Bhaje Vaayu Vegam Box Office స్టడీగా భజే వాయు వేగం.. కార్తీకేయ మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన భజే వాయు వేగం సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చితో రెండో రోజు మూడో రోజు వసూళ్లు పెరిగాయి. భజే వాయు వేగం థియేటర్స్ లో ఆడియెన్స్ సందడి కనిపిస్తోంది. మంచి డ్రామా, ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. గత వారం రిలీజైన చిత్రాల్లో ఈ చిత్రం అత్యధికంగా కలెక్షన్లను సాధిస్తున్నది.
ఇప్పుడున్న కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ వీక్ భజే వాయు వేగం సినిమాకు అంచనాలను మించిన కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
ఇదిలా ఉండగా, గత నాలుగు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 60 లక్షలకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా రెండో రోజు అంతకంటే ఎక్కువ అంటే.. 65 లక్షలు వసూళ్లను సాధించింది.
మూడో రోజు హాలీడే కావడంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల కలెక్షన్లను రాబట్టింది. ఇక నాలుగు రోజు వర్కింగ్ డే రోజున కూడా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఈ చిత్రం 50 లక్షల గ్రాస్ వసూళ్లను 4వ రోజున కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











