అదంటే పిచ్చి, అగ్రిమెంట్ వల్లే ఔట్, కౌశల్ నో రియాక్షన్: బిగ్‌బాస్ భానుశ్రీ
Recommended Video

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొన్న భానుశ్రీ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాషోలో ఆమె మధ్యలోనే ఎలిమినేట్ కావడంతో చాలా మంది నిరాశ పడ్డారు. అయితే ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత భానుశ్రీ 'ఢీ జోడి'కి కమిట్మెంట్ ఇవ్వడం అభిమానుల్లో సైతం ఆనందాన్ని నింపింది.
అయితే ఉన్నట్టుండి భానుశ్రీ 'ఢీ జోడి' షో నుంచి వెళ్లిపోయారు. ఆమె ఎందుకు ఈ షో నుంచి వెళ్లిపోయారు? అనే విషయంలో క్లారిటీ లేక పోవడంతో అభిమానులు సైతం ఖంగుతిన్నారు. తాజాగా ఆమె ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

బిగ్‌బాస్ అగ్రిమెంటు వల్లే బయటకు...
‘ఢీ జోడి' నుంచి నేను బయటకు రావడానికి కారణం బిగ్‌బాస్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ 6 నెలల పాటు ఉంది. 3 నెలలు బిగ్‌బాస్ షో కోసం.... షో అయిపోయిన తర్వాత మిగతా 3 నెలలు స్టార్ మాలోనే మేము వర్క్ చేయాలి... అని భానుశ్రీ తెలిపారు.

నాకు తెలియక ఒప్పుకున్నాను
ఆ విషయం తెలియక నేను ‘ఢీ జోడి' ఒప్పుకోవడం జరిగింది. వెంటనే నాకు ‘స్టార్ మా' నుంచి ఫోన్ వచ్చింది. అగ్రిమెంట్ ప్రకారం ఇతర ఛానల్స్‌లో చేయడానికి కుదరదు అని చెప్పారు. దీంతో బయటకు రాక తప్పలేదు అని భానుశ్రీ స్పష్టం చేశారు.

అలా కుదరదని చెప్పేశారు
ఈ విషయంలో ‘స్టార్ మా' వాళ్లను ప్లీజ్ అని వేడుకున్నాను. కానీ ఈ విషయంలో మేము ఏమీ చేయలేమని చెప్పారు. ఇందులో మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. ఒకరికి మేము వెసులుబాటు ఇస్తే మిగతా అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి... మీరు బయటకు రావాల్సిందే అని చెప్పారని భానుశ్రీ తెలిపారు.

నానా రకాలుగా మాట్లాడుకున్నారు
నేను అగ్రిమెంటు మీద రెస్పెక్టుతో బయటకు రావడం జరిగింది. దాని గురించి నానా రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అసలు విషయం ఇదీ... కానీ తప్పకుండా మల్లీ ‘ఢీ జోడి'కి వస్తాను అని భానుశ్రీ వెల్లడించారు.

ఈ షో పోయినందుకు బాధపడ్డాను
మీరు ఢీలో ఉంటే బావుంటుంది... అని ఓ అభిమాని అడగ్గా నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాను. నాకు డాన్స్ అంటే పిచ్చి. అది కూడా మంచి షో... పోయినందుకు చాలా బాధ పడ్డాను... అని భానుశ్రీ తెలిపారు.

కౌశల్‌తో మాట్లాడుతున్నారా?
కౌశల్ మీతో మాట్లాడుతున్నారా? అని ఓ అభిమాని ప్రశ్నించగా... కౌశల్‌ను నా బర్త్ డేకు ఇన్వైట్ చేశాను. రెండు సార్లు ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్ లో మెసేజ్ పంపాను. చూశాడు కానీ ఇప్పటికీ వరకు రిప్లై ఇవ్వలేదు.... అని భానుశ్రీ తెలిపారు.

శంకర్ రెడ్డి సూపర్
ఈ సందర్భంగా కొందరు అభిమానులు భానుశ్రీ బాయ్‌ఫ్రెండ్ శంకర్ రెడ్డి గురించి అడిగారు. శంకర్ రెడ్డి చాలా బావున్నారని, ప్రస్తుతం ఇంట్లో లేరని, బయటకు వెళ్లారని సమాధానం ఇచ్చారు. శంకర్ రెడ్డి తనకు ఆప్తుడని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో భానుశ్రీ వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











