నా ఛాతిలో, టీషర్టులో కౌశల్ చేయి పెట్టాడు: భానుశ్రీ.. వాడికి క్యారెక్టర్ లేదు.. భానుశ్రీకి జైలుశిక్ష

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Day 31 Luxury Budget Task

బిగ్‌బాస్‌లో మంచి, చెడు టాస్క్ గందరగోళాన్ని రేపింది. ఇంటి సభ్యుల మధ్య గొడవ దిగజారిన మాటలకు దారి తీసింది. కౌశల్, భానుశ్రీ మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కౌశల్, భానుశ్రీకి మధ్య చిచ్చు రేపడానికి తేజస్విని చేసిన ప్రయత్నాలకు సింగర్ గీతామాధురీ గండి కొట్టింది. భానుశ్రీ చెత్త ప్రవర్తనకు జైలుశిక్ష అనుభవించాల్సిన ఖర్మ పట్టింది. బిగ్‌బాస్‌లో 30 రోజు నాటి పరిస్థితులు వివరంగా. .

మంచి, చెడు టాస్క్ రచ్చ రచ్చ

మంచి, చెడు టాస్క్ రచ్చ రచ్చ

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా మంచి, చెడు ఆటను ఆడాలని బిగ్‌బాస్‌ను సూచించాడు. ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుపై కొన్ని యాపిల్స్‌ను పెట్టాలని, అలాగే ఇంటి సభ్యులను ప్రత్యర్థులు జైలులో బంధిస్తే పాయింట్లు వస్తాయని గేమ్ రూల్స్ బయటపెట్టాడు. ఎవరు ఎక్కువ యాపిల్స్ పెడితే వారు విజేతలుగా నిలుస్తారు అని తేల్చాడు. దాంతో నలుపు దస్తులు (చెడు), తెల్లటి దస్తులు(మంచి) సభ్యుల మధ్య భారీ యుద్ధమే జరిగింది.

భానుశ్రీపై కౌశల్ దురుసుగా

భానుశ్రీపై కౌశల్ దురుసుగా

టాస్క్‌లో భాగంగా ఒక యాపిల్‌ను భానుశ్రీ తన ప్యాంటులో దాచుకొన్నది. దానిని లాగుకునే ప్రయత్నంలో కౌశల్ దురుసుగా ప్రవర్తించాడు. అయితే అనుకోకుండా కౌశల్ చేయి భానుశ్రీ ఛాతికి తగిలింది. దానిని పెద్ద ఇష్యూగా చేసి భానుశ్రీ రచ్చ రచ్చ చేసింది. లోపల చేయిపెడుతావా అని గట్టిగా అరిచింది.

నా టీషర్టులో కౌశల్ చేతులు

నా టీషర్టులో కౌశల్ చేతులు

తన ఛాతిలోపలకు చేయిపెట్టారని భానుశ్రీ చేసిన వ్యాఖ్యలతో తేజస్విని మరీ రెచ్చిపోయింది. ఆయన క్యారెక్టర్ అదే అని ఓవర్ యాక్షన్ చేసింది. దాంతో కౌశల్ తాను అలా చేయలేదు. నేను లోపల చేయి పెట్టలేదు. యాక్సిడెంటల్‌గా చేయి తగిలితే అందుకు సారీ అన్నాడు. కానీ భానుశ్రీ అదేమి పట్టించుకోకుండా మరీ రెచ్చిపోయింది. నీకు క్యారెక్టరే లేదు అంటూ మరోస్థాయికి వెళ్లి వ్యాఖ్యలు చేసింది.

దీప్తి సునైనను సామ్రాట్ దారుణంగా

దీప్తి సునైనను సామ్రాట్ దారుణంగా

దీప్తి సునైనాను సామ్రాట్ దారుణంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి జైలులో బంధించడానికి ప్రయత్నించాడు. కానీ కౌశల్, తనీష్ అడ్డుపడి దీప్తి సునైనను ఆదుకొన్నారు. ఈ విషయాన్ని కూడా కౌశల్ ప్రస్తావించగా తేజస్వికి నచ్చలేదు. భానుశ్రీ అంశం సీరియస్ అవుతుండటంతో దీప్తి సునైన వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారా. ఈ విషయంలో సామ్రాట్‌ను ఇరికిస్తున్నారా అని తేజస్విని కొత్త రకం వివాదం సృష్టించేందుకు ప్రయత్నించింది.

భానుశ్రీ తప్పు చేస్తున్నావ్

భానుశ్రీ తప్పు చేస్తున్నావ్

భానుశ్రీ వ్యవహారం మరీ చీప్‌గా మారతుండటంతో గీతామాధురీ రంగంలోకి దిగింది. కౌశల్ అలా చేయి పెట్టలేదు. అందుకు నేను సాక్ష్యం. అనవసరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయవద్దు. బిగ్‌బాస్ కేవలం మూడు నెలల ఆట. బయట మనం జీవితాంతం జీవించాలి. అందు వలన ఒకరిపై అవాస్తవాలతో ఆరోపణలు చేయవద్దు అని గీతా మాధురీ ఫైర్ అయింది.

కౌశల్ లోపల చేయి పెట్టలేదని

కౌశల్ లోపల చేయి పెట్టలేదని

గీతా మాధురి గట్టిగా కౌశల్‌కు అండగా నిలువడంతో భానుశ్రీ దిగివచ్చింది. కౌశల్ లోపల చేయిపెట్టలేదు కానీ.. నా చెస్ట్‌కు తగిలింది. నేను కౌశల్ తప్పుడు ఆరోపణలు చేస్తే సారీ అని చెప్పింది. బిగ్‌బాస్ కెమెరాలో కూడా మాట్లాడుతూ కౌశల్ తప్పు లేదు. ఆయన నా టీషర్టులో చేయి పెట్టలేదు అని భానుశ్రీ చెప్పింది.

డిఫెన్స్‌లో పడిన భానుశ్రీ

డిఫెన్స్‌లో పడిన భానుశ్రీ

కౌశల్‌పై తప్పుడు ఆరోపణలు చేశారనే విషయం స్పష్టం కావడంతో భానుశ్రీ డిఫెన్స్‌లో పడింది. ఇక దాని గురించి పెద్దగా చర్చించవద్దు. అయిపోయిందేదో అయిపోయింది. ఇక దానిని సాగదీయవద్దు అని భానుశ్రీ చెప్పింది.

భాను శ్రీకి జైలుశిక్ష

భాను శ్రీకి జైలుశిక్ష


గురువారం నాటి ఎపిసోడ్ చివర్లో ఇంటి సభ్యులందరినీ సమావేశ పరిచి మంచి, చెడు టాస్క్‌లో ఎవరు చాలా చెత్తగా ఆడారో గుర్తించి, వారిని జైలులో పెట్టాలని కెప్టెన్ కౌశల్‌కు సూచించాడు. దాంతో రూల్స్‌కు వ్యతిరేకంగా ఆడిన భానుశ్రీని గుర్తించి జైలులో పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X