Bhanumathi April 22nd Episode : పనిపిల్లపై కన్నేసిన చరణ్.. పేపర్‌లో భానుమతి ఫోటో, షాక్‌లో శక్తి
పెదనాన్న పరువు పోయినా మళ్లీ పెళ్లి చేస్తున్నాడేంటీ అని శక్తిని అడుగుతాడు చరణ్. దానిని మళ్లీ మళ్లీ గుర్తు చేయడానికి నేనున్నాను కదా అని అంటుంది శక్తి. పార్ధు పెళ్లి భానుమతితోనే జరగాలని, ఇంట్లో అంతా నా కాళ్లు మీద బతకాలని చెబుతుంది. ఇంట్లో అందరూ నిద్రపోయాక వసు సాయంతో భానుమతి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. గేటు దాటే ముందు వసుని హత్తుకుని బాధపడుతుంది.
భానుమతి బయటికి రాగానే కొందరు తాగుబోతులు ఆమె వంక అదోలా చూడటంతో పరుగులు పెడుతుంది. ఓ చోట తాగి పడివున్న వ్యక్తిని చూడగా అతను కోటి. తండ్రిని అలాగే వదిలేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనే ఆలోచన పక్కనపడేస్తుంది. తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి కుమారి, ప్రమీలలు చూసి షాక్ అవుతారు. భానుమతిని పెళ్లికి ఒప్పించకుంటే ఇంట్లో అందరినీ చంపేస్తానని కోటి వార్నింగ్ ఇస్తాడు. భానుమతి ఎంతకీ మారకపోవడంతో చచ్చిపోతానంటూ ఉరి వేసుకోబోతుంది ప్రమీల. తల్లిని కాపాడుకోవడం కోసం పెళ్లికి తలవంచుతుంది భానుమతి. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్ 38లో ఏం జరిగిందంటే?

ఇకపై నువ్వు చెప్పినట్లుగానే నీ మాట వింటానని ప్రమీలకు మాటిస్తుంది భానుమతి. కూతురి ఆశయాల్నీ చిదిమేశానని ప్రమీల ఎంతో బాధపడుతుంది. పిల్లలు ఇంట్లో గోల చేస్తుండటంతో జయంతి కోప్పడుతుంది. పిల్లలు ఉన్నచోట సందడి ఉంటుందని, అలా లేకపోతే ఇల్లు బోసి పోతుందని అంటాడు బలరామ్. కుర్చీలో దర్జాగా కూర్చొన్న కొడుకుని చూసుకుని బలరామ్ తల్లి మురిసిపోతుంది. నువ్వు ఈ కుర్చీలో కూర్చొంటే చక్రవర్తి సింహాసనం మీద కూర్చుకున్నట్లే ఉంటుందని చెబుతుంది. తల్లి మాటలతో బలరామ్ మురిసిపోతాడు. ఆ మాటలు విన్న శక్తి .. రగిలిపోతుంటుంది.
ఆ స్థానం ఆయనకి శాశ్వతం అనుకుంటున్నారని, ఏదో ఒక నాటికి ఆ స్థానం మీ నాన్నకి చెందుతుందని , ఈ ఇంటి పెత్తనం నా చేతికి చిక్కుతుందని తెలియదని చిత్రతో అంటుంది శక్తి. ఆ రోజు కూడా ఇంకా ఎంతో దూరంలో లేదని చెబుతుంది. ఇంతలో పనిమనిషి స్వాతిని పిలిచి అందరికీ కాఫీ తీసుకురమ్మని అంటుంది శారద. మేం ఇంట్లో లేకపోయేసరికి నిద్రపోతావని అనుకున్నానని.. ఇంటిని అద్దంలా ఉంచావని పనిమనిషిని మెచ్చుకుంటుంది బలరామ్ తల్లి.
స్వాతి గురించి నాకు తెలుసని, సొంతింటిలా చూసుకుంటుందని అంటుంది శారద. తనకి ఎవ్వరూ ఇది చేయాలి? అది చేయాలని చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది. ఇంతలో దుర్గ రావడంతో పెళ్లికి ఎన్నో రోజులు టైం లేదు కాబట్టి ఆ పనులన్నీ మొదలుపెట్టమని చెబుతాడు బలరామ్. ఆ మాటలు విన్న పార్ధు సంబరపడిపోతాడు. ఇంకా ఆ తాగుబోతు కూతురి గురించి పడి చచ్చిపోతున్నారని, మనింటి పనిమనిషి విలువ కూడా చేయని ఆ మనుషులతో వియ్యం ఎత్తాలని అనుకుంటున్నారని వీళ్లు ఎప్పుడు మారతారోనని శాంభవితో అంటుంది భువన. వీళ్ల మనసులు మారడానికి మనకి కూడా ఏదో ఒక సమయం ఖచ్చితంగా వస్తుందని, అప్పటిదాకా ఎదురుచూద్దామని కూతురితో చెబుతుంది శాంభవి.
