Bhanumathi April 12th Episode : పార్ధు మాటలతో భానుమతికి ముచ్చెమటలు.. నిజం తెలుసుకున్న కోటి
పెళ్లి ఆగిపోయిందని బాధపడుతున్న కూతురిని ఏ కష్టం వచ్చినా తట్టుకుని నిలబడాలని చెబుతుంది ప్రమీల. పెళ్లి ఆగిపోవడంతో నీట్ ఎగ్జామ్ రాసినా బలరామ్ జైలు పాలు కావడంతో బాధపడుతుంది భానుమతి. ఆయన బాగా డబ్బున్నోళ్లని, పలుకుబడి ఉందని ఏదో ఒక రకంగా వచ్చేస్తారని వసు నచ్చచెబుతుంది. బలరామ్ రాకకోసం అతని కుటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో ఒట్టి చేతులతో వచ్చిన పార్ధుని చూసి బలరామ్ ఎక్కడని అంతా అడుగుతారు.
వీడియో వైరల్ కావడంతో ఆ ఎస్ఐ కేసును సీరియస్‌గా తీసుకున్నాడని, బెయిల్ రాలేదని సోమవారం వరకు ఎదురుచూడాల్సిందేనని అంటాడు పార్ధు. ఇప్పటికే బావగారి పరువు పోయిందని ఇక ఆయనకు ఎవ్వరూ విలువ ఇవ్వరని శక్తి , చిత్ర, చరణ్ అంటారు. ఆ మాటలతో శారద మండిపడుతుంది. బలరామ్‌ను ఇంకా అణగదొక్కి ఇంటి పెత్తనం, అధికారాన్ని నేను చేజిక్కించుకుంటానని శక్తి అనుకుంటుంది. పెళ్లి ఆగిపోవడంతో భానుమతి దగ్గరికి వచ్చి ఆమెను ఓదారుస్తాడు పార్ధు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్ 30లో ఏం జరిగిందంటే?

ఆ అమ్మాయి ఎంత పగతో మా కుటుంబానికి ఇంత చేసిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం అంతకు 1000 రేట్లు పగతో రగిలిపోతున్నానని చెబుతాడు పార్ధు. ఆ మాటలతో భానుమతి, వసులు వణికిపోతారు. ఆ అమ్మాయి గురించి వెతుకుతున్నాను.. ఏ రోజు నా తండ్రికి ఇలాంటి దుస్థితి ఏర్పడలేదని, ఏనాడు నా తండ్రికి ఇలాంటి అవమానం ఎదురవుతుందని నేను ఊహించలేదని చెబుతాడు పార్ధు. ఆ అమ్మాయి వల్ల నా తండ్రికి ఇంత అవమానం జరిగిందని, ఆ అమ్మాయి వల్ల నా కుటుంబం ఈరోజు కన్నీళ్లు పెట్టుకునే పరిస్ధితి ఏర్పడిందని రగిలిపోతాడు. ఆ అమ్మాయి అంతు చూసేవరకు నేనే నిద్రపోనని అంటాడు.
పార్ధు మాటలతో భానుమతికి ముచ్చెమటలు పట్టగా.. ఏమైందని అడుగుతాడు . నేను బాగానే ఉన్నానని.. నువ్వెందుకో కంగారు పడుతున్నావ్, ఏదో విషయాన్ని నా మనసులో భారంగా తీసుకున్నావని చెబుతాడు. నువ్వలా ఎందుకున్నావో నాకు తెలుసు అని చెప్పడంతో భానుమతి ఇంకా టెన్షన్ పడుతుంది. ఈ పగలు, ప్రతీకారాల మధ్య నీ బతుకు ఏమైపోతుందోనని భయపడుతున్నావని అంటాడు. ఆ ఆవేశాల మధ్య నీ భవిష్యత్తు ఎక్కడ కూలిపోతుందోనని బాధపడుతున్నావ్ అని అడుగుతాడు.
ఏ అమ్మాయి ఆలోచనైనా ఈ పరిస్థితుల్లో అలాగే ఉంటుందని చెబుతుంది ప్రమీల. మా నాన్న బయటికి రాగానే మళ్లీ పెళ్లి గురించి మాట్లాడదామని పార్ధు చెబుతాడు. ఆ మాటలతో భానుమతి బాధపడుతుంది. నువ్వు మేజర్ అవ్వగానే మళ్లీ పెళ్లి పనులు మొదలుపెడదామని చెప్పడంతో కోటి, ప్రమీల, కుమారి సంతోషిస్తారు. బలరామ్‌ను బయటికి తీసుకురావడం కోసం పోలీస్ స్టేషన్ బయటే వెయిట్ చేస్తుంటారు పార్ధు, సూరి, దుర్గ. ఆ ఎస్ఐని చూస్తే మొండోడులా ఉన్నాడని, మనం అడిగింది చేస్తాడా అని పార్ధుని సూరి ప్రశ్నిస్తాడు.
ఏ పనిలోనైనా ప్రయత్నం చేయాలని.. మనం అనుకున్నది అమలు చేయాలని చెబుతాడు దుర్గ. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ గారు రమ్మంటున్నారని చెప్పి పార్ధుని పిలుస్తాడు. మీకు ఫోన్ చేసి పిలిచిన ఆ అమ్మాయి ఎవరు? ఈ పెళ్లి ఆపమని మిమ్మల్ని అడిగింది ఎవరు? అని ఎస్ఐని అడుగుతాడు పార్ధు. మమ్మల్ని అందరిలో అవమానించి.. మా మీద బురద జల్లాలని చూసింది ఎవరు అని అడుగుతాడు . ఏ ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పనని అంటాడు ఎస్ఐ. మీరు కూడా పంతానికి పోయారని నాకు అర్ధమవుతోందని.. ఆ పంతాన్ని నెగ్గించుకోవడానికి మనం ఏ యుద్ధమైనా చేసుకుందామని అంటాడు. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అని అడుగుతాడు పార్ధు.
