Bhanumathi April 24th Episode : భానుమతికి పార్ధు సర్‌ప్రైజ్.. నిజం తెలుసుకున్న పార్ధు, వణికిపోయిన భువన

పేపర్‌లో పడిన భానుమతి ఫోటో బలరామ్ చూడకుండా జాగ్రత్త పడుతుంది శక్తి. వెంటనే కోటికి ఫోన్ చేసి ఓ చోటికి రమ్మని చెప్పి పేపర్ చూపిస్తుంది. దాంతో కోటి షాక్ అవుతాడు. పెళ్లి ఆగిపోయిన ఆడపిల్ల ఓ మూలన కూర్చొని ఏడుస్తుందని కానీ పరీక్ష రాయడానికి వెళ్లదని అంటుంది. ఇదంతా చూస్తుంటే పరీక్ష రాయడానికి మీ అమ్మాయే పెళ్లిని చెడగొట్టిందా అని కోటిని ప్రశ్నిస్తుంది శక్తి. దానికి పెళ్ళి ఇష్టం లేని మాట నిజమేనని.. కానీ పోలీసులకు ఫోన్ చేసేంత ధైర్యం లేదని చెబుతాడు కోటి. ఇకనైనా మీ కూతురికి నచ్చచెప్పమని , లేదంటే పెళ్లి ఆగిపోతుందని హెచ్చరిస్తుంది శక్తి.

అన్నిదారులు మూసుకుపోవడంతో పెళ్లిని ఎలా ఆపాలో తెలియక బాధపడుతుంటారు వసు, భానుమతి. ఇంతలో కోటి పీకలదాకా తాగి ఇంటికి వస్తాడు. పెళ్లి ఆగిపోయిన తర్వాత నీ కూతురు పరీక్ష రాయడానికి వెళ్లిందని ప్రమీలకి పేపర్ చూపించడంతో వసు, భానుమతిలు వణికిపోతారు. ఈ పెళ్లి ఆపింది? పోలీసులకు ఫోన్ చేసింది నువ్వేనని తెలిస్తే బలరామ్ వదిలిపెట్టడని వార్నింగ్ ఇస్తాడు కోటి. ఇంతలో పార్ధు వచ్చి భానుమతికి బర్త్ డే గిఫ్ట్ ఇస్తాడు. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్ 40లో ఏం జరిగిందంటే?

Bhanumathi Serial April 24th 2025 Episode 40 Here is Today s full story

భానుమతికి ఇచ్చిన చీర కట్టుకుని రమ్మని పార్ధు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో చీర కట్టుకుని వచ్చిన భానుమతిని చూసి మురిసిపోతాడు పార్ధు. చీరలో చాలా బాగున్నావని ఆమెను మెచ్చుకుంటాడు పార్ధు. ఇంతలా అభిమానించొద్దని నేను చెప్పిన మాట విన్నాక నేనంటే అసహ్యాం కలగొచ్చని మనసులో అనుకుంటుంది భానుమతి. బస్సు అమ్మాయి నీకొక సర్‌ప్రైజ్ అని చెప్పి భానుమతి కళ్లు మూసి బయటికి తీసుకెళ్తాడు పార్ధు. బయటికొచ్చాక కళ్లు తెరిచి చూసేసరికి తన పుట్టినరోజు ఏర్పాట్లు గ్రాండ్‌గా చేసి ఉండటం చూసి భానుమతి షాక్ అవుతుంది.

నచ్చిందా అని భానుమతిని అడగ్గా.. ఇదంతా ఎందుకని పార్ధుని ఆమె ప్రశ్నిస్తుంది. మనిద్దరికీ పరిచయం అయ్యాక ఇది నీ మొదటి పుట్టినరోజని , నా ప్రేమను ఇలా చూపించాలని అనుకున్నానని అంటాడు పార్ధు. జీపు అబ్బాయి నా మీద చాలా ప్రేమ పెంచుకుంటున్నాడని, ఇప్పుడే జరిగినదంతా చెప్పడం మంచిదని అనుకుంటుంది భానుమతి. నా మనసులోనే దాచుకున్న ఒక విషయాన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నానని అంటుంది భానుమతి. పెళ్లికి ముందు కొన్నైనా అందమైన జ్ఞాపకాలు ఉంటే బాగుంటుందని అంటాడు పార్ధు. పెళ్లయ్యాక ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుని మురిసిపోదామని చెబుతాడు.

భానుమతి నిజం చెప్పబోతుండగా కోటి రావడంతో ఆగిపోతుంది. పుట్టినరోజు ఏర్పాట్లు చూసి కోటి కుటుంబం షాక్ అవుతుంది. భానుమతితో దగ్గరుండి కేక్ కట్ చేయించి ఆమెకు తినిపిస్తాడు పార్ధు. నువ్వు కూడా మా పార్ధుకి కేక్ తినిపించమని సూరి చెప్పడంతో అతనికి తినిపిస్తుంది. దాంతో ప్రమీల సంబరపడిపోతుంది. నువ్వు ఈ పుట్టినరోజుని ఎంతకాలం గుర్తుపెట్టుకుంటావో నాకు తెలియదని భానుమతితో అంటాడు. అందరూ హ్యాపీగా ఉండగా పార్ధుకి ఫోన్ వస్తుంది.