తన జీవితం నాశనం కావడం, తల్లి ఉరేసుకోవడానికి సిద్ధం కావడంతో అదే ఆలోచిస్తూ బాధపడుతుంది భానుమతి. ఇంతలో వసు ఓ గులాబీ పువ్వుతో భానుమతి దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్ డే అని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. ఈరోజు నా పుట్టినరోజా అని వసుని అడుగుతుంది భానుమతి. సమస్యల్లో ఉన్నావ్ కాబట్టి నీ పుట్టినరోజు నీకు గుర్తుండటం లేదని అంటుంది. ఇంట్లో నుంచి పారిపోయి నీ దారి నువ్వు చూసుకోవాలని అనుకున్నావ్.. నాన్న మూలంగా మళ్లీ తిరిగొచ్చేశావని అంటుంది వసు. ఇక మరో దారి దొరకదని ఆలోచిస్తున్నావా అని ప్రశ్నిస్తుంది .
ఇన్ని రోజులు నేను మైనర్‌ననే రక్షణ కవచం నాకు అడ్డుగోడలా నిలబడిందని, నేను మైనర్‌ననే ఆయుధం నన్ను కాపాడిందని.. ఈరోజుతో నేను మేజర్‌ని కావడంతో ఆ అడ్డుగోడ కూలిపోయిందని బాధపడుతుంది భానుమతి. ఇంతలో కోటి వచ్చి గోల గోల చేస్తాడు. నేను తాగుబోతునని ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలని నీకూతురు అనుకుందని.. కానీ నేను ఉడుం పట్టు పడితే అడుగు కూడా బయటపెట్టదని చెబుతాడు కోటి. ఇకపై చెప్పిన మాట వింటానని , పెళ్లి చేసుకుంటానని భానుమతి మాటిచ్చిందని కోటితో చెబుతుంది ప్రమీల. ఇలాంటి ప్రమాణాలు పూటకి ఒకటి చేసిందని, ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని మండిపడతాడు కోటి.
ఇంటి పెద్ద పద్ధతిగా ఉండకపోతే ఆయన మీద ఇంట్లో వాళ్లకి గౌరవం ఎక్కడి నుంచి వస్తుందని అంటుంది ప్రమీల. తాగుబోతు .. తాగుబోతు అని తిట్టావ్, ఈరోజు ఈ తాగుబోతు వల్లే ఇంటి పరువు ఊరు దాటకుండా ఆగిందని అంటాడు కోటి. నా వల్లే కదా పోవాల్సిన నీకూతురు మళ్లీ ఇంటికి తిరిగొచ్చిందని చెబుతాడు కోటి. కూతురు చుట్టూ కంచె కట్టి ఆపడం చేతకాదు కానీ మొగుడికి మొట్టికాయలు వేస్తావా అని ప్రశ్నిస్తుంది కుమారి. భానుమతి కనుక గడప దాటినా, దాని దారి మారినా నాలో రాక్షసుడిని చూస్తావని ప్రమీలను హెచ్చరిస్తాడు కోటి.
శక్తి కొడుకు ఫోన్ మాట్లాడుతూ పనిమనిషి స్వాతి వెనుక నుంచి ముట్టుకుంటాడు. దాంతో ఆమె ఉలిక్కిపడుతుంది. ఈ ఇంట్లో నీ మీద ఇంత చనువుగా చేయి వేయగలిగింది నేనే కదా అని అంటాడు. ఇది ఎవరైనా చూస్తే ఈ ఇంట్లో పెద్ద గొడవ అవుతుందని స్వాతి భయపడటంతో ఆమెను పక్కకి తీసుకెళ్తాడు చరణ్. అనంతరం ఆమెకు ముద్దు పెట్టుకోబోతుండటంతో స్వాతి పక్కకి నెట్టేస్తుంది . పార్ధు బాబు పెళ్లి అవ్వగానే మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడతారా? అని స్వాతి ప్రశ్నిస్తుంది. ఇంతలో శక్తి మాటలు వినిపించడంతో చరణ్, స్వాతిలు భయపడతారు.
మళ్లీ వెధవ వేషాలు వేస్తున్నావా అని చరణ్‌పై మండిపడుతుంది శక్తి. ఇక నుంచి పెళ్లి పనుల్లో ప్రతి ఒక్కరికి సాయం చేయమని చెబుతుంది. ఇంతలో శాంభవి వచ్చి నా సహాయం కావాలని అడుగుతుంది. పార్ధుతో పెళ్లి చేయమని నా కూతురు కోరుకుందని, కానీ దానిని కూడా తీర్చలేకపోతున్నానని బాధపడుతుంది. నువ్వు తలచుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెబుతుంది. దాంతో శాంభవికి మాటిచ్చినట్లుగా నటిస్తుంది శక్తి. పార్ధు- భానుమతిల పెళ్లి జరిగి తీరాలని అంటుంది శక్తి.
ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన శక్తికి భానుమతి ఫోటో పేపర్‌లో కనిపిస్తుంది. పెళ్లి బట్టల్లోనే పెళ్లికి హాజరైన నవవధువు అని ఓ ఆర్టికల్ కనిపించడంతో దానిని చదువుతూ షాక్ అవుతుంది . ఇది బావగారు చూస్తే పెళ్లి ఆగిపోతుందని శక్తి భయపడుతుంది. ఇంతలో బలరామ్ వచ్చి ఎందుకలా ఉన్నావ్ అని అడుగుతాడు. ఆ న్యూస్ పేపర్ ఒకసారి ఇవ్వమని చూస్తుంటాడు బలరామ్. ఇంతలో శారద రావడంతో బలరామ్ పేపర్ పక్కన పడేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











