Bhanumathi April 23rd Episode : భానుమతిని కాపాడిన శక్తి .. కోటి ఉగ్రరూపం, భానుకి పార్ధు సర్‌ప్రైజ్

ఇకపై నువ్వు చెప్పినట్లుగానే వింటానని తల్లికి మాటిస్తుంది భానుమతి. మధురపూడి నుంచి బలరామ్ కుటుంబం తన ఇంటికి తిరిగొస్తుంది. కుర్చీలో బలరామ్‌ను చూసుకుని అతని తల్లి మురిసిపోతుంది. ఇల్లంతా శుభ్రంగా ఉంచిన పనిమనిషి స్వాతిని అంతా మెచ్చుకుంటూ ఉంటారు. బలరామ్ కుర్చీ త్వరలో నా సొంతం కాబోతుందని చిత్ర, చరణ్‌లతో అంటుంది శక్తి. పార్ధు - భానుమతిల పెళ్లికి ఏర్పాట్లు మొదలుపెట్టాలని దుర్గకి చెబుతాడు బలరామ్.

ఏడుస్తున్న భానుమతి దగ్గరికి వసు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. ఇన్నాళ్లు నేను మైనర్‌ననే రక్షణ కవచం ఈరోజుతో తొలగిపోయిందని బాధపడుతుంది భానుమతి. ఇంతలో కోటి వచ్చి భానుమతిని ఇకపై ఇల్లు దాటకుండా చూసుకోవాలని ప్రమీలకి వార్నింగ్ ఇస్తాడు. ఆరుబయట బట్టలు ఆరేస్తున్న పనిమనిషి స్వాతిని వెనుక నుంచి ముట్టుకుంటాడు చరణ్. మనిద్దరి విషయం ఇంట్లో చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించమని అడుగుతుంది స్వాతి. భువన - పార్ధుల పెళ్లికి సాయం చేయమని శక్తిని అడుగుతుంది శాంభవి. లోపలికి వస్తూ భానుమతి ఫోటో పేపర్‌లో పడటాన్ని చూసిన శక్తి, ఈ విషయం బలరామ్ చూడకుండా చేయాలని అనుకుంటుంది. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్ 39లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 23rd 2025 Episode 39 Here is Today s full story

పేపర్‌లో భానుమతి ఉన్న ఫోటోను బలరామ్ చూస్తుండగా శారద వచ్చి ఫోన్ ఇవ్వడంతో అతను పక్కకి వెళ్లిపోతాడు. దాంతో శక్తి ఊపిరి పీల్చుకుంటుంది. నీ మీద నాన్నకి రోజురోజుకు నమ్మకం తగ్గిపోతుందని, నిఘా పెరుగుతోందని ఇప్పుడేం చేస్తావని అడుగుతుంది వసు. అమ్మ చెప్పినట్లు వింటానని ప్రమాణం చేశానని , అది నా కాళ్లకి సంకెళ్లుగా మారిందని చెబుతుంది భానుమతి. అంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధపడినట్లేనా? ఇక నీ ఆశయం గురించి నువ్వు మరిచిపోయినట్లేనా? అని ప్రశ్నిస్తుంది వసు.

అమ్మకి చేసిన ప్రమాణం కింద నా ఆశయం నలిగిపోవాలని రాసుందేమోనని బాధపడుతుంది. ఇంతలో కోటికి పార్ధు ఫోన్ చేయడంతో భానుమతిని పిలిచి ఫోన్‌లో మాట్లాడమని చెబుతాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశానని పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు పార్ధు. నేను ఎప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతానా? అని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు పార్ధు. నీ వయసే ఇప్పటి వరకు మనిద్దరి మధ్య అడ్డుగా మారిందని.. ఈ పుట్టినరోజుతో ఆ అడ్డుగీత తొలగిపోయిందని, నువ్వు మేజర్‌వి అయిపోయినట్లేనని అంటాడు. ఆ మాటలతో భానుమతి బాధపడుతుంది.

ఆ వెంటనే కోటి ఫోన్ లాక్కొని.. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని, మీ ఇంట్లో అడుగుపెడతానా అని నా కూతురు ఎదురుచూస్తోందని చెబుతాడు. బస్సు అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పావు కదా సంతోషమేనా? అని అడుగుతాడు సూరి. సంతోషమే కానీ సంతృప్తిగా లేనని అంటాడు పార్ధు. నాకు బస్సు అమ్మాయి పరిచయం అయ్యాక నా మొదటి పుట్టినరోజు ఇదేనని.. ఇంకేదో చేయాలని అనుకుంటూ ఉంటాడు పార్ధు.

