Bhanumathi April 17th Episode : జైలు నుంచి విడుదలైన బలరామ్.. కోటి మైండ్‌లో కొత్త స్కెచ్

దెబ్బలతో బాధపడుతున్న భానుమతిని భోజనానికి రమ్మని పిలుస్తుంది ప్రమీల. తనకు ఆకలిగా లేదని, నేను తిననని చెబుతుంది భానుమతి. దీంతో వసు వెళ్లి అన్నం కలుపుకుని వచ్చి అక్కకి తినిపిస్తుంది. ఆ భానుమతితో పెళ్లి అనుకుంటేనే ఇంత జరిగిందని, ఇక కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టుంటే ఏం జరిగేదోనని బలరామ్ తల్లి బాధపడుతుంది. ఇంతలో కోటి వచ్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేయొద్దని బతిమలాడతాడు. నీ కూతురితో పార్ధు పెళ్లి జరగదని మీకు మేం ఇచ్చిన నగలు, బట్టలు తిరిగి ఇవ్వమని కోటితో తేల్చిచెబుతుంది .

నేను వెళ్లి ఆ నగలు, కానుకలు తీసుకొస్తానని శాంభవి చెప్పగా.. నగలు కొట్టేసిన బండారం ఎక్కడ బయటపడుతుందోనని శక్తి జోక్యం చేసుకుంటుంది. నేనే ఆ భానుమతికి ఇచ్చాను కాబట్టి.. తీసుకొచ్చే బాధ్యత కూడా నాదేనని అంటుంది. భానుమతి జాతకం వల్లే బలరామ్ గారికి ఈ పరిస్ధితి వచ్చిందని ఇంట్లో వాళ్లు బాధపడుతున్నారని ప్రమీలతో చెబుతుంది శక్తి. మా అత్తగారు ఈ పెళ్లి వద్దు అన్నారని .. మేం ఇచ్చిన నగలు, బట్టలు తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది శక్తి. దాంతో ఇంట్లో ఉన్న డబ్బు, నగలను ఇచ్చేస్తుంది ప్రమీల. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 17వ తేదీ ఎపిసోడ్‌లో 34లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 17th 2025 Episode 34 Here is Today s full story

బలరామ్‌ను విడిపించడానికి లాయర్ రావడంతో ఆయనను తీసుకుని పోలీస్ స్టేషన్‌ లోపలికి వెళ్తాడు పార్ధు. ఎస్ఐకి బెయిల్ పేపర్స్ ఇచ్చి .. బలరామ్ గారికి బెయిల్ రాదని ఎన్నో అన్నారని లాయర్ మండిపడతాడు. బెయిల్ రాగానే బ్రహ్మాండం గెలిచినట్లు సంబరపడిపోవద్దని, ఇవి కేవలం ఆ బలరామ్ గారిని బయటికి తీసుకురావడానికే పనికొస్తాయని చెబుతాడు ఎస్ఐ. బయటికొచ్చాక చాలా ఆటలు ఆడాల్సి ఉంటుందని, చేయాల్సిన యుద్ధం ఇంకా మిగిలే ఉందని అంటాడు. నాకు జరిగిన అవమానం అంత త్వరగా చల్లారదని, నా పగ తీరే వరకు భగభగ మండుతూనే ఉంటుందని కోపంగా చెబుతాడు.

ఎంత భగభగ మండినా ఏదో ఒకరోజు చల్లబడాల్సిందేనని పార్ధు అంటాడు. మా నాన్నగారి మంచితనం, పెద్దరికం గురించి ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారని ఆరోజు మీ పగ ఈరోజు ఉన్నట్లుగా ఉండదని చెబుతాడు పార్ధు. తర్వాత బలరామ్‌ను వదిలేయమని ఆర్డర్స్ వేస్తాడు ఎస్ఐ. జైలు నుంచి బయటికి రాగానే కొడుకుని కౌగిలించుకుంటాడు బలరామ్. మిమ్మల్ని బయటికి తీసుకురావడం కొంచెం ఆలస్యమైందని తండ్రికి క్షమాపణలు చెబుతాడు పార్ధు.

ఈ ఆలస్యం నాకు పెద్ద లెక్క కాదని.. కానీ నన్ను అవమానించిన ఆ అమ్మాయి దొరికే వరకు మాత్రం నాకు నిద్రపట్టదని అంటాడు బలరామ్. ఆ అమ్మాయి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా అని ప్రశ్నిస్తాడు. ఇంకా లేదని, కానీ ఖచ్చితంగా తెలుసుకుంటానని చెబుతాడు బలరామ్. అతి త్వరలోనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని అంటాడు. బయటికి రాగానే బలరామ్‌ను హత్తుకుంటాడు దుర్గ. ఇంట్లో అందరూ నీకోసం ఎదురుచూస్తున్నారని చెబుతాడు.

మరోవైపు ఇంట్లో ఉన్న కోటికి ఫోన్ రావడంతో తెగ సంబరపడిపోతాడు. ఏం జరిగింది? ఎందుకింత సంబరపడిపోతున్నావని అడుగుతుంది కుమారి. ఆ బలరామ్ గారికి బెయిల్ వచ్చిందని చెబుతాడు కోటి. ఆ మాటతో కుమారి, ప్రమీల, భానుమతి సంతోషిస్తారు. ఆయన పోలీస్ స్టేషన్‌కి వెళ్లడానికి , బాధపడటానికి నేనే కారణమని అనుకుంటుంది భానుమతి. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన బలరామ్‌ను చూసి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడతారు. కారు దిగిన వెంటనే కోపంతో పూలకుండీని ఒక తన్ను తంతాడు బలరామ్.