నా ఒంటి మీద దెబ్బ పడింది.. నాకు మీ మీద పగ పెరిగిందని , సమస్య నాది అనుకునేంత ముదిరిందని అలాంటప్పుడు మీరు అడిగిన దానికి నేనేందుకు సమాధానం చెబుతానని అంటాడు ఎస్ఐ. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆ అమ్మాయి ఎవరో మీకు చెప్పనని తేల్చిచెబుతాడు. మీలాంటి వాళ్లకు ఏం కావాలో నాకు బాగా తెలుసని.. ఏం ఆశించి ఇంత పొగరు చూపిస్తున్నారో నేను అర్ధం చేసుకోగలనని అంటాడు. ఎంత కావాలి పడేస్తానని చెప్పేసరికి ఎస్ఐ రగిలిపోతాడు. నాకు భయంకరమైన అవమానం జరిగింది? ఆ అవమానానికి నువ్వు వెల కట్టలేవని , నువ్వు వెల కట్టినా అమ్ముడు పోవడానికి నేను సిద్ధంగా లేనని అంటాడు ఎస్ఐ.
ముందు బయటికి నడువు.. లేకపోతే ఏదో ఒక కేసు పెట్టి నిన్ను కూడా జైళ్లో పడేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఎస్ఐ. ఆ మాటలతో రగిలిపోయిన పార్ధు ఎస్ఐ మీదకి వెళ్లబోతుండగా బలరామ్ ఆపుతాడు. ఒక సమస్య మనకి ఎదురుగా ఉందంటే .. దానికి వంద పరిష్కార మార్గాలుంటాయని, ఇందుకోసం ఎవరి కాళ్లు పట్టాల్సిన అవసరం లేదని అంటాడు బలరామ్. మీకు 99 మార్గాలు ఉంటాయని , ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో తెలుస్తుందని చెబుతాడు. తండ్రి మాటతో బయటికి వెళ్తాడు పార్ధు.
ఇంతలో కోటి వచ్చి అయ్యగారికి బెయిల్ వచ్చే మార్గం తెలిసిందా? పోనీ ఈ పెళ్లి చెడగొట్టిన ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా? అని అడుగుతాడు . పోలీస్ స్టేషన్‌లో నాకు తెలిసిన కానిస్టేబుల్ ఒకరు ఉన్నారని నన్ను ప్రయత్నించమంటారా అని అడుగుతాడు కోటి. ఖచ్చితంగా ప్రయత్నించమని చెబుతాడు సూరి. ఇంతలో కానిస్టేబుల్ బయటికొచ్చి ఎందుకు ఫోన్ చేశావని అడుగుతాడు. నా కూతురి పెళ్లి ఆగిపోయిందని.. దానికి పెళ్లి కావడం ఎవరికో ఇష్టం లేదని అందుకే ఎస్ఐ గారికి ఫోన్ చేసిందని అంటాడు కోటి. ఆ ఫోన్ చేసిన అమ్మాయి గురించి మీకు తెలుసా అని అడుగుతాడు.
ఫోన్ చేసింది ఎవరో కాదు మీ అమ్మాయేనని కానిస్టేబుల్ చెప్పడంతో కోటి షాక్ అవుతాడు. ఫోన్ చేసి తాను మైనర్‌నని, ఈ పెళ్లి ఆపేయమని చెప్పింది మీ అమ్మాయేనని అంటాడు కానిస్టేబుల్. భానుమతి పెళ్లి ఆగిపోయిందని కుమారిని వాళ్ల ఫ్రెండ్స్ వచ్చి దెబ్బిపోడుస్తుంటారు. దీంతో మండిపడిన కుమారి కర్ర తీసుకుని వాళ్లని తరిమి తరిమి కొడుతుంది. పార్థు అన్న మాటలు గుర్తుచేసుకుని భానుమతి బాధపడుతుంటుంది. ఇంతలో వసు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది.
జీపు అబ్బాయికి జరిగినది చెప్పేస్తానని.. నువ్వు నిజం చెప్పడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా అని చెబుతుంది వసు. వీరి మాటలను ప్రమీల వింటుంది. ఆగిపోయిన పెళ్లి గురించి నాతో మాట్లాడు.. చిన్నపిల్లతో ఏం మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తుంది ప్రమీల. ఇలాంటివన్నీ దానితో మాట్లాడటం వల్ల దాని చదువు పాడవుతుందని, అమ్మ ఏం వినలేదు కాబట్టి బతికిపోయామని నువ్వు కూడా ఈ విషయం ఇక్కడితో మరిచిపో అని చెబుతుంది వసు.
కానిస్టేబుల్ దగ్గరి నుంచి వస్తున్న కోటితో ఆ అమ్మాయి ఎవరో కనుక్కున్నారా అని అడుగుతాడు పార్ధు. ఆ అమ్మాయి ఎవరైనా సరే క్షమించేది లేదని పార్ధు చెప్పడంతో కోటి భయపడతాడు. ఆ అమ్మాయి వివరాలు ఎవరికీ చెప్పొద్దని ఆ ఎస్ఐ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాడని చెబుతాడు కోటి. మనం కూడా ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవడం ఆపిస్తే బెటర్ అని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











