కౌశల్‌పై మళ్లీ ప్రతీకారం.. భానుశ్రీ అవుట్.. దీప్తి, సామ్రాట్ కంటతడి.. !

By Rajababu

అందరూ ఊహించినట్టుగానే తెలుగు బిగ్‌బాస్ షో నుంచి సెలబ్రిటీ భానుశ్రీ నిష్క్రమించింది. ఇంటిలో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈ సెలబ్రిటీ అనూహ్య పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. తనదైన శైలిలో చాలా నిదానంగా ఆడుతున్న భానుశ్రీ కేవలం కౌశల్ మీద అవాస్తవ ఆరోపణలు చేయడం వల్లనే ప్రేక్షకుల నుంచి ప్రతికూల ఓటు వచ్చినట్టు స్పష్టమైంది.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Elimination Process Get Leaked
సభ్యులతో ఆటపాట

సభ్యులతో ఆటపాట

ఆదివారం ఎపిసోడ్స్‌లో ఇంటి సభ్యులందరితో పాటలతో డంబ్ చెరేడ్ (మూగ సైగలతో) ఆడిపించారు. ఇంటి సభ్యుడు ఓ చిట్టిని చూసి అందులో రాసిన రెండు పాటలను మూగ సైగలతో చెబుతూ ఓపాటను తన సహచరులు గుర్తించేలా, మరో పాటను నాని గుర్తుపట్టేలా నటించి చూపాలి. ఈ కార్యక్రమం సరదా సరదాగా సాగిపోయింది.

కామన్ మ్యాన్ గణేష్ సేఫ్

కామన్ మ్యాన్ గణేష్ సేఫ్

బిగ్‌బాస్ హౌస్‌లో పాటల కార్యక్రమం ముగిసిన ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ముందుగా కామన్ మ్యాన్ గణేష్ ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లారు. ఆదివారం మంచి డ్రస్ వేసుకొని మంత్రిలా కనిపించారు. దాంతో నాని మంత్రి అంటూ గణేష్‌ను ఆటపట్టించారు. ప్రతీవారం నామినేషన్‌ను తప్పించుకోవడం గణేష్ క్రేజ్ ఏంటో స్పష్టమవుతున్నది.

 కౌశల్, అమిత్ సారీ చెప్పి

కౌశల్, అమిత్ సారీ చెప్పి

నామినేషన్‌కు గురైన మరో ఇద్దరు సభ్యులు దీప్తి,భానుశ్రీలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆందోళన మొదలైంది. వారిని నామినేట్ చేసిన కౌశల్, అమిత్‌కు మాట్లాడే ఛాయిస్ ఇచ్చారు. నామినేట్ కావడానికి తాము కారణం కావడం కారణంగా భానుశ్రీకి అమిత్, దీప్తికి కౌశల్ సారీ చెప్పారు.

భానుశ్రీ ప్యాక్ యువర్ బ్యాగ్స్

భానుశ్రీ ప్యాక్ యువర్ బ్యాగ్స్

ఆ తర్వాత ప్యాక్ యువర్ బ్యాగ్ అని నాని చెప్పడంతో భానుశ్రీ ఈ గేమ్ షో నుంచి అవుట్ అయింది. భానుశ్రీ అవుట్ కావడంతో ఇంటిలో ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. దీప్తి సునైనా, సామ్రాట్ కంటతడి పెట్టుకొన్నారు. మిగితా సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.

అమిత్, కౌశల్‌పై బిగ్‌బాంబ్

అమిత్, కౌశల్‌పై బిగ్‌బాంబ్

ఇంటి నుంచి బయటకు వచ్చిన నానితో కలిసి తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని భానుశ్రీ చూసింది. ఆ తర్వాత సెల్ఫీ దిగింది. కాసేపు సరదాగా మాట్లాడింది. ఎలిమినేషన్‌లో చివరి ప్రక్రియ బిగ్‌బాంబ్‌ను అమిత్; కౌశల్‌పై విసిరింది.

కౌశల్‌పై భానుశ్రీ ప్రతీకారం

కౌశల్‌పై భానుశ్రీ ప్రతీకారం

బిగ్‌బాంబ్‌లో భాగంగా అమిత్ ఓ కుర్చిలో తప్ప మరెక్కడా కూర్చోకూడదు. అమిత్ ఎప్పుడు కూర్చోవాలనుకొంటే అప్పుడు కౌశల్ ఆ కుర్చిని తీసుకు వచ్చి ఎక్కడ వేయమంటే అక్కడ వేయాలి. కౌశల్‌తో అభిప్రాయ బేధాలు ఉన్న భానుశ్రీ అతడికి కావాలనే ఓ శిక్ష విధించినట్టు స్పష్టమైంది. ఆ విధంగా భానుశ్రీ ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X