Bhanumathi April 1st Episode: బలరామ్ ఇంట్లో పెళ్లి సందడి.. రగిలిపోతోన్న శాంభవి, పార్ధు కారులో భానుమతి
విశ్వనాథం ఇంట్లోకి వెళ్తున్న ప్రమీల - కోటిలకు శక్తి ఎదురొచ్చి పాత విషయాలు మనసులో పెట్టుకోవద్దని బంధుత్వం కలుపుకుంటున్నామని చెబుతుంది. పంతులు గారిని పిలిపించి పార్ధు - భానుమతిల పెళ్లికి ముహూర్తం పెట్టించినట్లు ప్రమీల - కోటిలకు చెబుతాడు బలరామ్. ఈ మాటలు వినగానే వారిద్దరూ సంబరపడిపోతుంటారు. మన ఇంటి పనిమనిషిగా కూడా పనికిరాని భానుమతికి ఈ ఇంటి కోడలి పోస్ట్ ఇస్తున్నారంటూ భువన రగిలిపోతుంది.
పనిమనిషిపై కన్నేసిన కొడుకుని మందలిస్తుంది శక్తి. ఇంతలో భానుమతి ఇచ్చిన కాగితం పట్టుకుని శక్తి దగ్గరికి వస్తాడు పార్ధు . తనకు కాబోయే భార్య నగలు అడిగిందని వాటిని కొని తీసుకొస్తానని నువ్వే భానుమతికి ఇవ్వమని అడుగుతాడు పార్దు. దానికి శక్తి సరేనని చెప్పి.. పార్ధుని, భానుమతిని గ్రిప్‌లో పెట్టుకోవడానికి తనకు అవకాశం వచ్చిందని అనుకుంటుంది. తండ్రికి కనిపించకుండా చదువుకుంటున్న భానుమతి కుమారికి భయపడి పుస్తకాలు దాచేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్ 20లో ఏం జరిగిందంటే?

భానుమతి ఇంట్లో అందరూ భోజనం చేస్తుండగా పెళ్లి పనులు మొదలుపెట్టాలని కోటితో అంటుంది కుమారి. త్వరలోనే శుభలేఖలు ప్రింట్ చేయించి ఊరందరికీ పంచిపెడతానని అంటాడు కోటి. ఇక మిగిలిన ఖర్చులన్నీ వాళ్లే చూసుకుంటారని.. కలిగినోళ్లు మన చేత ఎందుకు ఖర్చు పెట్టిస్తారని చెబుతాడు. తండ్రి మాటలు విన్న భానుమతి - వసులు నవ్వుకుంటారు. ఆగిపోయిన పెళ్లి గురించి తెలియక నాన్న ప్లాన్లు వేస్తున్నాడని భానుతో అంటుంది వసు. నాకు పెళ్లి ఇష్టం లేదన్న సంగతిని జీపు అబ్బాయి వాళ్లింట్లో చెప్పే ఉంటాడని అనుకుంటుంది భానుమతి. వీళ్లంతా ఈపాటికి పెళ్లి క్యాన్సిల్ చేసి ఉంటారని అనుకుంటుంది.
ఉదయాన్నే విశ్వనాథం ఇంట్లో అంతా మాట్లాడుకుంటూ ఉండగా శారద .. పసుపు కొట్టడానికి రోళ్లు, రోకల్లు ఇతర కావల్సిన ఏర్పాట్లు చేస్తుంది. నీ పెళ్లాం ఎంత హడావుడి చేస్తుందో చూశావా అని అంటుంది విశ్వనాథం భార్య. పార్ధు పెళ్లి అనగానే నీకు చెయ్యి ఆగడం లేదు, కాలు నిలవడం లేదని అంటుంది. కొడుకు పెళ్లంటే ఏ తల్లికి ఆ మాత్రం ఆరాటం ఉండదని అంటాడు విశ్వనాథం. పార్ధు పుట్టినరోజంటేనే తెగ హడావుడి చేస్తుందని, ఇక పెళ్లంటే ఈ మాత్రం హడావుడి ఉంటుందని అంటాడు బలరామ్. వారి మాటలు విన్న భువన, శాంభవి రగిలిపోతుంటారు.
నాకు, పార్ధు బావకి జరగాల్సిన కార్యక్రమాలను ఓ ప్రేక్షకురాలిలా చూడాల్సి వస్తోందని తల్లితో అంటుంది భువన. ఆఖరి నిమిషంలోనూ మనకి అవకాశం రావొచ్చు.. ఏ చిన్న సందర్భమైనా మనకు అనువుగా మారొచ్చని అంటుంది. ఆ అవకాశం కోసం మనం ఎదురుచూడాలని కూతురికి చెబుతుంది శాంభవి. ఆవేశంగా ఏం చేసినా మొదటికే మోసం వస్తుందని భయపడుతుంది. పెళ్లి పనులు మొదలైనా శాంభవి అత్తలో ఏ టెన్షన్ లేదని శక్తిని అడుగుతుంది చిత్ర. శాంభవి గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నాయని అవి మన కంటికి కనిపించడం లేదని అంటుంది శక్తి.
