Bigg Boss Elimination: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లీక్.. షో నుంచి ఊహించని కంటెస్టెంట్ ఔట్
గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కాన్సెప్టుతో నడిచే షోనే అయినా.. ఊహించని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను లాగేసుకున్న ఏకైక షోనే బిగ్ బాస్. అదే ఇంప్రెషన్‌ను కంటిన్యూ చేస్తూ నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను నడుపుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఇది రేటింగ్‌ను భారీగా రాబడుతోంది. ఫలితంగా ఇప్పుడు ఎనిమిదో దానిని నడుపుతున్నారు. ఇక, ఇందులో మొదటి వారంలో ఎలిమినేట్ అయింది ఎవరో అన్నది మీరు కూడా తెలుసుకోండి మరి!
మరింత కొత్తగా ఎనిమిదోది
ఇండియాలో బిగ్ బాస్ చాలా భాషల్లో వస్తుంది. కానీ, తెలుగులో మాత్రమే భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా భారీ అంచనాలతో ప్రారంభం అయింది. ఇందులో ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా గత సీజన్ల కంటే భిన్నమైన ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. దీంతో ఇది ఆరంభంలోనే మంచి పేరు రాబట్టేసింది.

షోలోకి వచ్చిన 14 మంది
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ భారీ అంచనాలతో మొదలైంది. ఇందులోకి ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరితో పాటు మరికొందరు కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
తొలి వారంలో ఆరుగురు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మొదటి వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఎప్పటిలాగానే ఎన్నో గొడవలతోనే సాగింది. ముఖ్యంగా కొందరు వ్యక్తిగతంగా దూషణలు చేసుకున్నారు. ఇక, ఇందులో మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ అయిపోయారు. వారిలో విష్ణుప్రియ, సోనియా, బేబక్క, మణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ బాషాలు నామినేషన్ జోన్‌లోకి ఎంటర్ అయ్యారు.
చిత్ర విచిత్రంగా ఓటింగ్
మొదటి వారానికి గానూ జరిగిన ఓటింగ్ ప్రక్రియ అంతా చిత్ర విచిత్రంగా సాగింది. మొదటి రెండు స్థానాల్లో విష్ణుప్రియ, నాగ మణికంఠ ఉండగా.. మిగిలిన అన్ని స్థానాల్లో ఆయా కంటెస్టెంట్ల ఆటను బట్టి మార్పులు వచ్చాయని తెలిసింది. ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లు కూడా తక్కువ ఓటింగ్‌నే పొందారు. దీంతో ఎలిమినేషన్‌పై చాలా ఆసక్తి ఏర్పడింది.
లీకైన ఫస్ట్ ఎలిమినేషన్
వాస్తవానికి బిగ్ బాస్ షోకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా రహస్యంగా జరిగే వ్యవహారమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా ఇది ఒకరోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవడంతో సమాచారం మొత్తం లీక్ అవుతోంది. ఇక, 8వ సీజన్ మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది.


Click it and Unblock the Notifications