కోటి కోసం శక్తి ఎదురుచూస్తుంటుంది. ఎందుకు పిలిపించారని కోటి అడుగుతాడు. మీ కూతురిని పెళ్లికి ఒప్పించినట్లుగా ఉన్నారు కానీ.. నిజంగా పెళ్లి చేసుకోవాలన్న ఆశ, ఆరాటం తనలో కలిగించలేకపోయారని అంటుంది శక్తి. ఆ మాటలతో కోటి షాక్ అవుతాడు. అలాంటిదేమీ లేదని, పెళ్లి ఆగిపోయేసరికి తను ఎంతో బాధపడిందని చెబుతాడు . దాంతో శక్తి పేపర్‌లో పడిన భానుమతి ఫోటోను చూపించడంతో కోటి షాక్ అవుతాడు. పెళ్లి చెడిపోయాక భానుమతి ఎగ్జామ్ రాయడానికి వెళ్లేటప్పుడు ఈ న్యూస్‌ని పేపర్ వాళ్లు వేశారని చెబుతుంది శక్తి.

పెళ్లి చెడిపోయిన అమ్మాయి బాధపడుతూ ఓ మూలన కూర్చొంటుందని కానీ నీ కూతురు పరీక్ష రాసే అవకాశం వచ్చిందని ఎగురుకుంటూ వెళ్లి పరీక్ష రాసిందని చెబుతుంది. అసలు ఈ విషయం గురించి నాకు తెలియదని కోటి చెప్పగా.. ఇదంతా చూస్తుంటే పరీక్ష రాయడానికి నీ కూతురే పెళ్లి చెడగొట్టిందని నాకు అనిపిస్తోందని అంటుంది శక్తి. ఆ మాటలతో కోటి షాక్ అవుతాడు. దానికి పెళ్లంటే ఇష్టం లేదని, కానీ ఇంత పనిచేసే ధైర్యం లేదని చెబుతాడు కోటి. ఈ పేపర్‌లో న్యూస్‌ని బట్టి భానుమతికి ఇంకా చదువుకోవాలన్న ఆశ చావలేదని అంటుంది శక్తి.

ఈ సంగతి మా ఇంట్లో తెలిస్తే అక్కడికక్కడే ఈ పెళ్లి ఆగిపోతుందని , ఈ న్యూస్ మా బావగారు చూడలేదు కాబట్టి సరిపోయిందని .. అదే చూసుంటే ఈ పెళ్లి ఆగిపోయిందనే ఫోన్ కాల్ మీ ఇంటికి వచ్చేదని అంటుంది శక్తి. ఇకపై భానుమతి ఎలాంటి తప్పు చేయదని నేను చూసుకుంటానని అంటాడు కోటి. శక్తి వెళ్లగానే కోటి కోపంతో రగిలిపోతాడు. నా కొడుక్కి చికెన్ వండకుండా ఈ కాకరకాయ కూరేంటీ అని ప్రమీలపై మండిపడుతుంది కుమారి. ఇంతలో కోటి తప్పతాగి వచ్చి భానుమతిని పిలుస్తాడు. ఏమైందిరా నీకు మందు ఎక్కువైందా అని అడగ్గా.. ముందు నిన్ను వేసేయాలని అంటాడు.

పెళ్లి చెడిపోయిన రోజున భానుమతిని ఇంటి గడప దాటనీయొద్దని చెప్పానా? అని అడుగుతాడు కోటి. అది బయటికి వెళ్లలేదని కుమారి చెప్పగా.. భాను బయటికెళ్లి పరీక్ష రాసొచ్చిందని చెబుతాడు కోటి. ఆ మాటలతో భానుమతి , వసులు షాక్ అవుతారు. నువ్వు ఆరోజు పరీక్ష రాయడానికే పెళ్లి ఆపేశావ్ కదా అని అడుగుతాడు కోటి. నీ స్వార్ధం కోసం పోలీసులకు ఫోన్ చేసి బలరామ్ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చావ్ కదా అని ప్రశ్నిస్తాడు. ఇంట్లో వాళ్లు నమ్మకపోవడంతో పేపర్‌లో పడిన భానుమతి ఫోటోను చూపిస్తాడు కోటి. ఇంతలో పార్ధు రావడంతో భానుమతి ఫ్యామిలీ షాక్ అవుతుంది.

ఆడపిల్లలతో ఇలాగేనా మాట్లాడేది? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని అంటాడు పార్ధు. ఈరోజు భానుమతి పుట్టినరోజు కావడంతో తనకి ఓ బహుమతి ఇవ్వడానికి వచ్చినట్లు చెబుతాడు. ఏం తీసుకొచ్చావ్ అని అందరూ అడగ్గా గిఫ్ట్ ఇస్తాడు. నీకోసం చీర తీసుకొచ్చానని దీనిని కట్టుకొస్తే ఇంకో సర్‌ప్రైజ్ ఉందని చెబుతాడు పార్ధు. నా వల్ల ఆ కుటుంబానికి అన్యాయం జరిగిందని జీప్పు అబ్బాయికి నిజం చెప్పేస్తానని వసుతో అంటుంది భానుమతి. పెళ్లి చేసుకుని వాళ్లింటికి వెళితే రోజురోజుకు ఆ నిజం నా గుండెల్లో బరువుగా మారుతుందని అంటుంది. అందుకే ఇప్పుడే నిజం చెప్పేస్తానని అంటుంది భానుమతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X