Bhanumathi April 11th Episode: ఒట్టి చేతులతో ఇంటికొచ్చిన పార్ధు.. షాక్‌లో బలరామ్ ఫ్యామిలీ, కుమిలిపోతున్న భానుమ
కుమారికి మస్కా కొట్టి పరీక్షా కేంద్రానికి వెళ్లీ నీట్ ఎగ్జామ్ రాస్తుంది. స్వామిజీ ఇచ్చిన విబూది తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు పార్ధు. ఇంతలో లాయర్ వచ్చి బలరామ్ బెయిల్ పేపర్ ఎస్ఐకి ఇస్తాడు. మీరు తీసుకొచ్చిన బెయిల్‌కు, నేను పెట్టిన కేసుకు సంబంధం లేదని ఈ బెయిల్ చెల్లదని చెబుతాడు. అలాగే పెళ్లిలో బలరామ్ తనను లాగిపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని , అస్సలు వదిలిపెట్టేది లేదని లాయర్‌తో అంటాడు.
పెదనాన్న పరువు పోయిందని ఇంట్లో వాళ్లకి చెబుతాడు చరణ్. ఏం జరిగిందని అంతా అడగ్గా.. పెళ్లిలో జరిగిన గొడవని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని చూపిస్తాడు. అది చూసిన బలరామ్ కుటుంబ సభ్యులు ఏడుస్తుంటారు. లోపలికి వచ్చి బలరామ్‌తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అవుతాడు పార్ధు. నీ పెళ్లి ఆగిపోవడానికి, మన ఇంటి పరువు బజారున పడటానికి కారణమైన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని పార్ధుకు చెబుతాడు బలరామ్. పరీక్ష రాసిన భానుమతి అంతే స్పీడుగా ఇంటికి తిరిగి రావడంతో వసు ఊపిరి పీల్చుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్ 29లో ఏం జరిగిందంటే?

ఏ కష్టమొచ్చినా ఇలాగే ధైర్యంగా నిలబడాలని భానుమతికి చెబుతుంది ప్రమీల. మనం ఎప్పుడూ మంచే జరగాలని కోరుకుంటామని, కొన్నిసార్లు అది జరగకపోయేసరికి కృంగిపోతామని అంటుంది. మనం అనుకున్నట్లే జరగాలని లేదని.. విధిరాతకు తలవంచక తప్పదని చెబుతుంది. నీ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలియదని, కానీ ఇంతకన్నా నీకు మంచి జరగబోతోందని అనుకోవడం తప్ప చేయగలిగేది ఏం లేదని అంటుంది ప్రమీల. ఎగ్జామ్ ఎలా రాశావని వసు అడగ్గా.. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కల అని, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని చెబుతుంది భానుమతి. అయితే రిజల్ట్స్ వచ్చే వరకు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అంటుంది వసు.
కానీ భానుమతి మాత్రం బాధపడుతూనే ఉంటుంది. నేను గండం గట్టెక్కడం కోసం మరోకరిని నదిలోకి తోసేసినట్లు అనిపిస్తోందని చెబుతుంది భానుమతి. నేను పోలీసులకి ఫోన్ చేయకపోతే ఆ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని అంటుంది. ఒకటి కావాలనుకుంటే ఇంకోకటి వదులుకోవాలని చెబుతుంది వసు. వాళ్లు పెద్దవాళ్లు, డబ్బున్నవాళ్లు.. ఏదో రకంగా బయటికి వచ్చేస్తారని ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అంటుంది.
కొడుకు కోసం ఎదురుచూస్తుంటుంది బలరామ్ తల్లి. కంగారు పడొద్దని, వాళ్ల నాన్నగారి కోసం పార్ధు ఎంత దూరమైనా వెళ్తాడని అంటుంది శారద. ఎలాగైనా వాళ్ల నాన్నగారితోనే తిరిగి వస్తాడని, మీరు చూస్తూ ఉండమని చెబుతుంది. ఇంతలో పార్ధు కారు వచ్చిన శబ్దం రావడంతో అంతా సంతోషిస్తారు. అందరూ బయటికి వెళ్లి చూసేసరికి కారులో బలరామ్ లేకుండా పార్ధు మాత్రమే తిరిగొస్తాడు. మీరే వచ్చారు? మీ నాన్న ఎక్కడ? అని బలరామ్ తల్లి ప్రశ్నిస్తుంది. మీ నాన్న వయసునైనా గౌరవించి వాళ్లు దిగి రాలేదా? అని అడుగుతాడు విశ్వనాథం.
ఇప్పుడు సమస్య అనుకున్నంత చిన్నదిగా లేదని.. మనం ఊహించనంత పెద్దదిగా మారిపోయిందని చెబుతాడు పార్ధు. పెళ్లిలో ఎవరో తీసిన వీడియో వల్ల ఆ ఎస్ఐ దానిని సీరియస్‌గా తీసుకున్నాడని.. అందుకే నాన్నని విడుదల చేయడానికి అస్సలు ఒప్పుకోవడం లేదని అంటాడు. అయితే నాన్నని విడిపించడం కుదరదా? అని ధర్మ ప్రశ్నిస్తాడు. ఈ రెండు రోజులు సెలవు కావడంతో సోమవారం బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలని చెబుతాడు పార్ధు. ఆ మాటలతో బలరామ్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటారు.
అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ ఎస్ఐ కూడా బావగారిని అణగదొక్కాలని చూస్తాడని అంటుంది శక్తి. ఏదో ఒకటి చేసి బావగారిని బయటికి తీసుకోద్దామని చెబుతుంది. పెదనాన్నని చూసి అంతా చేతులెత్తి నమస్కరించేవాళ్లని, ఇప్పుడు కనిపించిన చోట చీదరించుకుంటారని, ఛీ కొడతారని భయంగా ఉందని అంటాడు చరణ్. ఇకపై పెదనాన్నని ఎవరు గౌరవిస్తారు? ఎవరు మర్యాద ఇస్తారు? అని చిత్ర కూడా ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో శారద మండిపడుతుంది. ఒక చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన ఒక మనిషి మర్యాద చెడిపోదని, ఆ మనిషి మీదున్న గౌరవం తగ్గదని ముందు కుటుంబంలో తగ్గకుండా ఉంటే చాలని అంటుంది.
అన్నయ్యకి ఇలాంటి పరిస్ధితి రావడానికి కారణమైన అమ్మాయిని అస్సలు వదిలిపెట్టకూడదని అంటుంది శాంభవి. పార్ధు ఆ పనిమీదే ఉన్నాడని, ఆ అమ్మాయి ఎవరైనా సరే వదిలిపెట్టే సమస్యే లేదని చెబుతాడు దుర్గ. లోపలికి వచ్చిన శక్తి.. బలరామ్ కుర్చిని తడుముతూ, ఇన్నాళ్లు తలెత్తుకుని బతికారని.. మొట్టమొదటిసారి తలదించాల్సిన పరిస్ధితి వచ్చిందని అంటుంది. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటానని.. ఇకపై ఈ ఇంటి పెత్తనాన్ని, పెద్దరికాన్ని నా చేతికి చేజిక్కించుకుంటానని చెబుతుంది.
కోటి కోసం ప్రమీల ఎదురుచూస్తుండంతో కుమారి వచ్చి అడుగుతుంది. మీ కొడుకు ఇంకా బయటికి రాకపోవడంతో ఇంకా రాలేదని భయపడుతున్నానని చెబుతుంది ప్రమీల. వాడు మందేసినా నేరుగా ఇంటికే వస్తాడని, అసలే పెళ్లి చెడిపోయిందని తెలిసి పరామర్శించే బృందాలు ఎక్కువయ్యాయని నువ్వు లోపలికి వెళ్లని మండిపడుతుంది కుమారి. ఇంతలో పీకలదాకా మందు తాగి వస్తాడు కోటి. దాంతో భర్తకు చీవాట్లు పెడుతుంది ప్రమీల. నీకు ఈ తండ్రి బాధ, ఆవేదన ఏం తెలుసని అంటాడు కోటి.
పెళ్లి చెడిపోయిందన్న బాధతో తాగుతున్నానని.. ఈ పెళ్లితో నా అప్పులు తీరిపోతాయని అనుకున్నానని కానీ నా అప్పులే వెక్కిరిస్తున్నాయని అంటాడు. బలరామ్ బయటికి వస్తే మళ్లీ పెళ్లి గురించి మాట్లాడి ముహూర్తాలు పెట్టిద్దామనుకున్నానని .. ఆయన అప్పుడే బయటికొచ్చే పరిస్థితులు లేవనే బాధతో తాగుతున్నానని చెబుతాడు కోటి. ఏం జరిగిందని ప్రమీల అడగ్గా.. ఈ కేసు బలరామ్ మెడకి బలంగా చిక్కుకుంటుందని కోటి చెప్పడంతో ప్రమీల, భానుమతి షాక్ అవుతారు. ఆ అమ్మాయి చేసిన పనికి బెయిల్ కూడా రాని పరిస్ధితి ఏర్పడిందని చెబుతాడు కోటి.
బలరామ్ గారికి అంత పేరుంది? అంత పలుకుబడి ఉంది? వాటిని ఉపయోగించి బయటికి వస్తారని అనుకున్నానని అంటుంది భానుమతి. చాలా తప్పు జరిగిపోయిందని, పరిస్ధితి ఇక్కడి వరకు వస్తుందని అనుకోలేదని అంటుంది. ఇలా జరుగుతుందని తెలిస్తే ఇలా చేసే దాన్ని కాదని భానుమతి చెప్పబోతుండగా వసు అడ్డుపడుతుంది. ఆ మాటలతో ప్రమీల, కుమారికి అనుమానం కలుగుతుంది. ఆ అమ్మాయిని అల్లుడుగారు ఎట్టి పరిస్ధితుల్లో వదిలేలా లేరని అంతు చూస్తారని చెబుతాడు కోటి. ఆ మాటలతో వసు, భానుమతి షాక్ అవుతారు.
సూరిని తీసుకుని పార్ధు .. భానుమతి ఇంటికి వస్తాడు. పార్ధుని చూడగానే కోటి సంబరపడిపోతాడు. నేను ఎంత బాధపడుతున్నానో, నువ్వు కూడా అంతే బాధపడుతున్నావని భానుమతితో అంటాడు పార్ధు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఫోన్ చేసి ఈ పెళ్లిని ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రమీల ప్రశ్నిస్తుంది. నేను కూడా ఆ అమ్మాయిని వెతుకుతున్నానని.. ఎవరైనా సరే వదిలిపెట్టనని పార్ధు చెబుతాడు. అతని మాటలతో వసు, భానుమతిలు వణికిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
.


Click it and Unblock the Notifications











