Bhanumathi April 21st Episode : ప్రమీల ఆత్మహత్యాయత్నం.. తల్లి కోసం పెళ్లికి తలవంచిన భానుమతి

తాను ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆగేలా కనిపించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతానని వసుతో చెబుతుంది భానుమతి. అక్క వెళ్లిపోతుండటంతో వసు కుమిలిపోతుంది. ఎక్కడికి వెళ్తావని అడగ్గా మా ప్రిన్సిపాల్ గారింటికి అని చెబుతుంది. తనకు ఇంతటి అవమానం కలిగించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని రగిలిపోతుంటాడు బలరామ్. దీంతో శారద అతనిని ఓదారుస్తుంది. ఉదయాన్నే భానుమతితో మాట్లాడాలని కోటికి పార్ధు ఫోన్ చేయడంతో కూతురిని భయపెట్టి మాట్లాడిస్తాడు.

నువ్వు ఫోన్ చేసిన విషయం అన్నయ్యకి తెలిస్తే మన జీవితాలు రోడ్డున పడతాయని భువనతో అంటుంది శాంభవి. నీ కూతురు అంత అమాయకురాలు కాదని, ఆ ఎస్ఐకి నా ఫోన్‌తో కాకుండా ఎవడో దారినపోయే దానయ్య మొబైల్ నుంచి ఫోన్ చేశానని చెబుతుంది భువన. ఎందుకంత భయపడతావ్.. చంపేస్తారా అంటూ తల్లిని ఎదురు ప్రశ్నిస్తుంది.

అర్ధరాత్రి వరకు తిరిగొస్తున్న పార్ధుని ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు బలరామ్. మీకు ఫోన్ చేసిన ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కునే పనిలో ఉన్నానని చెబుతాడు పార్ధు. ఇంట్లో పోయిన ఆనందం, సంతోషం తిరిగి రావాలంటే తిరిగి పార్ధు పెళ్లి పనులు మొదలు కావాలని కుటుంబ సభ్యులతో చెబుతాడు బలరామ్. తండ్రి మాటలతో సంతోషిస్తున్న పార్ధుని చూసి నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరుగుతుందని ఆనందంగా ఉందా? అని అడగటంతో అనవసరంగా నాతో మాట్లాడొద్దని శారదపై కోప్పడతాడు పార్ధు. కొడుకు మాటలతో శారద, బలరామ్‌లు ఎంతో బాధపడతారు. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 21వ తేదీ ఎపిసోడ్ 37లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 21st 2025 Episode 37 Here is Today s full story

వీడియో జరగాలని పెదనాన్న పరువు తీసి ప్రపంచానికి చూపిస్తే మళ్లీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాడేంటీ అని శక్తిని అడుగుతుంది చిత్ర. మనం చేసిన డ్యామేజీకి పెదనాన్న తలెత్తుకోలేని పరిస్ధితులు వచ్చాయని , కానీ ఇంకొన్ని రోజులు ఈ పెళ్లి మాటలు ఎత్తడేమో అనుకున్నానని అంటాడు చరణ్. ఆ అవమానం చల్లారకుండా మనం అప్పుడప్పుడు విసురుతూనే ఉంటామని అంటుంది శక్తి. ఆ పరువు తక్కువ కుటుంబం నుంచి భానుమతే ఈ ఇంటి కోడలిగా అవ్వాలని అంటుంది శక్తి. పార్ధుతో సహా అందరినీ నా చెప్పుచేతల్లోకి లాక్కోవాలని అంటుంది .

అందరూ నిద్రపోయాక భానుమతి దగ్గరికి వెళ్తుంది వసు. ఇంకోసారి ఆలోచించమని అడగటంతో ఈ సమస్యకి ఇంకో పరిష్కారం లేదు కాబట్టే పారిపోవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. భానుమతి. అర్ధం చేసుకోవడం లేదు కాబట్టే అందరికీ దూరమవుతున్నానని అంటుంది. నువ్వు కోరుకున్న జీవితం కోసం నువ్వు వెళ్లిపోతున్నావ్ మంచిదే అంటుంది వసు. బ్యాగ్ సర్దుకుంటూ వసుని హత్తుకుంటుంది భానుమతి. బయటికి వెళ్తూ హాల్‌లో పడుకున్న తల్లి పాదాలకు నమస్కరిస్తుంది.