లోకాన్ని నడిపించే సూర్యభగవానుడు కూడా గ్రహణం బారినపడక తప్పదని మనమెంత అంటాడు విశ్వనాథం. అప్పుడప్పుడు మన జీవితాల మీదకి, జాతకాల మీదకి దూసుకొచ్చే ఇలాంటి గ్రహణాలను ఎదుర్కోక తప్పదని చెబుతాడు. భర్తకి దిష్టి తీసి లోపలికి తీసుకొస్తుంది శారద. ఇంట్లోకి రాగానే పెళ్లిలో జరిగిన విషయాన్నే తలచుకుని రగిలిపోతాడు బలరామ్. పదే పదే ఆ విషయాన్ని తలచుకుని బాధపడొద్దని శారద నచ్చచెప్పబోతుండగా బలరామ్ మండిపడతాడు.

ఇది వదిలేసేంత చిన్న విషయం కాదని, మరిచిపోయేంత మామూలు విషయం కాదని చెబుతాడు బలరామ్. ఎవరో పనిగట్టుకుని మరి చేసిన ఈ పన్నాగాన్ని బయటికి లాగాలని.. నా పరువుని, పరపతిని వీధికి లాగాలని ప్రయత్నించినవాళ్ల విధి రాతని ఇక నుంచి నేను రాయాలని కోపంగా అంటాడు. ఆ మాటలతో భువన, శాంభవి, శక్తి , చిత్రలు వణికిపోతారు. నీ కోపానికి కారణముందని.. కానీ నువ్వు ఇలాగే కూర్చొని ఆలోచిస్తే ఏదో కోల్పోయినట్లుగా ఉందని బలరామ్ అంటాడు. అవమాన భారం చేసే గాయం అంత త్వరగా మానిపోదని, నాకు ఇంత అవమానం కలగడానికి కారణమైన వాళ్లని పట్టుకోవాలని చెబుతాడు.

వాళ్లకు తిరిగి ఇలాంటి పరిస్ధితే తీసుకురావాలని అప్పటి వరకు , నా గుండెల్లో రగిలిపోతున్న అగ్నిపర్వతం చల్లారదని కోపంగా చెబుతాడు బలరామ్. ఆ మాటలతో శాంభవి వణికిపోతుంది. ఎంత పనిచేశావే.. అన్నయ్య ఆగ్రహంతో రగిలిపోతున్నాడని అసలు విషయం తెలిస్తే ఆ ఆగ్రహ జ్వాలల్లో మనం మాడిమసై పోవాల్సి వస్తుందని భువనతో అంటుంది. మీ పరువు తీసినవాళ్లని అంత సులభంగా వదిలిపెట్టనని, వాళ్లు ఎవరైనా? ఎక్కడున్నా? ఎంతటి వాళ్లైనా? మీ కాళ్ల దగ్గర పడేస్తానని బలరామ్‌కి మాటిస్తాడు పార్ధు.

ఆ వెంటనే భువనని పక్కకి తీసుకొచ్చి మండిపడుతుంది శాంభవి. నువ్వు ఆ పెళ్లి ఆపడానికి చేసిన ప్రయత్నం , ఇప్పుడు మన ప్రాణాల మీదకి వచ్చిందని అంటుంది. నీ వల్లే మా అన్నయ్య పోలీస్ స్టేషన్‌కి వెళ్లే పరిస్ధితి వచ్చిందని తెలిస్తే నిన్ను, నన్ను ప్రాణాలతో ఉండనివ్వరని హెచ్చరిస్తుంది. ఈ మాత్రం దానికే చంపేస్తారా? అని తల్లిని అడుగుతుంది భువన. చంపకపోవచ్చేమో కానీ ఉండటానికి నిలువ నీడ లేకుండా చేస్తారని హెచ్చరిస్తుంది.

ఈ పెళ్లి ఆగిపోయిందని, తన జీవితం నాశనమైపోయిందని భానుమతి ఎంత బాధపడుతుందోనని బలరామ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సూరి వచ్చి ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా బాధపడుతుందని అంటాడు. మంచి టైం చూసి ఇంట్లో పెళ్లి విషయం మాట్లాడితే సరిపోతుందని సలహా ఇస్తాడు సూరి. అటు కోటి కూడా మళ్లీ పెళ్లి జరిగేలా చూడాలని ప్రమీల, కుమారిలతో చెబుతాడు. ఆ మాటలతో భానుమతి షాక్ అవుతుంది. ఆ బలరామ్ కాళ్ల మీద పడైనా సరే మళ్లీ ఈ పెళ్లి జరిగేలా చేస్తానని చెబుతాడు. తాగితే కాస్త ధైర్యం వస్తుందని కొడుక్కి డబ్బులు ఇస్తుంది కుమారి. దాంతో ప్రమీల మండిపడుతుంది. బలరామ్ రెడీ అయి బయటికి వచ్చి నవ్వుతూ కనిపించడంతో పార్ధు సంతోషిస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X