Bhagavanth Kesari: రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య.. టాప్ 2 మూవీ భగవంత్ కేసరి
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న ఏకైక హీరోనే నటసింహా నందమూరి బాలకృష్ణ. తన రేంజ్‌కు ఏమాత్రం తీసిపోని కథలతో సినిమాలు చేస్తోన్న ఆయన.. సత్ఫలితాలను అందుకుంటున్నారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మూవీలు చేస్తున్నారు. ఇలా గత ఏడాది చివర్లో 'భగవంత్ కేసరి' అనే సినిమాతో వచ్చారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే 'భగవంత్ కేసరి'. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ముందు నుంచీ అనుకుంటున్నట్లే ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో వచ్చి వసూళ్లు కూడా బాగా లభించాయి.

నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాలను కూడా బాగానే రాబట్టుకుంది. ఈ విజయంతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ కూడా నమోదు అయింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అయింది. అందులో కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.
థియేటర్లు, ఓటీటీలో చాలా రోజుల పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీ.. ఇటీవలే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే అదిరిపోయే స్పందనను అందుకుని సత్తా చాటుకుంది.

'భగవంత్ కేసరి' సినిమాకు అర్బన్ ఏరియాలో 9.36 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 7.56 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు, బాలయ్య గత చిత్రం 'వీర సింహా రెడ్డి' రికార్డును (8.83)ను ఇది బ్రేక్ చేసి టాప్ 2గా నిలిచింది. అయితే, 'అఖండ' రేటింగ్ (13.31) మాత్రం చాలా దూరంలో నిలిచిపోయింది.
ఇదిలా ఉండగా.. బాలయ్య కెరీర్‌లోనే విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'భగవంత్ కేసరి' సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