పెళ్లి ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందని కూతురి కోసం ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర పన్నుతుందని అంటుంది. శాంభవి వేసే ప్లాన్లని తిప్పికొట్టడానికి మనం ఉన్నాం కదా అని చెబుతుంది. భానుమతే మన కుటుంబానికి కోడలిగా రావాలని, ఆ తర్వాత అందరినీ నా చెప్పుచేతల్లో పెట్టుకుని వ్యూహరచన చేయాలని అంటుంది. తర్వాత శారద దగ్గరికి వెళ్లి పెళ్లి బట్టలు, నగల కోసం షాపింగ్ చేయాలి కదా ఎప్పుడు వెళ్దామని అడుగుతుంది. సేట్‌కి చెప్పానని ఆయను అన్నింటిని తీసుకుని వస్తానని చెప్పారని బలరామ్ చెబుతాడు.
ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న భానుమతిని గొప్ప కుటుంబానికి కోడలిగా వెళ్లబోతున్నావంటూ పొగుడుతారు. వీళ్లకి పెళ్లి ఆగిపోయిన సంగతి తెలియదని, నా అదృష్టం కంటే నా భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నానని వీళ్లకి అర్ధం కాదని అనుకుంటుంది. కారులో వెళ్తూ భానుమతిని చూస్తాడు పార్ధు. ఇంటి దగ్గర దించుతానని చెప్పడంతో ఆమె కూడా సరేనని అంటుంది. పెళ్లి ఇష్టం లేదని చెప్పినా జీపు అబ్బాయి ఇంత కూల్‌గా ఉన్నాడేంటీ అనుకుంటుంది భానుమతి. నేనిచ్చిన పేపర్ చూశారా లేదా అని అడుగుతుంది. నేను చూశానని పార్ధు చెప్పగా.. మీరేం ఫీల్ అవ్వలేదా అని అడుగుతుంది.
నేను మా పిన్నితో చెప్పానని, ఆమె మా నాన్నతో మాట్లాడతానని కూడా చెప్పిందని అంటాడు. ఈ పెళ్లి సమస్య ఇంత త్వరగా తీరిపోతుందని నేను అస్సలు అనుకోలేదని సంతోషిస్తుంది భానుమతి. ఇంట్లో వాళ్లు అర్ధం చేసుకోకపోయినా , పరాయివాళ్లు నన్ను అర్ధం చేసుకున్నారని అనుకుంటుంది. మీరు చాలా మంచి వారని, మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకీ మీ మీద గౌరవం పెరుగుతుందని అంటుంది భానుమతి. ఇంటి దగ్గర భానుమతిని దించడానికి వచ్చిన పార్ధుని చూసి కోటి, ప్రమీల సంతోషిస్తారు. కానీ కోటికి అనుమానం వస్తుంది.
జీపు అబ్బాయి చాలా మంచోడని.. నేను పెళ్లి ఇష్టం లేదని చెప్పినా ఒక్క మాట కూడా అనలేదని వసుతో అంటుంది భానుమతి. పెళ్లి ఇష్టం లేదని పార్ధుకి భానుమతి చెప్పిందేమోనని కుమారి, కోటి మాట్లాడుకుంటూ ఉంటారు. భాను కూడా ఇష్టపడి ఈ పెళ్లి చేసుకుంటే తనకు ఇంక ఏ దిగులు ఉండదని దేవుడికి దండం పెట్టుకుంటుంది ప్రమీల. ఇంట్లో పెళ్లి బట్టలు, నగలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది బలరామ్ ఫ్యామిలీ. శాంభవి, భువనలు ఇదంతా చూస్తూ రగిలిపోతారు. వాళ్లని తీసుకుని వస్తానని చెప్పి శారద మాట్లాడుతుంది. పార్ధు- భానుమతిల పెళ్లి జరుగుతుందని ఈ విషయానికి మీరు కూడా అలవాటు పడాలని నచ్చచెబుతుంది.
పార్ధు, సూరి బయటికి వెళ్తుండగా శారద పిలుస్తుంది. ఆ మాటలతో రగిలిపోయిన పార్ధు.. పెళ్లి బట్టల వంక పెట్టుకుని ఇలా అనవసరమైన పిలుపులు పిలవొద్దని అంటాడు పార్ధు. ఆ మాటలతో శారద బాధపడుతుంది. ఇంతలో శక్తి జోక్యం చేసుకుని భానుమతికి బట్టలు, నగలు సెలెక్ట్ చేయమని పార్ధుని అడుగుతుంది. దాంతో చీరలు, నగలు చూసి సెలెక్ట్ చేస్తాడు పార్ధు. అలాగే కొంత డబ్బు కూడా తీసుకెళ్లి భానుమతి కుటుంబానికి ఇవ్వమని శక్తికి చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