నా జీవితం కోసం నువ్వెన్నో కలలు కన్నావ్.. నేను చేస్తున్నది తప్పోఒప్పో నాకు తెలియడం లేదు, కానీ నాకొక గొప్ప భవిష్యత్తు దొరుకుతుందన్న నమ్మకంతో వెళ్లిపోతున్నానని క్షమించమని తల్లిని చూస్తూ బాధపడుతుంది భానుమతి. ఇంట్లో వాళ్లు ఎవ్వరూ చూడకుండా అక్కని జాగ్రత్తగా గేటు దగ్గరికి తీసుకొస్తుంది వసు. గేటు దగ్గర చెల్లెల్ని హత్తుకుంటుంది భానుమతి. చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక నడుస్తున్న భానుమతికి రోడ్డుపై కొందరు తాగుబోతులు కనిపిస్తారు. వాళ్లని చూసి ఆమె భయపడి పరిగెడుతుంది. ఇంతలో రోడ్డుపై ఎవరో తాగుబోతు పడిపోవడం గమనించి అతను కోటి అని గుర్తుపట్టి టెన్షన్ పడుతుంది.

రోడ్డుపై పడిఉన్న నాన్నని ఇంటికి తీసుకెళ్లాలా? లేదా? అని ఆలోచిస్తుండగా ఓ లారీ రావడంతో భానుమతి టెన్షన్ పడుతుంది. నాన్నని అక్కడే వదిలేస్తే ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని భయపడి కోటిని లేపి ఇంటికి తీసుకెళ్తుంది. పడిన ముందడుగు మళ్లీ వెనక్కి పడుతుందని, నేను వెళ్లాల్సిన దారి మారుతుందని బాధపడుతుంది భానుమతి. అర్ధరాత్రి కోటి అరుపులు విన్న ప్రమీల, కుమారిలు ఉలిక్కిపడి నిద్రలేస్తారు. భాను చేతిలో బ్యాగ్ కనిపించడంతో ప్రమీల, కుమారిలు షాక్ అవుతారు.

నీ మీద నాకు ముందు నుంచి అనుమానమే.. ఏమీ తెలియనట్లు నటిస్తూనే మాకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోదామని అనుకున్నావా అని ప్రశ్నిస్తుంది కుమారి. ఇంట్లో నుంచి పారిపోదామని అనుకున్నావ్ కదూ అని అంటుంది. భానుమతిని ఏదో ఒకటి చేస్తుందని భయపడ్డ ప్రమీల .. కోటిని లోపలికి తీసుకెళ్తుండగా కుమారి ఆపి ముఖాన నీళ్లు కొడుతుంది. దాంతో ఉలిక్కిపడ్డ కోటి ఏం చేస్తున్నావ్ అంటూ తల్లిపై కోప్పడతాడు. నువ్వేమో తప్పతాగి అక్కడ ఇక్కడ పడిపోతే నీ కూతురు తప్పించుకుని పారిపోదామని అనుకుందని కుమారి చెప్పడంతో కోటికి మత్తు వదులుతుంది.

ఇది మన బతుకుల్ని బస్టాండ్‌కు ఈడ్చాలని అనుకుంటోందని అంటుంది కుమారి. దాంతో కోటి రగిలిపోతాడు. నేను చస్తానన్నా నీ కూతురికి భయం రాలేదని, నిన్ను చంపుతానన్నా నీ కూతురికి భయం రాలేదని మండిపడతాడు. ఇక నీ కూతురిని ఈ పెళ్లికి ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం.. ఈ పెళ్లి గనక జరగలేదో ఈ ఇంట్లో ఎవ్వరినీ బతకనివ్వనని అందరికీ మందుపెట్టి చంపేస్తానని ప్రమీలను కోటి బెదిరిస్తాడు. నీ జీవితం కోసం మేం ఇంత చేస్తుంటే చదువులు కావాలి, పదవులు కావాలని నువ్వు పరుగులు పెడుతుంటే నిన్ను ఎలా ఆపాలో నాకు అర్ధం కావడం లేదని అంటుంది ప్రమీల. నీ కాళ్లకి సంకెళ్లు వేయడానికి నాకు ఏ దారి దొరకడం లేదని మండిపడుతుంది.

కనీసం నేను చేస్తేనైనా నువ్వు ఆగుతావేమో? నేను చస్తానంటూ లోపలికి వెళ్తుంది ప్రమీల. తల్లిని ఆగమంటూ భానుమతి, వసులు లోపలికి పరిగెడతారు. చీరతో ధూలానికి ఉరి బిగించుకుంటున్న ప్రమీలను భానుమతి , వసులు ఆపుతారు. ఎవరో ఒకరి చావు చూస్తేకానీ మారేలా కనిపించడం లేదని అంటుంది ప్రమీల. నువ్వు చెప్పినట్లే నేను పెళ్లి చేసుకుంటానని మాటిస్తుంది భానుమతి. మీరు చెప్పినట్లే తల వంచుకుని పీటల మీద పెళ్లి చేసుకుంటానని అంటుంది. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పిచ్చిపనులు చేయనని, ఇల్లు వదిలి వెళ్లనని ప్రమాణం చేయమని అడగటంతో భానుమతి మాటిస్తుంది. ఇకపై మీరు చెప్పినట్లే వింటానని, మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటానని అంటుంది భానుమతి. కూతురి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది ప్రమీల. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X