దీప్తి సునైనా, తనీష్ మధ్య ఏదో జరుగుతోంది, ఆ పిల్లని హెచ్చరించా.. అక్కడ చేయి పెట్టాడు!

ప్రతివారం ఓ కీలకమైన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుండడంతో బిగ్ బాస్ 2 షో రసవత్తరంగా మారుతోంది. హౌస్ నుంచి భానుశ్రీ ఎలిమినేట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. భానుశ్రీ చేసిన తప్పిదమే ఆమె పాలిట శాపంగా మారిందనే చర్చ ఆడియన్స్ లో జరుగుతోంది. హౌస్ నుంచి బయటకు వచ్చాక భానుశ్రీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. కౌశల్ తో జరిగిన గొడవ, హౌస్ లో ఇతర సభ్యుల గురించి పలు ఆసక్తి విషయాలు వెల్లడించింది.

బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేందంతా

బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేందంతా

బిగ్ బాస్ షో లో జరుగుతున్నది మొత్తం నిజమే అని భానుశ్రీ తేల్చింది. బిగ్ బాస్ అనేది రియాలిటీ గేమ్ షో. అందరూ నిజాయతీగా ఈ గేమ్ ఆడుతున్నారా లేక నటిస్తున్నారా అనేది ఎవరికీ వారిని అడిగే తెలుసుకోవాలి. తాను మాత్రం నిజాయతీగా ఆడానని భానుశ్రీ తెలిపింది.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Elimination Process Get Leaked
ఎంజాయ్ చేశా

ఎంజాయ్ చేశా

హౌస్ లో ఉన్నన్ని రోజులు తాను బాహ్య ప్రపంచాన్ని మిస్ అయ్యాననే ఫీలింగ్ రాలేదని భానుశ్రీ తెలిపింది. ఉన్నన్ని రోజులు ఏజాయ్ చేస్తూ గడిపానని పేర్కొంది. బయటకు వచ్చాక నాపై నెగిటివ్ ఫీలింగ్ ఆడియన్స్ లో ఉందని తెలిసి క్లారిటీ ఇవ్వాలనిపిస్తోందని తెలిపింది.

రెండు రోజులు నిద్ర లేదు

రెండు రోజులు నిద్ర లేదు

కౌశల్ తో జరిగిన గొడవ విషయంలో భానుశ్రీ క్లారిటీ ఇచ్చింది. ఆ సమయంలో ట్యాంకు రెండు రోజుల నుంచి సరిగా నిద్ర లేదని, టాస్క్ జరిగే రోజు కూడా తాను ఉపవాసంతో ఉన్నానని భానుశ్రీ తెలిపింది.

అక్కడ చేయి పెట్టాడు

అక్కడ చేయి పెట్టాడు

కౌశల్ తాకకూడని చోట తాకాడు. అతడి చేయి పొరపాటుగా తగిలి ఉండవచ్చు. కానీ ఒక అమ్మాయిగా నాకు వెంటనే కోపం వచ్చింది. అందుకే వెంటనే తిట్టేశా అని భాను శ్రీ తెలిపింది. మొదట గీత చేయి తగిలిందని అనుకున్నా. వెంటనే కౌశల్ తిరిగి వెళుతుంటే నాకు అర్థం అయిందని భానుశ్రీ తెలిపింది.

చేసిన తప్పు అదే

చేసిన తప్పు అదే

ఇన్ని రోజులు ఎలాంటి పొరపాటు లేకుండా హౌస్ లో ఉన్నానని, కానీ ఈ ఒక్క పొరపాటు వలన తనని అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని భానుశ్రీ తెలిపింది. కౌశల్ తో అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, పక్కకు తీసుకుని వెళ్లి నెమ్మదిగా మాట్లాడివుంటే బావుండేది అని భానుశ్రీ అభిప్రాయ పడింది.

అక్కడొక మాట ఇక్కడొక మాట

అక్కడొక మాట ఇక్కడొక మాట

బాబు గోగినేని గురించి మాట్లాడుతూ ఆయన ప్రత్యకమైన శైలి ఉన్న వ్యక్తి అని భానుశ్రీ తెలిపింది. ఏ ఇద్దరికైనా గొడవ జరిగితే ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర మరో మాట మాట్లాడతారని తెలిపింది.

ఆ పిల్లకు వార్నింగ్ ఇచ్చా

ఆ పిల్లకు వార్నింగ్ ఇచ్చా

దీప్తి సునైనా, తనీష్ మధ్య జరుగుతున్న వ్యవహారం గురించి భానుశ్రీ స్పందించింది. వారి మధ్య జరుగుతున్న వ్యవహారం హౌస్ లో ఉన్నపుడే తన దృష్టికి వచ్చిందని భానుశ్రీ తెలిపింది. ఆ సమయంలో దీప్తి సునైనాని తాను హెచ్చిరించినట్లు భాను పేర్కొంది.

ఎప్పుడూ తనీష్ తోనే

ఎప్పుడూ తనీష్ తోనే


నీవు ఎప్పుడూ తనీష్ తో తిరుగుతుండడం వలన అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అదీకాక నీకు గేమ్ సొంతంగా ఆడే అవకాశం రావడం లేదు..నీ అంతట నీవు గేమ్ ఆడదానికి ప్రయత్నించు అని దీప్తి సునైనకు వార్నింగ్ ఇచ్చా అని భాను పేర్కొంది.

బ్రదర్ అని చూడు

బ్రదర్ అని చూడు

ఆ సమయంలో దీప్తి సునైనా ఆసక్తికరంగా నాకు జవాబు ఇచ్చింది. నీకు అంతగా అనుమానం ఉంటె తనీష్ వద్దకు వెళ్లి ' ఏంటి బ్రదర్ మన సిస్టర్ దీప్తిని బాగా చూసుకుతున్నావుగా' అనిచూడు అంటూ బదులిచ్చింది. బ్రదర్ అని పిలిచినంత మాత్రాన రిలేషన్స్ మారిపోవు అని తాను దీప్తితో అన్నట్లు భానుశ్రీ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X