Bhanumathi April 25th Episode : పార్ధు నుంచి తప్పించుకున్న భువన .. భానుకి కోటి వార్నింగ్ , పెళ్లి పనులు షురూ
భానుమతి చీర కట్టుకుని రావడంతో ఆమెను చూసి పార్ధు సంబరపడిపోతాడు. భానును కళ్లు మూసి తీసుకెళ్లి కేక్ కట్ చేసే ప్లేస్‌లో నిలబెడతాడు. ఆ సర్‌ప్రైజ్‌కి భానుమతి షాక్ అవుతుంది. ఇంత అభిమానం తట్టుకోలేనని నా వల్ల మీ కుటుంబం పరువు బజారున పడిందని బాధపడుతూ నిజం చెప్పాలని అనుకుంటుంది. ఇంతలో కోటి కుటుంబం రావడంతో ఆగిపోతుంది. అనంతరం పార్ధుతో కలిసి కేక్ చేస్తుంది భానుమతి. ఆ కాసేపటికే పార్ధుకి ఫోన్ వస్తుంది. పోలీసులకు ఫోన్ చేసి పెళ్లి ఆపిన అమ్మాయి ఎవరో తెలిసిందని అవతలి వ్యక్తి చెప్పడంతో కోటి కుటుంబం వణికిపోతుంది.
ఆ వ్యక్తిని కలిసి పార్ధుకి ఫోన్ చేసిన వారి నెంబర్ ఇస్తాడు. పార్ధు తన ఇంటికి కోపంగా వచ్చి తనను చంపేసినట్లుగా కోటి కలగంటూ ఉంటాడు. బలరామ్ ఇంట్లో ఉండగా భువనకి ఫోన్ ఇచ్చిన కుర్రాడిని తీసుకొచ్చి తండ్రి కాళ్ల మీద పడేస్తాడు పార్ధు. పెళ్లి రోజు పోలీసులకు ఫోన్ ఇతని మొబైల్ నుంచే వెళ్లిందని పార్ధు చెప్పేసరికి.. బలరామ్ కోపంతో ఆ కుర్రాడిని చితకబాదుతాడు. వాడు భువనని ఎక్కడ గుర్తుపడతాడోనని శాంభవి వణికిపోతూ కనిపిస్తుంది. ఇదంతా గల ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 25వ తేదీ ఎపిసోడ్ 41లో ఏం జరిగిందంటే?

తాను ఫోన్ తీసుకున్న కుర్రాడిని ఇంట్లో చూసిన భువన కంగారుపడిపోతుంది. అక్కడి నుంచి వెళ్లిపోమ్మని శాంభవి సైగలు చేయడంతో భువన కంగారుగా వెళ్లిపోతుండగా ఫ్లవర్ వాజ్‌కి తగలడంతో అది కింద పడుతుంది. దాంతో ఆ కుర్రాడు భువన వైపు చూస్తాడు. ఆ దెబ్బతో శాంభవికి చెమటలు పడతాయి. భువనని చూసి ఆ కుర్రాడు టెన్షన్ పడుతుండటంతో పార్ధు ఆమెను పిలుస్తాడు. నీ దగ్గర ఫోన్ తీసుకుంది ఈ అమ్మాయేనా? అని పార్ధు నిలదీయగా.. ఈ అమ్మాయేనని అంటాడు ఆ కుర్రాడు. ఆ దెబ్బతో బలరామ్ కుటుంబ సభ్యులు షాక్ అవుతారు.
ఈ అమ్మాయి లాగే ఉంది కానీ ఈ అమ్మాయి కాదని చెబుతాడు ఆ కుర్రాడు. దాంతో శాంభవి, భువనలు ఊపిరి పీల్చుకుంటారు. వాడి దగ్గర వివరాలు తీసుకున్న పార్ధు.. ఆ అమ్మాయి ఎప్పుడు కనిపించినా? నాకు ఫోన్ చేసి చెప్పాలని వాడిని వదిలేస్తాడు. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసిన నెంబర్ కనుక్కున్నాను కానీ మీ పరువు తీసిన ఆ అమ్మాయి ఎవరో కనుక్కోలేక పోయానని బాధపడతాడు పార్ధు. కానీ ఖచ్చితంగా కనిపెడతానని? తేల్చిచెబుతాడు పార్ధు.
ఆ అమ్మాయి ఎవరో తెలియకపోవడంతో పార్ధు బయటికొచ్చి బాధపడతాడు. అసలు మా కుటుంబం మీద అంత పగ ఎవరికుంది? పోలీసులకు ఎవరు ఫోన్ చేశారని ఆలోచిస్తుంటాడు. ఇంతలో సూరి రావడంతో చాలా అవమానంగా ఉందని అంటాడు. నాన్నని ఇంత బాధపెట్టిన వాళ్లని కనుక్కోలేకపోతున్నానని చెబుతాడు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నాం కదా? ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా దొరుకుతుందని చెబుతాడు సూరి. మధ్యలో భువన మీద నీకు ఎందుకు అనుమానం వచ్చిందని పార్ధుని ప్రశ్నిస్తాడు సూరి.
