Bhanumathi April 15th Episode : బాంబు పేల్చిన భువన .. పార్ధు ఉగ్రరూపం, వణికిపోయిన శాంభవి

పెళ్లి ఆపమని ఫోన్ చేసింది భానుమతేనని తెలుసుకున్న కోటి ఆవేశంగా ఇంటికి బయల్దేరతాడు. ఇంటికెళ్లి భానుమతి గురించి అడగ్గా.. ప్రమీల, కుమారిలు తెలియదని చెబుతారు. అయితే వసుని గట్టిగా నిలదీసేసరికి అక్క .. జీపు అబ్బాయి దగ్గరికి వెళ్లిందని చెబుతుంది . దాంతో భానుమతిని వెతుక్కుంటూ వెళ్తాడు. పార్ధుని కలిసిన భానుమతి నిజం చెప్పబోతుండగా కోటి వచ్చి అడ్డుకుంటాడు.

కూతురిని ఇంటికి తీసుకెళ్లి చావబాదుతాడు. ఈ క్రమంలో ప్రమీలని పక్కకునెట్టడంతో ఆమె తలకి గాయమవుతుంది. భర్త కోపం చూసిన ప్రమీల ఏం జరిగింది? భాను ఏం తప్పు చేసిందని నిలదీస్తుంది. పెళ్లి ఆపమని ఎస్ఐ గారికి ఫోన్ చేసింది భానుమతేనని కోటి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఫోన్ చేసిన అమ్మాయి కోసం అల్లుడుగారు వెతుకుతున్నారని, ఇది చేసింది భానుయేనని తెలిస్తే అస్సలు ఊరుకోడని చెబుతాడు కోటి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్‌లో 32లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 15th 2025 Episode 32 Here is Today s full story

భానుమతి కనుక మళ్లీ తప్పు చేస్తే ఇంట్లో నా శవమైనా లేస్తుంది.. దాని శవమైనా లేస్తుందని ప్రమీలకు వార్నింగ్ ఇస్తాడు కోటి. తండ్రి మాటలతో భానుమతి ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. బలరామ్ కోసం ఇంట్లో వాళ్లంతా ఎదురు చూస్తుంటారు. ఫోన్ చేసి మరి పెళ్లి ఆపేసిన పోలీస్‌కు ఏం కావాలో అడగమని దుర్గతో అంటుంది బలరామ్ తల్లి. ఎంత కష్టమైనా పార్ధు ఖచ్చితంగా వదలడని.. ప్రతి క్షణం అదే పని మీద ఉంటున్నాడని చెబుతాడు దుర్గ. ఇంతలో పార్ధు రావడంతో .. ఆ అమ్మాయి ఎవరో? ఎక్కడ ఉంటుందో? తెలిసిందా? అని అడుగుతుంది శక్తి.

ఇంకా తెలియలేదని.. కానీ ఆ అమ్మాయి ఎవరైనా సరే పట్టుకుని తీరతానని అంటాడు పార్ధు. ఆ మాటలతో భువన వణికిపోతుంది. ఆ అమ్మాయి సంగతి సరే కానీ ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరిస్తుంది శక్తి. కడుపు నిండా తినడం లేదు, కంటి నిండా నిద్రపోవడం లేదని చెబుతుంది . కన్నతండ్రికి ఇలాంటి పరిస్ధితి వస్తే ఏ కొడుక్కి నిద్రపడుతుందని శాంభవి ఆవేశంతో ఊగిపోతుంది. అన్నయ్యకి ఇలాంటి పరిస్ధితి తీసుకొచ్చిన ఆడదాని అంతు చూడాలని.. అది మన కళ్ల ముందే నాశనమైపోవాలని అంటుంది. అన్నయ్యకి ఇంత అవమానం జరగడానికి కారణమైన ఆ అమ్మాయి దొరకగానే నా ఎదురుగా నిలబెట్టమని పార్ధుతో అంటుంది శాంభవి. ఆ మాటలతో భువన పైకి వెళ్లిపోతుంది. దాంతో శాంభవికి అనుమానం వస్తుంది.

నీ కన్నా వంద రెట్ల ఆవేశం నాకు ఉందని, ఏది ఏమైనా సరే ఆ అమ్మాయిని పట్టుకోవడం ఖాయమని అంటాడు పార్ధు. ఇంతలో కూతురి దగ్గరికి వెళ్లి హఠాత్తుగా పైకి ఎందుకు వచ్చేశావని అడుగుతుంది శక్తి. నా కన్నతల్లే నా బతుకు బుగ్గిపాలు కావాలని కోరుకుంటూ ఉంటే చూడలేక వచ్చేశానని.. నా కన్నతల్లే నా జీవితం నాశనం కావాలని కోరుకుంటూ ఉంటే వినలేక వచ్చేశానని అంటుంది. ఆ మాటలతో శాంభవి వణికిపోతుంది. అంటే పెళ్లిరోజు పోలీసులకు ఫోన్ చేసింది నువ్వేనా అని ప్రశ్నిస్తుంది. ఆరోజు పోలీసులకు ఫోన్ చేసింది నేనే అని అంటుంది భువన.

