బిగ్ హౌస్‌లోకి 'బెజవాడ బేబక్క'.. ఇక రచ్చ రచ్చే!
Bezawada Bebakka Biography: బెజవాడ బేబక్క అంటే తెలియని తెలుగు ప్రజలు లేరు. యూట్యూబ్ సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈమె నటిగా, సింగర్‌గా, కమెడియన్‌గా, మిమిక్రీ కళాకారిణిగా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఈమెది ఆంధ్రప్రదేశ్. విజయవాడకు చెందిన వ్యక్తి. కానీ పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. సేరేవిల్లే, న్యూ జెర్సీ, యునైటెడ్ స్టేట్స్ లోనే తన చదువు కంప్లీట్ చేశారు. ప్రస్తుతం బేబక్క అమెరికాలోనే నివాసం ఉంటున్నారు. ఆరు నెలల కిందటే ఇండియాకు వచ్చారు. చిత్తూరు స్లాగ్‌లో మాట్లాడుతూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే బెజవాడ బేబక్క అసలు పేరు 'మధూ సింగర్ నెక్కంటి'.
సినిమాల విషయానికొస్తే..
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకున్న బేబక్క యూఎస్‌లోనే పుట్టి పెరిగారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చి.. ప్రముఖ నటిగా స్థిరపడ్డారు. మీలో ఎవరు కోటీశ్వరుడు, 24 కిస్సెస్, ఎబీసీడీ, వంటి చిత్రాల్లో నటించారు. అత్యంత గుర్తింపు పొందిన జీ5 అనే వెబ్ సిరీస్‌లో శ్రీకాంత్ భార్యగా నటించి ప్రేక్షకుల విమర్శల అందుకున్న వారి దగ్గర నుంచే ప్రశంసలు పొందారు. 2021 లో విడుదలైన 'అందరు బాగుండాలి అందులో నేనుండాలి' అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంబంధాలు..
మారుతి దర్శకత్వం వహించిన చిత్రంలో నటించారు. జూన్ 21, 2024న థియేట్రికల్‌గా విడుదలైన ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ లో మెరిచింది. ఇందులో సంతోష్ శోబన్ కథానాయకుడిగా నటించాడు. ఇలా అనేక సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది బెజవాడ బేబక్క. సినీ పరిశ్రమలో బేబక్కకు సంబంధాలు ఉన్నాయని, టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాఘవేంద్రరావు వారికి రిలేషన్స్ అవుతారని స్వయంగా ఈమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్..
కరోనా సమయంలో బెజవాడ బేబక్క యూట్యూబ్ వీడియోలు, రీల్స్‌తో అభిమానుల్ని తెగ ఆకట్టుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 164k ఫాలోవర్స్ ఉండటం విశేషం. ప్రజెంట్ యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది బెడవాడ బేబక్క. ఇక బేబక్క ఈ రోజు నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 లో పాల్గొన్నారు. ఇక హౌజ్ లో చలాకీ మాటలు, చిత్తూరు స్లాగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని అలరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలోని జనాల్ని కుదురుగా ఉండనివ్వడం లేదు.


Click it and Unblock the Notifications