ఈ పెళ్లి ఆపే అవసరం కానీ? ఈ పెళ్లి ఆగిపోతే సంతోషపడేవాళ్లు కానీ మన కుటుంబంలో ఎవరున్నారు? అని పార్ధు అడగ్గా.. శాంభవి పిన్ని, భువన అంటాడు. వాళ్లకి కావాల్సింది నేను భువనని పెళ్లి చేసుకోవడం, అందువల్ల భానుమతితో జరిగే పెళ్లిని చెడగొట్టాలని ఖచ్చితంగా వాళ్లు ఏదో ఒక ప్రయత్నం చేసే ఉంటారని చెబుతాడు. కానీ ఆ కుర్రాడు భువన కాదని చెప్పాడు కదా అని సూరి అనగా.. ఆ అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటానని అంటాడు పార్ధు.
ఇంతలో పార్ధుకి కోటి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా అని అడుగుతాడు. ఇంకా దొరకలేదని, కానీ ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసిందో అది మాత్రం తెలియలేదని చెబుతాడు పార్ధు. ఆ మాటలతో కోటి షాక్ అవుతాడు. ఫోన్ నెంబర్ దొరికితే ఆ అమ్మాయి కూడా దొరికిపోతుందని అంటాడు కోటి. ఈ విషయాలు మీరు పట్టించుకోవద్దని, నేను చూసుకుంటానని ఫోన్ పెట్టేస్తాడు పార్ధు. ఇంకా భానుమతి గురించి పార్ధు వాళ్లకి తెలియలేదని ప్రమీల, కుమారిలకు చెబుతాడు కోటి.
వాళ్లంతా చాలా మంచి మనుషులని మనల్ని ఎంతో ఆదుకున్నారని.. ఇలాంటి వాళ్ల దగ్గర నిజం దాయడం కరెక్ట్ కాదని అంటుంది భానుమతి. ఆ మాటలతో ఊగిపోయిన కోటి.. వెంటనే కుమారి గొంతు పట్టుకుంటాడు. మీ అమ్మ ప్రాణం కంటే నీకు నిజాయితీయే ఎక్కువ అనుకుంటే వెళ్లి వాళ్లకి నిజం చెప్పమని అంటాడు కోటి. మీకు మాటిస్తున్నాను, నేను నిజం చెప్పానని అంటుంది భానుమతి.
నిజం బయటపడి ఉంటే ఈరోజు మనల్ని ఇంట్లో నుంచి గెంటేసే వాళ్లని శాంభవితో అంటుంది భువన. అయినా ఆ బాబూరావు గాడు నా గురించి ఎందుకు చెప్పలేదని భువన చెబుతుండగా ఆ బాబురావు వస్తాడు. నిజం బయటపడితే నాకేం వస్తుందని అనడంతో భువన, శాంభవిలు షాక్ అవుతారు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? అని శాంభవి నిలదీయడంతో మీ చేతుల్లో నుంచి డబ్బులు బయటికి రాకపోతే, నా నోట్లో నుంచి నిజం బయటికొస్తుందని బెదిరిస్తాడు బాబూరావు. దాంతో తన చేతికి ఉన్న బంగారు గాజుని వాడికి ఇచ్చి నిజం బయటికి రాకుడదని చెబుతుంది శాంభవి. పోలీస్ కానిస్టేబుల్‌ని కలిసి ఆ రోజు ఫోన్ చేసింది మా అమ్మాయి కాదని చెప్పమని అడుగుతాడు కోటి. అంతా నేను చూసుకుంటానని ఆ కానిస్టేబుల్ మాట ఇస్తాడు.
భానుమతి, పార్ధుల ఇళ్లలో పెళ్లి పనులు మొదలవుతాయి. ఈరోజుతో నా కలలు, ఆశలు అన్నీ నాశనం అయిపోతున్నాయని భానుమతి బాధపడుతుంది. అటు పార్ధుతో పెళ్లి కాకపోవడంతో భువన బాధపడుతుంది. భానుమతి ఇంటికొచ్చి గొడవ చేస్తుంది. నా జీవితాన్ని లాక్కుని నువ్వు సంతోషంగా ఉంటావా? అని భానుమతిని ప్రశ్నిస్తుంది భువన. ఈ విషయం పార్ధుకి కోటి ఫోన్ చేసి చెప్పడంతో పార్ధు కోపంతో రగిలిపోతాడు. అక్కడికి ఎందుకు వెళ్లావ్.. నీ మెడలో నేను తాళి కట్టనని తేల్చిచెబుతాడు . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