పార్ధు బావ పక్కన ఆ భానుమతిని చూడలేక పెళ్లి మధ్యలో నేను బయటికి వెళ్లిపోయానని జరిగినదంతా చెబుతుంది భువన. ఆ సమయంలో కొంతమంది ఆటోడ్రైవర్లు పెళ్లి గురించి మాట్లాడుతుంటే వింటుంది. పదికి, పాతికకి మనోడు చేయి చాచేవాడని, అలాంటి వాడు ఏకంగా కోటీశ్వరుల ఇంటికి కూతురిని కోడలిగా పంపిస్తున్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా అంత చిన్నపిల్లకి పెళ్లా అని ఒక డ్రైవర్ అంటాడు. ఆ భానుమతి ఇంకా మేజర్ కూడా కాలేదని, కోటిగాడు అత్యాశతో ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ భువన వింటుంది.

భానుమతి ఇంకా మైనర్ కాబట్టి.. పెళ్లి ఆపడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటుంది భువన. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెబితే అంతా వాళ్లే చూసుకుంటారని ప్లాన్ చేస్తుంది. అయితే తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తే దొరికిపోతానని భయపడ్డ భువన.. ఓ బకరా కోసం వెతుకుతుండగా, సైకిల్ మీద వెళ్తున్న కుర్రాడిని లిఫ్ట్ అడుగుతుంది. నా ఫోన్ పనిచేయడం లేదని నీ ఫోన్ ఇస్తావా అని అడుగుతుంది భువన. అతని దగ్గరి నుంచి ఫోన్ తీసుకుని ఎస్ఐకి ఫోన్ చేస్తుంది భువన. ఓ మైనర్ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని.. ఆమెకు పెద్దలను ఎదిరించే ధైర్యం లేదని, మీరే వచ్చి ఆ అమ్మాయి జీవితం కాపాడాలని చెప్పడంతో ఎస్ఐ తన సిబ్బందితో వచ్చాడని తల్లితో చెబుతుంది.

ఆ మాటలతో శాంభవి వణికిపోతుంది. నేను వేసిన బాణం భానుమతికి తగులుతుందని అనుకున్నానని.. బలరామ్ మావయ్యకి తగులుతుందని అనుకోలేదని చెబుతుంది. నువ్వు ఈ పనిచేశావని ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో ఊహించావా? ఇంట్లో వాళ్లంతా మనల్ని శత్రువుల్ని చూసినట్లు చూస్తారని, నయవంచకులని మనమీద ముద్ర వేస్తారని ఇంట్లో నుంచే తరిమేస్తారని హెచ్చరిస్తుంది శాంభవి. అవన్నీ జరుగుతాయో లేదో నువ్వు ముందే ఊహించుకుని భయపడొద్దని చెబుతుంది భువన.

నువ్వు చేసిన పని చిన్నది కాదని, ఈ కుటుంబాన్ని ఉన్నపళంగా వణికించిన పని అని అంటుంది శాంభవి. దానికి కారణం నువ్వేనని తెలిస్తే ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటాయని చెబుతుంది. నేను చేసిన పనివల్ల పెళ్లి ఆగిపోయింది కదా? అని అంటుంది భువన. పెళ్లి ఆగింది కానీ మా అన్నయ్య నాకు ఎప్పుడు ఎలాంటి లోటు రానివ్వలేదని, నిన్ను కూడా అల్లారుముద్దుగానే చూసుకుంటూ వచ్చాడని చెబుతుంది శాంభవి. నువ్వు అజ్ఞానంతో చేసిన పని వల్ల అన్నయ్య పోలీస్ స్టేషన్ పాలయ్యాడని చెబుతూ వెనక్కి తిరిగి చూసేసరికి పార్ధు కనిపించడంతో శాంభవి, భువనలు షాక్ అవుతారు.

ఇన్ని రోజులు నేను మీ గురించి ఊహించింది తప్పు.. ఈరోజు మీ నిజస్వరూపాలు తెలుసుకున్నానని అంటాడు పార్ధు. మీరంతా మా నాన్న కోసం ఇంతలా బాధపడుతున్నారని చెబుతాడు . ఆ మాటలతో శాంభవి, భువనలు ఊపిరి పీల్చుకుంటారు. ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటానని, నాన్నకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని చెబుతాడు పార్ధు.మన మాటలు పార్ధు వినలేదని, వెంటనే మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడని చాలా భయపడ్డానని చెబుతుంది శాంభవి. ఈ విషయం తర్వాతైనా బయటపడుతుందని, అప్పుడు మన పరిస్ధితి ఏంటని ప్రశ్నిస్తుంది.

అక్క ఒంటికి తగిలిన దెబ్బలకి మందు రాస్తుంది వసు. ఈ బాధ కన్నా.. ఒక మంచి మనిషిని పోలీస్ స్టేషన్‌కి పంపించానన్న బాధే ఎక్కువగా ఉందని చెబుతుంది భానుమతి. నా మూలంగా ఒక కుటుంబం మొత్తం బాధపడుతోందని అంటుంది. కూతురి పెళ్లి ఆగిపోవడం తిరిగి ఎలా చేయాలా? అని కోటి ఆలోచిస్తూ ఉంటాడు. భానుమతి చేసిన పని గురించి బలరామ్ కుటుంబానికి తెలిస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందని చెబుతుంది కుమారి. ఈ నిజాన్ని శాశ్వతంగా సమాధి చేస్తానని కోటి అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X