వారు పెళ్లి చేసుకొన్నారు. కానీ వేర్వేరు వ్యక్తులును. నీ ప్రియుడితో కొంతకాలం జీవితాన్ని పంచుకొన్న తర్వాత నీకు నీ జీవిత భాగస్వామి లభిస్తే‘ అంటూ చేసిన ఓ పోస్ట్‌పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వివాహేతర సంబంధాలతో..

వివాహేతర సంబంధాలతో..

వివాహేతర సంబంధాల నేపథ్యంగా ఈ సిరియల్ సాగుతుంది. ఈ సీరియల్‌లో సమీర్ సోని, దిపన్నిత శర్మ, వీజే యుదీ, అదితి వాసుదేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమీర్ సోని, దిపన్నిత శర్మ మధ్య షూట్ చేసిన శృంగార సన్నివేశాలు మోతాదు మించి ఉన్నాయనే మాట వినిపిస్తున్నది.

కంగుతున్న భార్య.. నిర్మాతకు ఫిర్యాదు

కంగుతున్న భార్య.. నిర్మాతకు ఫిర్యాదు

ఈ సీరియల్ దిపన్నిత శర్మతో చేసిన సన్నివేశాలు చూసి సమీర్ సోని భార్య నీలం కొఠారీ కంగుతిన్నదట. సమీర్ ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తాడని అనుకోలేదని నీలం వాపోయిందట. గతంలో నీలం పలు బాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. గోవిందాతోనే దాదాపు 14 చిత్రాల్లో నటించింది. గోవిందాతో కలిసి నటించిన లవ్ 86, ఖుద్‌గర్జ్, హత్య, తాకత్‌వార్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇంకా పలువురు హీరోలతో కూడా ఆమె నటించింది.

భర్తతో గొడవ పెట్టేసుకున్నదనేది..

భర్తతో గొడవ పెట్టేసుకున్నదనేది..

మితీమీరిన శృంగార సీన్లలో భర్త సోనిని చూసి భర్తతో గొడవ పెట్టేసుకున్నదనేది సమాచారం. హాట్ హాట్ సీన్లను తొలగించాలని నిర్మాత ఏక్తాకపూర్‌కు సమీర్ భార్య సూచించిందట. అంతేకాకుండా కొన్ని సీన్లను తొలగించాలని కోరిందట. అందుకు ఏక్తా కపూర్ సాధ్యపడదని తెగేసి చెప్పిందట. ప్రస్తుతం ఏఎల్‌టీ బాలాజీ యాప్‌లో ఈ టీజర్ ఉంది.

ఇప్పుడు కుదరదని నిర్మాత స్పష్టీకరణ

ఇప్పుడు కుదరదని నిర్మాత స్పష్టీకరణ

ఇలాంటి సీరియల్‌లో నటించే ముందే చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. అంతా జరిగిపోయాక సీన్లు తీసివేయడం కుదరదు అని ఏక్తా కపూర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు వస్తున్న స్పందన చూసి డిజిటల్ స్పేస్‌ను మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవాలని ఏక్తా కపూర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

డిజిటల్ మీడియాలోకి ఏక్తా కపూర్

డిజిటల్ మీడియాలోకి ఏక్తా కపూర్

టెలివిజన్, సినీ రంగాల నిర్మాణంలో తనదైన ముద్ర వేసుకొన్న ఏక్తా కపూర్ ఇక డిజిటల్ మీడియాపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. కర్లే తు భీ మొహబ్బత్, ది టెస్ట్ కేస్, వన్స్ ఆఫాన్ ఏ నైట్, దేవ్ డీడీ, బాయ్ గిరి లాంటి సీరియల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం కొత్తగా ఓ యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X