పెళ్లి రోజు పోలీసులకి ఎవరు ఫోన్ చేశారో తెలిసిందా అని గట్టిగా అనడంతో కోటి ఫ్యామిలీ వణికిపోతుంది. నేను ఇప్పుడే వస్తున్నానని బయల్దేరతాడు. ఏం జరిగిందని కోటి అడగ్గా.. పెళ్లి రోజు అంత కుట్ర చేసిందెవరో తెలుస్తుందని, ఒక్కసారి వాళ్లెవరో తెలియాలి , వాళ్ల అంతు చూస్తానని కోపంగా బయల్దేరతాడు పార్ధు. అంతా సర్వనాశనం అయిపోయిందని కోటి బాధపడతాడు. భానుమతి వల్లే పెళ్లి ఆగిపోయిందని వాళ్లకి తెలిస్తే ఏమైనా ఉందా? మనందరినీ ఉప్పు పాతర వేస్తారని బాధపడతాడు.

ఇంతలో పార్ధు ఓ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ రోజు పెళ్లి ఆపిందెవరో తెలుసుకున్నారా అని అడుగుతాడు. ఆమె ఎవరో తెలిసిపోయిందని అంటాడు ఆ వ్యక్తి. ఆ రోజు పోలీసులకు ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో తెలిసిందని.. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియదని చెబుతాడు . ఆ ఫోన్ నెంబర్ దొరికింది కదా? ఈ ఆధారం చాలు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటానని? నా తండ్రికి జరిగిన అవమానం, ఆయన అనుభవించిన మనోవేదన వాళ్లకి కూడా జరిగేలా చేస్తానని కోపంతో ఊగిపోతాడు పార్ధు. అనంతరం ఆ నెంబర్‌ను పార్ధుకి ఇస్తాడు ఆ వ్యక్తి. నెంబర్ దొరకడం కష్టం కానీ, నెంబర్ దొరికాక ఆ మనిషి ఎవరో కనిపెట్టడం పెద్ద కష్టం కాదని అంటాడు పార్ధు.

కావ్య కోపం చూసి వణికిపోతాడు కోటి. ఇంతలో గేటుని బలంగా తన్నిన పార్ధు.. రేయ్ కోటి అని కోపంగా పిలుస్తాడు. ఆ మాటలతో కోటి వణికిపోతాడు. ఇంట్లో వస్తువులన్నీ కిందపడేస్తాడు పార్ధు. మావయ్య గారని చాలా పద్ధతిగా పిలిచేవాడని, ఇప్పుడు రారా పోరా అని అంత కోపంగా పిలుస్తున్నాడేంటీ అని భయపడతాడు కోటి.ఏమైంది అల్లుడుగారు అని కోటి అడగ్గా.. ఎవడ్రా నీకు అల్లుడు , ఇలాంటి నీతి, నిజాయితీ లేని ఇంటికి నేను అల్లుడిని అవ్వనని చెబుతాడు పార్ధు.

కూర్చొని మాట్లాడటానికి, కూలాసాగా చర్చించుకోవడానికి ఇంకెం లేదని అంటాడు. ఆరోజు పెళ్లి ఆపమని పోలీసులకు ఫోన్ చేసి, ఏమీ తెలియని అమాయకురాలిగా పీటల మీద కూర్చున్నావని భానుమతి మీద ఫైర్ అవుతాడు పార్ధు. అసలేం జరిగిందో చెప్పాలని భానుమతి వస్తుండగా , నువ్వు చెప్పింది వినడానికి నేను పాత పార్ధుని కాదని అంటాడు . నీ కూతురి వల్లే నా తండ్రి అందరి ముందు తలదించుకున్నాడని, ఎలాంటి కూతురిని కన్నావ్‌రా అని మండిపడతాడు పార్ధు.

తప్పంతా నాదేనని నన్ను శిక్షించండి, నా కుటుంబాన్ని ఏం అనొద్దని భానుమతి చెబుతుండగా ఆమెను కొట్టబోతాడు. దయచేసి మమ్మల్ని క్షమించి వదిలేయాలని కోటి బ్రతిమలాడుతుండగా అతనిని మీద చేయి చేసుకుంటాడు పార్ధు. నన్ను వదిలేయమని కోటి కలవరిస్తూ ఉండటంతో అంతా పరిగెత్తుకుంటూ వస్తారు. పార్ధుకి అసలు విషయం తెలిసిపోయిందని , మనల్ని చంపేస్తాడని వణికిపోతాడు కోటి. నేను చేసిన తప్పు ఇంత వరకు వస్తుందని ఊహించలేక పోయానని అనుకుంటుంది భానుమతి.

ఉదయాన్నే ఓ కుర్రాడిని తీసుకొచ్చి బలరామ్ కాళ్ల మీద పడేస్తాడు పార్ధు. ఎవరితను అని బలరామ్ అడగ్గా.. పెళ్లి ఆగిపోవడానికి కారణమైన వాడని చెప్పడంతో బలరామ్ అతనిని చితకబాదుతాడు. నా ఫోన్ నుంచి కాల్ వెళ్లిన మాట నిజమే కానీ.. ఆ రోజు ఆ ఫోన్ కాల్ పోలీసులకని నాకు తెలియదని అంటాడు ఆ కుర్రాడు. ఆ రోజు ఒకమ్మాయి నా దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకుందని చెబుతాడు . దాని కోసం నాకు 1000 రూపాయలు కూడా ఇచ్చిందని అంటాడు. వాడి మాటలతో శాంభవి వణికిపోతుంది. ఆ అమ్మాయి ఎవరు? ఎలా ఉంటుంది? అని పార్ధు అడుగుతాడు. ఇంతలో భువన అక్కడికొచ్చి వాడిని చూసి వణికిపోతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Read more about: bhanumathi sai kiran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X