బిగ్ బాస్‌లో దెయ్యం ఎవరో తెలిసింది: జలజగా కనిపించింది కూడా ఒకప్పటి కంటెస్టెంటే!

చాలా భాషల్లో ప్రసారం అవుతున్నప్పటికీ.. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్ షో. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయినప్పటికీ.. దీనికి మన ప్రేక్షకులు విశేషమైన ఆదరణను అందించారు. అందుకే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రారంభమైన నాలుగో సీజన్‌ను సైతం విజయవంతం చేసేందుకు బిగ్ బాస్ యూనిట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే హౌస్‌లోకి దెయ్యాన్ని తీసుకొచ్చారు. ఆ గెటప్ వేసింది ఎవరో తాజాగా లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అదిరిపోయే ఆరంభంతో దూకుడు

అదిరిపోయే ఆరంభంతో దూకుడు

బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ సక్సెస్ అవుతోంది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం నాలుగో సీజన్‌ను ప్రారంభించారు నిర్వహకులు. కరోనా పరిస్థితుల నడుమ మొదలైన ఈ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. దీని ప్రీమియర్ ఎపిసోడ్‌కు ఏకంగా 18 పైచిలుకు రేటింగ్ రావడంతో ఇండియన్ టెలివిజన్ రికార్డులు బద్దలైపోయాయి.

వంద శాతం అందించేందుకు ఇలా

వంద శాతం అందించేందుకు ఇలా

గత సీజన్లలో పోలిస్తే ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్ మరింత ఎక్కువగా ఉంటుందని బిగ్ బాస్ యూనిట్ మొదటి నుంచీ చెబుతోంది. ఈ మేరకు కొన్ని ప్రత్యేకమైన టీజర్లనూ వదిలింది. ఇప్పుడు వాటిని నిలబెట్టుకునేందుకు షోలో ప్రేక్షకులు మెచ్చే కంటెంట్‌ను చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. దీంతో షోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సరికొత్తగా అన్ని టాస్కులు ప్లాన్

సరికొత్తగా అన్ని టాస్కులు ప్లాన్

తెలుగులో ఇప్పటి వరకు పూర్తయిన మూడు సీజన్లు ఒకలా.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్నది ఒకలా అన్నట్లు సాగుతోంది బిగ్ బాస్. దీనికి కారణం మొదటి మూడు సీజన్లు ఒకే రకమైన టాస్కులతో సోసోగా సాగిపోయాయి. అయితే, ఇప్పుడు మాత్రం అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. వేరే భాషల్లో ఇప్పటికే వచ్చిన ఈ టాస్కులు తెలుగులో మాత్రం ఫస్ట్ టైమ్ వస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్‌లోకి దెయ్యం రాక

బిగ్ బాస్ హౌస్‌లోకి దెయ్యం రాక

బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదటి నుంచీ ఆసక్తికరంగానే సాగుతోంది. మధ్యలో కొంత పాజ్ వచ్చినప్పటికీ సరికొత్త టాస్కులతో షోపై ఆసక్తిని కలిగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లోకి దెయ్యాన్ని తీసుకొచ్చారు షో నిర్వహకులు. జలజ అనే పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఆ దెయ్యం.. కంటెస్టెంట్లను భయపెట్టడంతో పాటు టాస్కులు ఇస్తూ షోను మలుపు తిప్పేసింది.

కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తోంది

కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తోంది


గురువారం జరిగిన ఎపిసోడ్‌లో జలజ తన మార్క్ చూపించింది. హౌస్‌లోని కంటెస్టెంట్లకు కన్‌ఫెషన్ రూమ్‌లోని స్పూన్లు తీసుకు రావాలని ఓ టాస్క్ ఇచ్చింది. ఆ సమయంలో ఎంతో కామెడీ పండింది. ఇప్పటి వరకు ఇదే బెస్ట్ ఎపిసోడ్ అన్నట్లుగా ఇది సాగింది. అలాగే, ఇంగ్లీష్‌లో మాట్లాడాడని అభిజీత్‌కు శిక్ష విధించింది. వీటితో పాటు మరికొన్ని టాస్కులు ఇచ్చిందామె.

Recommended Video

Divi Vadthya Pic Goes Viral In Social Media
బిగ్ బాస్‌లో దెయ్యం ఎవరో తెలిసింది

బిగ్ బాస్‌లో దెయ్యం ఎవరో తెలిసింది

జలజగా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దెయ్యం... సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తెలుగు హీరోయిన్ భానూ శ్రీ అని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆమె రూపం.. కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులనూ భయపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, జలజకు వాయిస్ ఓవర్ ఇచ్చింది ప్రముఖ సింగర్, మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి అని ఇప్పటికే ఓ న్యూస్ లీకైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X