నిజా నిజాలు నాగార్జునకే ఎరుక

By Srikanya

హైదరాబాద్: ఆయన మాటీవి ఛానెల్ కి యజమాని. అయితే ఆయన సినిమాలకు బిజినెస్ మాత్రం జీ,జెమినీ ఛానెల్ చేస్తూంటాయి. ఆయన ఎవరూ అంటే నాగార్జున. నాగార్జున నటించిన చిత్రాలు భాయ్ ...శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వారు సొంతం చేసుకుంటే, ఇప్పుడు మనం శాటిలైట్ రైట్స్ ని జెమినీ వారు తీసుకున్నారు. అయితే మా టీవి మాత్రం ఎందుకు ఆ శాటిలైట్ రైట్స్ ఎందుకు ఇవ్వలేదని అంతటా చర్చించుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం...తమ్ముడు తమ్ముడే...పేకాట పేకాట అన్నట్లు ఎవరు తన సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఎక్కువ ఆఫర్ చేస్తే వారికే ఇవ్వటం జరిగింది. మా టీవీ కన్నా ఆ ఛానెల్ వారే ఎక్కువ ఆఫర్ చేసారు కాబట్టి వారికే ఇచ్చేసారు అని అంటున్నారు. అయితే నిజానిజాలేమిటి అన్నది నాగార్జున మాత్రమే తేల్చి చెప్పాలి.

ఇక ప్రస్తుతం నాగార్జున బుల్లితెరపై మెరస్తున్నారు. 28 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో ద్వారా డ్రాయింగ్ రూమ్‌లో వీక్షకులను పలకరిస్తున్నారు. జూన్ మొదటివారం నుంచి 'మా' టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఇప్పటికే విజయవంతమైన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఫార్ములాతోనే ఈ గేమ్ షో రూపొందింది.

'Bhai' to Zee TV and now 'Manam' rights to Gemini

మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో పాల్గొనే అవకాశం అందరికీ కలిపిస్తున్నారు. హాట్ సీన్ చేరుకొని తమ అభిమాన హీరో నాగార్జునతో ఆడాలనుకున్నవారు మాటీవీలో ప్రసారమవుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పంపి రిజిష్టర్ చేసుకోవచ్చు. ప్రసారమైన ఏడు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానం ఎస్‌ఎంఎస్ చేసినా హాట్ చేరుకొనే అవకాశం దక్కవచ్చు. అంతేకాదు జీవితాన్ని మార్చేసే కోటి రూపాయల బహుమతిని కూడా అందుకోవచ్చు.

మాటీవీ ఈ పోటీని అత్యంత విశ్వసనీయమైన పద్ధతుల్లో నిర్వహిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఈ షో సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. బిగ్ సినర్జీ ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. కోటి రూపాయల బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది. కోటి రూపాయలు గెలుచుకోవాలన్న కలని ఎవరైనా నిజం చేసుకోవచ్చునే ఆలోచనతో ఆరంభమైంది 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.

ఈ షోని మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నాలెడ్జ్ షో అత్యంత ఆసక్తికరంగా సాగుతూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు విలక్షణమైన వినూత్నమైన వినోదాన్ని అందించబోతోంది. జీవితం సంధించే వంద ప్రశ్నలకు ఒకటే జవాబు- అదే, మీలో ఎవరు కోటీశ్వరుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X