శ్రీముఖికి పంగనామం పెట్టేసింది.. ఫ్రెండ్ అని పిలిస్తే కొంపముంచిన భాను శ్రీ!!

అదిరింది షో కాస్తా బొమ్మ అదిరిందిగా మారిన సంగతి తెలిసిందే. ఈ మార్పులో ఎంతో మంది స్థానాలు మారాయి. యాంకర్లుగా ఉన్న రవి, భాను శ్రీ బయటకు వెళ్లాల్సి వచ్చింది. వాళ్ల స్థానంలో శ్రీముఖి వచ్చింది. జడ్జ్‌గా ఉన్న నవదీప్ స్థానంలో జానీ మాస్టర్ వచ్చి చేరాడు. ఇలా బొమ్మ అదిరింది గట్టిగానే రీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి ఎపిసోడ్‌లో ఏకంగా ఏపీ సీఎంకే గురి పెట్టింది. మొదటి ఎపిసోడ్‌తోనే సంచలనం సృష్టించింది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది.

హర్టైన భాను శ్రీ..

హర్టైన భాను శ్రీ..

బొమ్మ అదిరింది షో నుంచి తనను తీసేయడంపై భాను శ్రీ బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఆమెతో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా బాగానే ఫీలైనట్టు తెలుస్తోంది. అక్కా బొమ్మ అదిరింది షోలోకి మళ్లీ రావాలి అని ఫ్యాన్స్ కోరుతున్న పోస్ట్‌లను భాను శ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసేది. పరోక్షంగా తనకు కూడా బొమ్మ అదిరిందిలోకి రావాలనే కోరిక ఉందని తెలిపింది.

దసరా ఈవెంట్‌లో..

దసరా ఈవెంట్‌లో..

జీ తెలుగులో దసరా ఈవెంట్ ఎంత సందడిగా జరిగిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది అంటూ ఓ లెటర్ చుట్టూ ఈవెంట్‌ను తిప్పారు, ఆ లెటర్‌లో ఏముందో శ్రీముఖి చెప్పదు. గెస్ట్‌లుగా వచ్చిన నాగబాబు, అనసూయలు ఆ లెటర్ చదువుతారు కానీ ఏదీ చెప్పరు.

శ్రీముఖి ఫ్రెండ్ అంటూ..

శ్రీముఖి ఫ్రెండ్ అంటూ..

ఆ లెటర్ చదివేందుకు తన ఫ్రెండ్ భాను శ్రీ వస్తుందని శ్రీముఖి చెప్పింది. అయితే అలా వచ్చిన భాను శ్రీ మాత్రం శ్రీముఖికి వెన్ను పోటు పొడిచింది. ఆ లెటర్‌లో ఏముందో చదవని అంటే.. తన మనసులో ఉన్నది చదివేసింది. ఆ దెబ్బకు శ్రీముఖి మొహం మాడిపోయింది.

Recommended Video

Actor Madhunandan Interview Part 2 రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటది!!
శ్రీముఖిని యాంకర్‌గా తీసేయండి..

శ్రీముఖిని యాంకర్‌గా తీసేయండి..

లెటర్‌లో ఉన్నది కాకుండా తన మనసులో ఉన్నది భాను శ్రీ చదవంతో అందరూ షాక్ అయ్యారు. బొమ్మ అదిరింది షోలో నా యాంకరింగ్ బాగా లేదు. భాను శ్రీ యాంకరింగే బాగుంది. మళ్లీ భాను శ్రీనే యాంకర్‌గా తీసుకోండి అని శ్రీముఖి రాసినట్టుగా భాను శ్రీ చదివి వినిపించింది. ఈ దెబ్బతో శ్రీముఖి షాక్ అయింది. ఫ్రెండ్ అని పిలిస్తే ఇలా చేస్తావా? అని భానుపై శ్రీముఖి ఫైర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X